Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
రోగనిరోధక శక్తిని పెంచే హెల్తీ ఫుడ్స్
రోగనిరోధక వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. కాబట్టి రోగనిరోధక వ్యవస్థకు కావాల్సిన శక్తిని అందించడం అవసరం. అది సరిగా.. పనిచేసినప్పుడు.. ఆరోగ్యంగా ఉండగలుగుతారు. బాక్టీరియా, ఫంగస్, వైరస్ లు శరీరంలోకి ప్రవేశించి.. అవి ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయి. వీటన్నింటిని బయటకు పంపిస్తూ.. శరీరానికి కావాల్సిన శక్తిని అందిచడానికి వ్యాధినిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా.. స్ట్రాంగ్ గా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇమ్యూన్ సిస్టమ్ శక్తిని కోల్పోవడం వల్ల అనారోగ్య సమస్యలు మొదలవుతాయి.
READ MORE: వింటర్లో రోగనిరోధకతను పంచే 15సూపర్ వెజిటేబుల్స్
శరీరానికి కాస్త ఉపశమనంతోపాటు అవసరమైన ఆహారం తీసుకున్నప్పుడే రోగనిరోధక వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉంటుంది. మద్యపానం, పొగత్రాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే.. ముందుగా సరైన డైట్ ఫాలో అవ్వాలి. తాజా పండ్లు, కాయకూరలు ద్వారా ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది. దాంతో పాటు ఇంకా ఎలాంటి ఆహారంలో ఇమ్యూనిటీ పవర్ పెంచే గుణాలున్నాయో తెలుసుకుందాం.

టీ
గ్రీన్ టీ, బ్లాక్ టీ.. రెండూ కూడా ఆరోగ్యానికీ, వ్యాధినిరోధక వ్యవస్థకు మంచిదే. కానీ పరిమితి మించి తాగడం మంచిది కాదు. రోజుకి ఒకటి లేదా రెండు కప్పులు తాగితే మంచిది.

పచ్చి వెల్లుల్లి
వ్యాధినిరోధక శక్తి పెంచడంలో వెల్లుల్లి పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఇందులో జింక్, సల్ఫర్, సెలీనియమ్, విటమిన్ ఏ, ఈ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ వంటి గుణాలు కూడా ఉంటాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి రోజుకి ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బని తీసుకోండి.

యోగర్ట్
పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరు సక్రమంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది.

ఓట్స్
ఓట్స్ లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో వచ్చే అనారోగ్య సమస్యలతో పోరాడటానికి సహాయపడుతుంది. కాబట్టి.. ఓట్స్ ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

విటమిన్ డి
విటమిన్ డి కావాలని.. ఎండలో తిరగడం మంచిది కాదు. కాబట్టి.. ఉదయాన్నే సూర్యరశ్మి పడేలా చూసుకుంటే ఆరోగ్యానికి మంచిది. మధుమేహం, గుండె సంబంధిత సమస్యల నుంచి ప్రొటెక్ట్ చేయడానికి విటమిన్ డి తోడ్పడుతుంది. కాబట్టి ఉదయాన్నే విటమిన్ డి పొందడానికి ప్రయత్నించండి.

నిమ్మ రసం
అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి విటమిన్ సీ చాలా అవసరం. అంతేకాదు.. వైరస్, బ్యాక్టీరియా నుంచి కూడా కాపాడటానికి విటమిన్ సీ చాలా అవసరం. కాబట్నిమ్మరసం లేదా ఆరంజ్ జ్యూస్ తాగాలి.

జింక్
శరీరానికి కావాల్సిన తెల్ల రక్తకణాలను జింగ్ ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఆకుపచ్చని కాయకూరలు, ఆకుకూరలు, ధాన్యాలు, గింజలు తీసుకోవడం ద్వారా జింక్ పొందవచ్చు.
చూశారు కదా.. ఈ టిప్స్ అన్నింటినీ.. మీ డైట్ లో చేర్చుకుని.. వారం రోజుల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోండి.



Click it and Unblock the Notifications