Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026
డాక్టర్ ప్రిస్క్రిప్సన్స్ తో తగ్గని దీర్ఘకాలిక వ్యాధులకు ఎక్సర్ సైజ్ తో చెక్ !
మనం ప్రతి రోజూ తీసుకొనే ఆహారమే మనం రోజంతా ఆరోగ్యంగా ఉండటానికి ఔషధాల్లా పనిచేస్తాయి. ఈ విషయాన్ని చాలా మంది ఆహార నిపుణులు కూడా నిర్ధారించారు. మనం తీసుకొనే నేచురల్ ఫుడ్సే మనల్ని అనేక వ్యాధుల నుండి రక్షింపబడి, అనారోగ్య సమస్యలను దూరం చేస్తున్నాయంటున్నారు కొందరు నిపుణులు. అదే విధంగా, మన శరీరానికి ఆహారం ఒక్కటే కాదు, వ్యాయామం కూడా ఒక ఔషధంలా పనిచేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతి రోజూ మనం తీసుకొనే హెల్తీ ఫుడ్స్ లాగే, హెల్తీ ఎక్సర్ సైజ్ వల్ల కూడా కొన్ని ప్రత్యేకమైన వ్యాధులను దూరం చేసుకొని, జీవితాంతం స్ట్రాంగ్ గా మరియు ఆరోగ్యంగా జీవించవచ్చు.
డాక్టర్ల వద్దకు వెళ్లినప్పుడు వారించే ప్రిస్క్రిప్సన్స్ కన్నా వ్యాయామం ఎంతో బెటర్ అని చెప్పవచ్చు . ఎందుకంటే కెమికల్స్ తో తయారుచేసే మందుల కన్నా, సహజంగా మనం చేసే వ్యాయామాల ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
READ MORE: పరుగెత్తడం వల్ల 20 మేజర్ ఆరోగ్య ప్రయోజనాలు
ఒక్క వ్యాయామంతోనే ప్రమాదకరమైన వ్యాధులను విజవంతంగా తగ్గించుకొన్న వారు కూడా చాలా మంది ఉన్నారు. శ్వాసకోస సమస్యల నుండి, ఆస్త్మా, డిప్రెషన్, మలబద్దకం, అధికబరువు, కాళ్ళవాపులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలెన్నో..మందులతో కాకుండా వ్యాయామంతోనే చాలా ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు. మరీ ముఖ్యంగా ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక్క సారి వ్యాయామాన్ని మొదలు పెడితే చాలు ప్రయోనాలను మీరే గుర్తించి, లైఫ్ ను ఎంజాయ్ చేస్తారు.
మరి రెగ్యులర్ ఎక్సర్ సైజ్ వల్ల పొందే మెడిసినల్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం....

మలబద్దకం నివారిస్తుంది:
రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల పెద్ద పేగుల నుండి త్వరగా ఆహారం ముందుకు నెట్టుతుంది. మరియు ఇది నీరు గ్రహించడానికి నివారిస్తుంది. స్టూల్ హార్డ్ గా ఉన్నప్పుడు మలబద్దక సమస్య అధికంగా ఉంటుంది. వ్యాయామం చేయడం వల్ల పేగు చుట్టూ ఉన్న కండరాలు వదులుచేసి ప్రేగు నుండి స్టూల్ మరింత వేగంగా ముందుకు నెట్టడానికి సహాయపడుతుంది.

జీర్ణ సమస్యలను నివారిస్తుంది:
కొంత మంది ఎప్పుడూ అజీర్ణంతో బాధపడుతుంటారు అలాంటి వారికి రెగ్యులర్ ఎక్సర్ సైజ్ వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది . దాంతో అనేక జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

శ్వాస సమస్యలను నివారిస్తుంది :
కార్డియో మరియు మార్షల్ ఆర్ట్స్ వ్యాయామాల వల్ల దీర్ఘకాలిక శ్వా స సంబంధిత సమస్యల నుండి ఎంతో మంది ఉపశమనం పొందారాన్న విషయం మీకు తెలుసా?ప్రతి రోజూ వర్కౌట్ చేయడం వల్ల ఊపిరితిత్తులు మరింత సులభంగా పనిచేస్తాయి.

నిద్రలేమిని నివారిస్తుంది:
తై చి మరియు యోగ వంటి కొన్ని వ్యాయామాలు నిద్ర బాగా పట్టేందుకు సహాయపడుతాయి. రెగ్యులర్ వ్యాయామం వల్ల నిద్రలేమి సమస్యలను నివారించుకోవచ్చు.

కార్టిసోల్:
అధిక ఒత్తిడి వల్ల శరీరంలో అధికంగా కార్టిసోల్ ఉత్పత్తి అవుతుంది. దాంతో హార్ట్ రేట్, బిపి మరియు కొలెస్ట్రాల్ లెవల్స్ మీద దుష్ప్రభావాలు చూపుతుంది . వీటన్నింటికి వ్యాయామం ఒక మంచి బూస్టర్ వంటిది.

డిప్రెషన్:
ఎవరైతే డిప్రెషన్ కోసం చికిత్స తీసుకుంటున్నారో, అలాంటి వారికి రెగ్యులర్ వ్యాయామాల వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది. మరియు రెగ్యులర్ ఎక్సర్ సైజ్ వల్ల ఇంక మందు డిప్రెషన్ కు లోనవ్వకుండా నివారిస్తుంది.

బ్యాక్ పెయిన్ :
నిరంతరం కూర్చొనే పనిచేసే ఉద్యోగులు ఎక్కవుగా లోయర్ బ్యాక్ పెయిన్ తో బాధపడుతుంటారు . అలాంటి వారికి కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు కొంత వరకూ ఉపశమనం కలిగిస్తాయి. కూర్చొన్న చోటే కొద్దిగా అటూ ఇటూ స్ట్రెచ్ చేయడం వల్ల వెన్ను నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

ఎరిక్టైల్ డిస్ఫంక్షన్:
రెగ్యులర్ వ్యాయామం వల్ల శరీరంలో అవయావాలకు రక్తప్రసరణ మెరుగ్గా జరిగడం వల్ల జీవక్రియలు వేగవంతంగా చురుకుగా జరగుతాయి. వీటితో పాటు, పురుషులో లైంగిక సమస్యలను నివారించుకోవచ్చు .

హార్ట్ రేట్ సమస్యలు:
రెగ్యులర్ వ్యాయామం ద్వారా హార్ట్ కు సంబంధించిన అనేక సమస్యలను చాలా ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు . వ్యాయమం హార్ట్ మరింత హెల్తీగా పనిచేయడానికి సహాపడుతుంది.



Click it and Unblock the Notifications