Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
వార్నింగ్: మీ శరీరంలో ప్రొటీన్స్ తగ్గాయనడానికి సంకేతాలివే..!!
చాలామంది తీసుకునే ఆహారంలో ప్రొటీన్స్ చాలా తక్కువగా ఉంటాయి. శరీరంలో ప్రొటీన్స్ సరైన స్థాయిలో అందినప్పుడే హార్మోన్స్, ఎంజైమ్స్ సక్రమంగా పనిచేయగలుగుతాయి. కండరాలు, ఎముకలు, చర్మం, జుట్టు, మెదడు పనితీరులో ప్రొటీన్స్ కీలకపాత్ర పోషిస్తాయి.
అసలు సమస్య ఏమిటంటే.. ప్రొటీన్స్ మన శరీరంలో తక్కువయ్యాయి అని గుర్తించడం కష్టం. కానీ.. ప్రొటీన్స్ తక్కువగా ఉన్నాయని తెలుసుకోవడానికి కొన్ని విషయాలపై దృష్టి పెట్టాలి. మొదటి సమస్య బరువు పెరగడం. ఎప్పుడైతే అనవసరంగా బరువు పెరుగుతున్నారో.. అప్పుడు ప్రొటీన్ లెవెల్స్ తక్కువయ్యాయని గుర్తించాలి.
తక్కువ ప్రొటీన్ లెవెల్స్ వల్ల మెటబాలిజం స్థాయి తగ్గి బరువు పెరగడానికి కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను ప్రొటీన్ లోపంగా గుర్తించాలి. శరీరంలో ప్రొటీన్ స్థాయిలు తగ్గాయని తెలిపే హెచ్చరిక సంకేతాలేంటో.. ఇప్పుడు చూద్దాం..

తీసుకునే ఆహారం
మన శరీరంలో ప్రొటీన్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు నాన్ న్యూట్రీషనల్ ఫుడ్, అనారోగ్యకరమైన ఆహారాలు ఎక్కువగా తీసుకుంటాం. ఇందులో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. చాక్లెట్స్, పాస్తా, చిప్స్, సాఫ్ట్ డ్రింక్స్ వంటివి ఎక్కువగా తీసుకుంటున్నారంటే.. ప్రొటీన్ లోపం ఉందని గుర్తించాలి.

కీళ్లు, కండరాల నొప్పులు
శరీరంలో ప్రొటీన్స్ తగ్గినప్పుడే కీళ్లు, కండరాల నొప్పులు బాధిస్తాయి. జాయింట్స్ మధ్యలో ఉండే సినోవియల్ జెల్ ప్రొటీన్స్ ద్వారాను ఉత్పత్తి అవుతుంది. వాటి ద్వారా కండరాలు ఉత్తేజం అవుతాయి. ప్రొటీన్స్ స్థాయి శరీరంలో పడిపోయినప్పుడు కీళ్లు, కండరాల నొప్పుల సమస్య మొదలువుతుందని గుర్తుంచుకోండి.

అలసిపోవడం
తక్కువ ప్రొటీన్ లెవెల్స్ ఉంటే.. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గి.. మూడ్ లో చాలా మార్పులు వస్తాయి. త్వరగా చిరాకు పడటం, మానసికంగా ఒత్తిడికి లోనవడం, అలసిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శారీరక, మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది.

నిద్రపోలేకపోవడం
ఎప్పుడైతే మన శరీరంలో ప్రొటీన్స్ తక్కువగా ఉంటాయో.. నిద్రపట్టడం చాలా కష్టమవుతుంది. నిద్రపట్టక మధ్య రాత్రుల్లో లేవడం కూడా జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం.. ఎక్కువగా స్వీట్స్ తీసుకోవడం. దీనివల్ల బ్రెయిన్ రిలాక్సేషన్ కోల్పోతుంది.

తరచుగా అనారోగ్యం
ఒకవేళ ప్రొటీన్ లెవెల్స్ తక్కువగా ఉంటే.. తరచుగా అనారోగ్యం పాలవుతుంటారు. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి, ఇన్ఫెక్షన్లతో పోరాడే ఇమ్యునోగ్లోబిలిన్స్ తగ్గడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువుతాయి. ఇమ్యునోగ్లోబిలిన్స్ ని ప్రొటీన్స్ ఉత్పత్తి చేస్తాయి. అలాగే ప్రొటీన్స్ తగ్గినప్పుడు తెల్ల రక్తకణాల కౌంట్ కూడా తగ్గిపోతాయి.

బ్రెయిన్ ఫంక్షన్
ప్రొటీన్స్ తక్కువైనప్పుడు మెదడు పనితీరు కూడా తగ్గిపోతుంది. ప్రొటీన్స్ ద్వారా న్యూరో ట్రాన్స్మిట్స్ పనిచేస్తాయి. కాబట్టి ప్రొటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల.. మెంటల్ హెల్త్ తో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది. దీంతో ఎలాంటి వర్క్ అయినా ఈజీగా చేయవచ్చు.

బరువు పెరగడం
మీరు బరువు పెరుగుతున్నారని గమనించారంటే.. మీ శరీంలో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా లభించే ప్రొటీన్స్ తక్కువగా ఉన్నాయని గుర్తించాలి. ప్రొటీన్స్ మెటబాలిజం స్థాయిని పెంచుతాయి. అలాగే యాక్టివ్ గా ఉండటానికి సహాయపడతాయి. ఫ్యాట్స్ కరిగిస్తాయి. కాబట్టి ప్రొటీన్స్ పుష్కలంగా అందించే ఆహారాన్ని డైట్ లో చేర్చుకోవడం వల్ల స్లిమ్ గా, ఎనర్జిటిక్ గా ఉండవచ్చు.



Click it and Unblock the Notifications