Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
వరల్డ్ రన్నింగ్ డే స్పెషల్: రన్నింగ్ తో ఆయుష్మాన్ భవ
వ్యాయామమే అన్నింటికంటే ఉత్తమమైన మెడిసిన్. ఇది సత్యం. ఎందుకంటే.. వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని.. శాస్త్రీయంగా నిరూపితమైంది. వారానికి 150 నిమిషాలు నడవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
READ MORE: బరువు తగ్గించుకోవడానికి , సైకిల్ తొక్కడం vs పరుగు ఏది ఉత్తమం
రన్నింగ్ చేయడం వల్ల ఒబేసిటీని అరికట్టవచ్చు, టైప్ 2 డయాబెటిస్, గుండ్ జబ్బులు, హై బ్లడ్ ప్రెషర్, స్ర్టోక్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి బయటపడటానికి సహకరిస్తుంది. అంతేకాదు శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్ గా జీవితం చాలా హ్యాపీగా, హెల్తీగా ఉండాలంటే రన్నింగ్ సరైన ఔషధమని అధ్యయనాలు చెబుతున్నాయి. వరల్డ్ రన్ డే సందర్భంగా.. రన్నింగ్ వల్ల కలిగే ఆశ్చర్యకర ఉపయోగాలేంటో చూడండి.

సంతోషం
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రన్నింగ్ సహాయపడుతుంది. డిప్రెషన్ లో ఉన్నవాళ్లు కేవలం 30 నిమిషాలు థ్రెడ్ మిల్ పై నడవడం వల్ల.. ఈజీగా డిప్రెషన్ నుంచి బయటపడతారట. డిప్రెషన్ నుంచి కోలుకోవాలంటే.. శారీరక వ్యాయామం సరైన మందు. కాబట్టి రోజూ రన్నింగ్ చేయడం అలవాటు చేసుకోండి.. జీవితాన్ని హ్యాపీగా, హెల్తీగా మార్చుకోండి.

స్లిమ్ గా తయారవడానికి
సాధారణంగా వ్యాయామం చేసేటప్పుడు క్యాలరీలు తగ్గుతాయని అందరికీ తెలుసు. కానీ.. రన్నింగ్ చేసి.. ఆపేసిన తర్వాత కూడా క్యాలరీలు కరుగుతూ ఉంటాయని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. కాబట్టి త్వరగా స్లిమ్ అవడానికి రన్నింగ్ బెస్ట్ ఆప్షన్.

మోకాళ్లు దృఢంగా మారడానికి
రన్నింగ్ చేయడం వల్ల మోకాళ్లకు హాని కలుగుతుందని చాలా మంది అపోహ పడుతుంటారు. అయితే.. రన్నింగ్ వల్ల మోకాళ్లు ఇంకా దృఢంగా మారుతాయి. మోకాళ్లతో పాటు.. శరీరంలోని అన్ని జాయింట్స్, ఎముకలు కూడా గట్టిపడతాయి.

వయసు పెరుగుతున్నా యాక్టివ్ గా ఉండటానికి
రన్నింగ్ వల్ల ఆరోగ్యంతో పాటు.. వయసు ఛాయలు కనిపించకుండా.. ఉండటానికి సహకరిస్తుంది. అంతేకాదు వయసు పెరుగుతున్నామన్న భ్రమను పక్కకు నెట్టేసి.. రోజు రోజుకి షార్ప్ గా మార్చేస్తుంది రన్నింగ్. స్ర్టోక్ పేషంట్స్ రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల మెమరీ, ల్యాంగ్వేజ్, ఆలోచనా శక్తి, సమస్యలకు పరిష్కారాలు చెప్పే శక్తి 50 శాతం పెరుగుతుంది. అంతేకాదు వీళ్లలో కాన్సంట్రేషన్, ప్లానింగ్, ఆర్గనైజింగ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది.

క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది
రన్నింగ్ క్యాన్సర్ ని నయం చేయలేకపోవచ్చు. కానీ.. క్యాన్సర్ ని అరికట్టడానికి రన్నింగ్ సహకరిస్తుంది. రన్నింగ్ రెగ్యులర్ గా చేయడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ ల ముప్పు ఉండదు. ఒకవేళ క్యాన్సర్ తో బాధపడుతున్న వాళ్లు రన్నింగ్ చేయడం వల్ల జీవితకాలం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆయుష్షు పెరగడానికి
సగటున మీరు వారానికి 5 రోజులు 30 నిమిషాలు చొప్పున రన్నింగ్ చేయడం వల్ల మీ ఆయుష్షు పెరుగుతుంది. పొగతాగే వాళ్లకు 4 ఏళ్లు, క్యాన్సర్ పేషంట్స్ కి 5 ఏళ్లు, హార్ట్ పేషంట్స్ కి 4 ఏళ్లు జీవితం కాలం పెరిగినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
చూశారుగా రన్నింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు. ఇన్ని ఆరోగ్య రహస్యాలున్న రన్నింగ్ ని నిర్లక్ష్యం చేయకండి. ఒకవేళ ఇప్పటి వరకు రన్నింగ్ మొదలుపెట్టకపోతే.. ఇవాళ వరల్డ్ రన్నింగ్ డే స్పెషల్ గా స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ .



Click it and Unblock the Notifications
