Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
కాన్సెంట్రేషన్, షార్ఫ్ నెస్ పెంచే 10 ఎక్సర్ సైజ్
వ్యాయామం మన దినచర్యలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే మన శరీరంలో హెల్తీగా మరియు ఫిట్ గా ఉండాలంటే వ్యాయామం ఎంతో దోహదపడుతుంది. అయితే వ్యాయామం ఫిజికల్ గా మరియు మాససికంగా ఏవిధంగా సహాయపడుతుంది?
వ్యాయామం చేయడం చాలా ముఖ్యం మరియు అవసరం అని మనకు తెలుసు, అయితే బద్దకం వల్ల వ్యాయామాన్ని దాటవేస్తుంటాం . కొంత మంది వ్యాయామం అన్న పదాన్నే మర్చిపోయే బ్రతికేస్తుంటారు. మరికొందరకేమో రెగ్యులర్ గా వ్యాయామం చేయడానికి కొద్దిగా ప్రోత్సహం అవసరం అవుతుంది. అలాంటి వారిలో మీరు ఒకరైతే, మీకోసమే ఈ విలువైన సమాచారం.
రెగ్యులర్ గా వ్యాయామం చేయడానికి ప్రధాణ కారణం ఇది మీ మొత్తం ఆరోగ్యానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది. వ్యాయామం అనేది వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్న పెద్ద అన్ని వయస్సుల వారు చేయవల్సినటువంటి ఒక ఆరోగ్యకరమైన అలవాటు. వ్యాయామం చేయడానికి బద్దకించడం లేదా ఆలస్యం చేయడం వల్ల జీవితంలో ఎన్నో కోల్పోవల్సి వస్తుంది. వ్యాయామం వల్ల పొందే గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోవడం వల్ల ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వ్యాయామం చేయడం ప్రారంబించి మీ దిన చర్యలో ఒక అలవాటుగా మార్చుకోండి . ఫిజికల్ యాక్టివిటి స్త్రీ మరియు పురుషులు ఇద్దరికి చాలా ఉపయోగకరం.
వ్యాయామం చేయని వారికి కంటే వ్యాయామం చేసే వారు ఆరోగ్య పరంగా చాలా హెల్తీ గా ఉంటే అనారోగ్య సమస్యలుకు దూరంగా ఉంటూ మరికొంత ఆయుష్యును పెంచుకుంటారని కొన్ని పరిశొధనల ద్వారా పేర్కొనబడినది . కాబట్టి, రెగ్యులర్ గా వ్యాయమం ఎందుకు చేయాలన్న విషయం తెలుసుకోవడా చాలా అవసరం. శారీరక వ్యాయామం లేకపోవడం అనేది కార్డియో వ్యాస్కులర్ వ్యాధులకు ఒక కారణంగా గుర్తించవచ్చు.
వ్యాయామం చేయడానికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పర్సనల్ డెవలప్ మెంట్ , మిమ్మల్ని నమ్మకంగా మార్చుతుంది, మీ ఆత్మగౌరవం మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఏకాగ్రతను అలర్ట్ నెస్ ను పెంచుతుంది.

కుర్చీలో కూర్చొన్నట్లు కూర్చోవడం:
కుర్చిలో ఇలా కూర్చోవడం అంత సులభం కాదు, ఇది చాలా డిఫికల్ట్ గా ఉంటుంది . మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్త ఈ పోజిషన్ లో కూర్చొవడం వల్ల ఏకాగ్రత మరియు అలర్ట్ నెస్ పెరుగుతుంది.

ఏకాగ్రతగా మీ చేతి వేళ్లనే చూస్తుండాలి:
చేర్ మీద అలాగే కూర్చొని, తలను ముందుకు పెట్టాలి. తర్వాత మీ కుడిచేతిని మీ కంటికి సమంగా పైకి లేపాలి. ఇప్పుడు కుడిచేయి బొటన వెలును ఒకే క్రమంలో తల, శరీరం ఏమాత్రం కదల్చకుండా చూస్తుండాలి. కొద్ది సేపైన తర్వాత ఎడమవైపు చేయాలి.

స్ట్రెచ్ పెన్సిల్ వ్యాయామం:
పెన్సిల్ తీసుకుని ఏచేతిలోనైనా పెట్టుకోవాలి, మీ కంటి చూపు మేర స్ట్రెచ్ చేయాలి. పెన్సిల్ మొదలు నుండి కొనవరకూ తల కదల్చకుండా ఏకాగ్రతతో చూడాలి.

ఏకాగ్రత పెట్టి కళ్ళు తెరవడం , మూయడం చేయాలి:
ఒక టేబుల్ కు దగ్గరగా కూర్చొని , టేబుల్ మీద రెండు చేతులు ఉంచాలి. చేతులను తదేకంగా చూస్తూ కళ్ళు తెరడవడం, మూయడం చేయాలి . ఏకాగ్రతను మరియు అలర్ట్ నెస్ పెంచుకోవడానికి ఇది ఒక మంచి వ్యాయామం.

మీకు సాద్యమైనంత మేర ఏకాగ్రతగా చూడాలి:
మీకు ఎంతవరకూ సాధ్యం అవుతుందో అంత వరకూ, అంత దూరం వరకూ ఏకాగ్రతతో చూడాలి. ఇదిమీలో చాలా మార్పు తీసుకొస్తుంది .

మెడిటేషన్:
సందేహం లేకుండా ఏకాగ్రతను పెంచుకోవడానికి మరియు అలర్ట్నెస్ కు మెడిటేషన్ చేయడం ఒక బెస్ట్ వ్యాయామం, చాలా తక్కువ సమయంలో వ్యత్యాసం మీకు తెలిసిపోతుంది.

గాఢ నిద్ర:
గాఢంగా నిద్రించడం కూడా ఏకాగ్రతను పెంచుతుంది. నిద్రవల్ల ఆందోళన మరియు టెన్షన్ తగ్గుతాయి . తర్వాత మీరు చేసే పనిలో ఏకాగ్రత పెరుగుతుంది.

అద్దలో చూడం:
మీరు నమ్ముతారో లేదో , ఇది కూడా ఒక ఉత్తమ వ్యాయామం. తదేకంగా అద్దంలో అలాగే చూస్తుండటం వల్ల కూడా ఏకాగ్రత మరియు అలర్ట్ నెస్ పెరగుతుంది . అద్దంలో చూస్తూ మీ అంతట మీరు మాట్లడటం మంచిది.

మైండ్ కంట్రోల్ చేసుకోవాలి:
కొన్ని విషయాల్లో మనస్సు ఆధీనంలో ఉండదు . డిస్టర్బ్ అవుతుంది . అలాంటి సమయంలో మనస్సును కంట్రోల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీలో ఏకాగ్రత మరియు అలర్ట్ నెస్ పెరుగుతుంది.

చదువు:
బిగ్గరగా చదవడం వల్ల , మీరు ఏం చదువుతున్నారో మీ చెవులకు వినపడుతాయి. ఏకాగ్రత మరియు అలర్ట్ నెస్ పెంచడానికి ఇది ఒక ఎఫెక్టివ్ మార్గం.



Click it and Unblock the Notifications