Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
బరువు పెరగడానికి ఒత్తిడి ఎలా కారణమవుతుంది ?
ప్రస్తుతం చాలా సాధారణంగా ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న సమస్య ఒత్తిడి. ఒత్తిడి మనుషుల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది మొదట్లో పెద్దగా ప్రభావాన్ని చూపించకపోయినా.. రాను రాను అనేక సమస్యలను తీసుకొస్తుంది.
ఒత్తిడిని జయించడానికి 15 సూపర్ ఫుడ్స్
ఒత్తిడి మీపై ఎంత దుష్ర్పభావాన్ని చూపిందనేది.. మీ బరువుని బట్టి తెలుస్తుంది. అకస్మాత్తుగా మీరు బరువు పెరిగిపోవడానికి కూడా ఒత్తిడే కారణమని చాలామందికి తెలియదు. మెట్లు కూడా ఎక్కలేకపోతారు. ఇంతకీ కొత్తది కాదు. బరువు పెరగడానికి ఒత్తిడి ఎలా కారణమవుతుందో ఇప్పుడు చూద్దాం..

హై క్యాలరీలు
ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్న వ్యక్తి.. క్యాలరీల విషయంలో కేర్ తీసుకోలేడు. దీనివల్ల ఎక్కువ మొత్తంలో క్యాలరీలు తీసుకోవడం వల్ల బరువు ఈజీగా పెరిగిపోతారు.

భోజనం
శరీరంలో మెటబాలిజం ప్రక్రియ సజావుగా జరగడానికి రోజు మూడుసార్లు భోజనం కంపల్సరీ. కానీ ఒత్తిడికి లోనవుతున్న వ్యక్తి ఉదయం బ్రేక్ పాస్ట్ తీసుకోవడం మానేస్తాడు. దీనివల్ల మధ్యాహ్నం భోజనం ఎక్కువగా తీసుకుంటారు. దీంతో ఒబెసిటీకి కారణమవుతుంది.

ఫుడ్
ఒత్తిడిని అధిగమించడానికి చాలామంది ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఒత్తిడికి గురవుతున్న వ్యక్తి నిరాశ, బోర్ ఫీలవుతుంటాడు. దీంతో.. ఏదో ఒకటి తినాలనే ఆసక్తి పెరుగుతుంది. దీంతో అధికంగా తినడం వల్ల బరువు ఆటోమెటిక్ గా పెరుగుతారు.

నిద్రలేమి
ఎక్కువగా ఆలోచించడం వల్ల నిద్రకు భంగం ఏర్పడుతుంది. దీంతో ఆహారం ఎక్కువగా తీసుకుంటారు. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది.

కెఫీన్, సిగరెట్, ఆల్కహాల్
ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎక్కువగా కాఫీ, ఆల్కహాల్, స్మోకింగ్ చేస్తుంటారు. ఇవి శరీరంలోని క్యాలరీలు కరగకుండా అడ్డుపడతాయి. దీనివల్ల బరువు పెరగడానికి ఒత్తిడి కారణమవుతుంది.

స్ట్రెస్ హార్మోన్
ఒక వ్యక్తి ఒత్తిడిలో ఉన్నప్పుడు.. కోర్టిసోల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ గ్లూకోజ్ లెవెల్స్ పెంచుతుంది. దీంతో మెటాబాలిజం ప్రక్రియ సాగడానికి అదనపు శక్తి అవసరం అవుతుంది. దీంతో ఫ్యాట్ లెవెల్స్ పెరిగిపోతాయి.

విసెరల్ ఫ్యాట్
ఒత్తిడి కారణంగా విసెరల్ ఫ్యాట్ పెరుగుతుంది. ఇది ఒబేసిటీ, గుండె సంబంధిత వ్యాధులు ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.



Click it and Unblock the Notifications