Latest Updates
-
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం!
కనీసం వారానికి ఒకసారి వంకాయ తినాలనడానికి స్ట్రాంగ్ రీజన్స్..!
ఒకవేళ వంకాయ అంటే పెద్దగా ఇష్టపడకపోతే.. కనీసం వారానికి ఒకసారైనా.. వంకాయను డైట్ లో చేర్చుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇందులో ఉన్న కీలక పోషకాలే ఇందుకు కారణం. వంకాయ తొక్కలో యాంథోసియానిన్స్ ఉంటాయి.
మనలో చాలామందికి వంకాయను చూడగానే నోరూరిపోతుంది. వంకాయ అనగానే గుర్తొచ్చేది గుత్తొంకాయ. ఆ తర్వాత ఫ్రై, కర్రీ, వాంగీ బాత్.. ఇలా రకరకాల వంకాయ వంటకాలు మన ఇండియన్స్ ని ఆకర్షించేవి. అయితే ఇంత నోరూరించే వంకాయలోని వండర్ ఫుల్ బెన్ఫిట్స్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.

వంకాయనే ఎగ్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. దీన్ని ప్రతిరోజూ కూడా తినవచ్చని నిపుణులు సూచిస్తారు. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, ఫైబర్, నాసినిన్, క్లోరోజెనిక్ యాసిడ్ కూడా.. వంకాయలో పుష్కలంగా ఉంటాయి.
ఒకవేళ వంకాయ అంటే పెద్దగా ఇష్టపడకపోతే.. కనీసం వారానికి ఒకసారైనా.. వంకాయను డైట్ లో చేర్చుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇందులో ఉన్న కీలక పోషకాలే ఇందుకు కారణం. వంకాయ తొక్కలో యాంథోసియానిన్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడతాయి. వయసు చాయలు కనిపించనీయవు, ఇన్ల్ఫమేషన్ ని తగ్గిస్తాయి. నరాల వ్యాధులను దూరంగా ఉంచుతాయి.
మరో ముఖ్యమైన ప్రయోజనం ఏంటో తెలుసా.. వంకాయ డయాబెటిస్ తో బాధపడేవాళ్లు చాలా అద్భుతమైన వెజిటబుల్. ఎందుకంటే ఇందులో తక్కువ గ్లిజమిక్ ఇండెక్స్ ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ పేషంట్స్ ఎంత వీలైతే అంత ఎక్కువగా తీసుకోవడం మంచిది. మరి వంకాయలో దాగున్న అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్ ఏంటో చూద్దామా..

బ్లడ్ క్లాట్స్
వంకాయ బ్లడ్ క్లాట్స్ ని కాకుండా అడ్డుకుంటుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ కే, బయో ఫ్లేవనాయిడ్ వల్ల బ్లడ్ లో క్లాట్స్ రాకుండా అడ్డుకునే సత్తా వంకాయలో దాగుంది.

కొలెస్ట్రాల్
వంకాయను సరైన పద్ధతిలో వండి తీసుకోవడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించడం సాధ్యమవుతుంది. కాబట్టి వంకాయను ఫ్రై చేయకుండా, బేక్ చేసి తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ని కరిగించవచ్చు.

జీర్ణ వ్యవస్థ
వంకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు రక్షణ కల్పిస్తుంది. వంకాయలో దాగున్న ప్రయోజనాల్లో ఇది అత్యంత ముఖ్యమైనది.

రక్త ప్రసరణ
వంకాయ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా.. రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫైటో న్యూట్రియంట్స్ మెదడుకి పోషణ అందిస్తాయి.

బ్లడ్ షుగర్ లెవెల్స్
బ్లడ్ షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేయడంలో వంకాయ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే డయాబెటిస్ ని కంట్రోల్ చేస్తుంది. ఇందులో తక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల డయాబెటిస్ కి వంకాయను ఔషధంగా చెప్పవచ్చు.

బ్లడ్ ప్రెజర్
వంకాయలో హై ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి బ్లడ్ ప్రెజర్ ని రెగ్యులేట్ చేయడంలో సహాయపడతాయి. కాబట్టి బ్లడ్ ప్రెజర్ తో బాధపడేవాళ్లు కనీసం వారానికి ఒకసారైనా డైట్ లో వంకాయ చేర్చుకోవాలి.

పోషకాలు
వంకాయలో ఐరన్, క్యాల్షియం, ఇతర ముఖ్యమైన మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ శరీరానికి ముఖ్యమైనవి. కాబట్టి.. శరీరానికి అవసరమైన పోషకాలు అందించే వంకాయను డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.

బరువు తగ్గడానికి
వంకాయలో క్యాలరీలే ఉండవు. అలాగే ఫ్యాట్ ఫ్రీగా ఉంటుంది. అంతేకాదు వంకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. వంకాయని తరచుగా తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications