Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
సమ్మర్లో బాడీ హీట్ తగ్గించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్
సాధారణంగా ప్రతి వ్యక్తికి బాడీ(శరీరం)యొక్క ఉష్ణోగ్రత 98.6డిగ్రీలకు కొంచెం ఇటుఅటుగా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత వాతావరణంలో మార్పుల వల్ల కూడా సంభవిస్తుంది. శరీర ఉష్ణోగ్రత పడిపోవడం లేదా తగ్గడం లేదా పెరగడం వల్ల పలు ఆరోగ్యసమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి మన శరీర ఉష్ణోగ్రతను నిలకడాగా ఉంచుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రస్తుత రోజుల్లో బాడీ హీట్ చాలా మంది ఉన్న కామన్ హెల్త్ ప్రాబ్లెమ్ . బాడీ హీట్(శరీరంలో ఉష్ణోగ్రత)వల్ల కూడా హీట్ స్ట్రెస్ కు కారణం కావచ్చు . బాడీహీట్ దానంతట అదే తగ్గదు ఎందుకంటే శరీరంలోపల అనేక ఆరోగ్య సమస్యలు, ఉదా : అంతర్గత అవయవాలకు నష్టం, వేడి తిమ్మిర్లు, వేడి దద్దుర్లు, మొటిమలు, మైకం మరియు వికారం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మితిమీరిన వేడి వాతావరణం, వేడిలో పనిచేయడం, వేడి కలిగించే ఆహారాలను తీసుకోవడం, నీరు అతి తక్కువగా త్రాడం ఇవన్నీ కూడా బాడీ హీట్ కు ప్రధాన కారణాలు.
వేసవి కాంలో వడదెబ్బను తట్టుకోవడానికి శరీరంలోని వేడి తగ్గించుకోవడానికి కొన్ని హోం రెమెడీలున్నాయి. ఇవి శరీరంలోని వేడిని నేచురల్ గా తగ్గిస్తాయి. శరీరంలో వేడి తగ్గించుకోవడానికి ఒక సాధారణ పానీయం నీళ్ళు. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో వేడి త్వరగా తగ్గుతుంది.
అదేవిధంగా నీరు ఎక్కువగా ఉండే ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి . జ్యూసుల రూపంలో తీసుకోవాలి. ఇలా తీసుకొన్నప్పుడు శరీరంలో వేడిని కంట్రోల్ చేయవచ్చు. అలాంటి ఆహారాల్లో పుచ్చకాయ కూడా ఒకటి. ఇవి మాత్రమే కాదు, వేసవికాలంలో మన ఒంట్లో వేడి తగ్గించడానికి మార్కెట్లో వివిధ రకాల నేచురల్ ఫుడ్స్ ఉన్నాయి. వాటిని తీసుకోవడం వల్ల వేసవి వేడి నుండి ఉపశమనం పొందవచ్చు.
మరి బాడీ హీట్ ను తగ్గించే హోం రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం...

సాధ్యమైనంత ఎక్కువ నీరు:
శరీరంలో వేడి తగ్గించడానికి ఎక్కువగా సహాయపడేది నీళ్ళు. వేసవిలో సాధారణంగా తీసుకొనే దానికంటే మరింత ఎక్కువగా తీసుకోవాలి.

వెన్న తీసిన మజ్జిగ:
వెన్న తీసిన మజ్జిగను ప్రతి రోజూ త్రాగడం వల్ల వేసవి తాపం తీర్చడంతో పాటు శరీరంలో వేడి మటుమాయం అవుతుంది.

నిమ్మరసం:
వేసవిలో అందరూ తాగేది నిమ్మరసం. దీనిలో అధికశాతం 'సి' విటమిన్ వుంటుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. పల్చటి మజ్జిగలో నిమ్మరసం, ఉప్పు వేసుకొని తాగితే శరీరంలోని వేడి తగ్గుతుంది. ప్రతిరోజూ ఒక చెంచాడు నిమ్మరసం పరగడుపున తాగితే పైత్యం తగ్గుతుంది. అరుగుదల కూడా బాగా ఉంటుంది

వాటర్ మెలోన్(పుచ్చకాయ):
పుచ్చకాయ శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. ఇది శరీరంలో వేడి తగ్గించడానికి చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇందులో అధికంగా నీరు ఉండి మిమ్మల్ని చల్లగా మరియు హైడ్రేట్ (శరీరాన్నితేమగా) ఉంచుతుంది.

కొబ్బరి నీళ్ళు:
బాడీ హీట్ ను తగ్గించుకోవడానికి కొబ్బరి నీళ్ళు త్రాగడం అత్యంత శ్రేయస్కరం. అంతే కాదు సమ్మర్ లో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

బాదం మిల్క్:
ఒక గ్లాసు చల్లటి పాలలో ఒకటి లేదా రెండు చుక్కల బాదం ఆయిల్ మిక్స్ చేసి, ఇంకా బాదం పౌడర్ కూడా మిక్స్ చేసి తీసుకోవచ్చు .

ఉప్పు తగ్గించాలి:
వేసవికాలంలో ఉప్పు తినడం తగ్గించడం ద్వారా ఒంట్లో వేడిని నేచురల్ గా తగ్గించుకోవచ్చు.

యాలకలతో తయారుచేసిన టీ:
మీకు టీ త్రాగాలనిపించినప్పుడు, యాలకలతో తయారుచేసిన టీ తీసుకోవడం వల్ల బాడీ మీట్ ను నేచురల్ గా తగ్గిస్తుంది .

పెరుగు అన్నం:
వేసవిలో బాడీ హీట్ ను తగ్గించే మరో ఉత్తమ హోం రెమెడీ పెరుగు అన్నం. ఇది వేసవిలో పెరుగుఅన్నం ఎక్కువగా తీసుకోవాలి. తినే ముందు కొద్దిగా నీళ్ళు మిక్స్ చేస్తే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది.



Click it and Unblock the Notifications