Latest Updates
-
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ..
అల్లం జ్యూస్ తో పొందే అద్భుతమైన హెల్త్ బెన్ఫిట్స్..!
చాలామందికి తెలుసు అల్లంలో అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని. వంటల్లో అద్భుతమైన రుచిని అందించడమే కాదు.. జలుబు, దగ్గు, అజీర్ణం, వికారం వంటి సమస్యలను కూడా నివారిస్తుంది. గొంతునొప్పి వంటి సమస్యల నుంచి కూడా తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.. అల్లం.
అయితే అల్లం కాస్త ఘాటుగా ఉండటం వల్ల దాన్ని డైరెక్ట్ గా తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. అయితే.. జ్యూస్ రూపంలో అంటే.. ఒక కప్పు అల్లం రసం తీసుకోవడం వల్ల అమోఘమైన ఫలితాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రెగ్యులర్ గా ఒకే ఒక కప్పు అల్లం జ్యూస్ తాగడం వల్ల పొందే ఫలితాలేంటో చూద్దాం.. అలాగే అల్లం జ్యూస్ తయారు చేసే విధానం కూడా తెలుసుకుందాం..

డయాబెటిస్
అల్లంలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. డయాబెటిస్ తో బాధపడేవాళ్లలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో అల్లం జ్యూస్ సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే ఇది నాన్ డయాబెటిక్ వాళ్లకు కూడా మంచిది.

బ్రెయిన్ హెల్త్
అల్లంలో ఫెనోల్స్, ఫ్లేవనాయిడ్స్ ఉండటం వల్ల.. న్యూరోప్రొటెక్టర్ గుణాలు పొందవచ్చు. అలాగే అల్లం జ్యూస్ లో బ్రెయిన్ లో ప్రొటీన్ లెవెల్స్ పెంచే సత్తా ఉంటుంది. దీనివల్ల బ్రెయిన్ హెల్తీగా ఉంటుంది. ముఖ్యంగా వయసు పెరిగిన వాళ్లలో అల్జీమర్స్, మెంటల్ డిజార్డర్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.

క్యాన్సర్
అల్లంలో బయో యాక్టివ్ ఫెనోలిక్స్, నాన్ వొలాటైల్ ఉంటాయి. అధ్యయనాల ప్రకారం అల్లంలో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నట్టు, ప్రొస్టేట్ క్యాన్సర్ నివారించడానికి సహాయపడుతుందని తేలింది.

గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్ నివారణకు
అల్లంను వికారం, హార్ట్ బర్న్, అలసట, డయేరియా, ఆకలి పెంచడానికి, ఇన్ఫెక్షన్స్, దగ్గు నివారించడానికి ఉపయోగిస్తారు. అలాగే.. అల్లంలో ఉండే గుణాలు గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్ నుంచి కాపాడతాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

కొలెస్ట్రాల్ తగ్గించడానికి
గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా తగ్గించడంతో పాటు, అల్లం జ్యూస్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా ఎఫెక్టివ్ గా తగ్గించవచ్చు.

కీళ్ల నొప్పులు
అల్లం జ్యూస్ తీసుకోవడం వల్ల.. నొప్పి నివారించే గుణాలు ఉంటాయి. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

అల్లం జ్యూస్ తయారు చేసేవిధానం
కొద్దిగా అల్లం తీసుకుని శుభ్రం చేసుకుని, ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొన్ని నీళ్లు కలిపి మిక్సర్ లో వేసి.. క్రష్ చేయాలి. తర్వాత వడకట్టి.. దానిలోకి అరనిమ్మకాయ రసం కలపాలి. అవసరమైతే తేనె కలుపుకుని తీసుకోవాలి. అంతే అల్లం జ్యూస్ రెడీ.



Click it and Unblock the Notifications
