Latest Updates
-
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా..
సైక్లింగ్ తో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ..!
కాలు తీసి కాలు పెడితే ఖరీదైన కారు.. లేదా వాయువేగంతో వెళ్లే మోటారు సైకిల్.. ఇదీ నేటి సమాజ ధోరణి. ఫలితంగా పెరిగిన పెట్రోల్ వినియోగం..ట్రాఫిక్ సమస్య..రోజు రోజుకూ దెబ్బతింటున్న పర్యావరణం.. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఊబకాయం..అధిక కొలెస్ట్రాల్..బీపీ..మధుమేహం తదితర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టి సంపూర్ణ ఆరోగ్యం సాధించాలంటే సైకిలింగ్ బెస్ట్ అంటున్నారు వైద్యనిపుణులు.
ఒకప్పుడు ఇంట్లో సైకిల్ ఉందంటే గొప్ప..అప్పట్లో అదే ఇంటి ఉన్నత స్థితిని సూచించే రవాణా వాహనం.. ఎక్కడికెళ్లాలన్నా ఇదే ముఖ్యం. కాలం మారింది. సైకిల్ స్థానంలో మోటార్ సైకిల్ వచ్చింది. సైకిల్ తొక్కేవారు క్రమక్రమంగా తగ్గిపోతున్నారు. పైగా ఇప్పుడు తొక్కాలన్నా ఏదో ఫీలింగ్. కేవలం చిన్నారులు మాత్రమే తొక్కుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కాలం మారడంతో శారీరక శ్రమ తగ్గిపోయి మానసిక ఒత్తిడి పెరిగి వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఉదయం నుంచి నిద్రించే వరకు రకరకాల ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు.
నేటి ఆధునిక సమాజంలో అందంగా, నాజుకుగా కనిపించాలని యువతీ, యువకులు ఆరాటపడుతున్నారు. ఇందుకోసం కొందరు నిత్యం వ్యాయామం, యోగా చేస్తున్నారు. అయితే సంపూర్ణ ఆరోగ్యం విషయంలో సైకిల్ చేసే మేలే ఎక్కువని చాలా మంది దాని వైపు చూస్తున్నారు. సైక్లింగ్ ద్వారా వేగంగా బరువు తగ్గడంతో పాటు శరీరం ధృడంగా తయారవుతుంది. కొవ్వు, కండరాలు తగ్గి, రోగనిరోధక శక్తి పెరుగుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే దీర్ఘ కాలికంగా వేధిస్తున్న నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు...మరి వీటితో పాటు మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం....

గుండె ఆరోగ్యానికి మంచిది
సైకిలు తొక్కటం గుండెకు మంచి వ్యాయామం అని కూడా చెపుతారు. అది మీ శరీరంలోని రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. గుండె రక్తనాళాలలో బ్లాకేజీ లేకుండా చేస్తుంది. రీసెర్చి మేరకు, ప్రతిరోజూ 30 నిమిషాలు సైకిలింగ్చేస్తే అది గుండె జబ్బులను 50 శాతం వరకు నివారిస్తుందని వెల్లడైంది.

ఒత్తిడి తగ్గిస్తుంది:
ప్రతిరోజూ సైకిల్ తొక్కడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవడంతోపాటు మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మతిమరుపు, మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి. కొద్ది కిలోమీటర్ల పెడలింగ్ మీ శరీరంలో జీవప్రక్రియ అధికం చేస్తుంది. ఒత్తిడి, మానసిక వేదనలను తగ్గిస్తుంది. భాగస్వామితో భంగపడ్డారా? బాస్ తిట్టిపోశాడా? వెంటనే సైకిల్ ఎక్కి కొంత ప్రయాణించండి. ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ కొంత దూరం సైకిల్ తొక్కారంటే, మీలోని ఒత్తిడి, మరియు డిప్రెషన్ వంటివి దూరం అవుతాయి.

నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది:
ఎక్కువమంది నిద్ర పట్టకపోవడం వంటి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రపోయేందుకు మందులను కూడా ఉపయోగిస్తున్నారు. అదే సైకిల్‌ను నిత్యం 30 నిమిషాల పాటు తొక్కితే ఈ సమస్య చాలావరకు తగ్గే అవకాశం

కండరాల శక్తి పెంపు :
ప్రస్తుత పరిస్థితుల్లో శారీరక శ్రమ లేకపోవడంతో శరీరంలో కొవ్వు పేరుకు పోతుంది. సైకిల్ తొక్కడం ద్వారా కొవ్వును తగ్గించవచ్చు. గంటపాటు సైకిల్ తొక్కితే దాదాపు 300 క్యాలరీలు తగ్గించుకోవచ్చు. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు ఒక సంవత్సరం సైకిల్ తొక్కితే దాదాపు 11 పౌండ్ల కొవ్వు కరిగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మధుమేహం అదుపులోకి :
సైక్లింగ్ అన్నది వయస్సుతో సంబంధం లేకుండా అందరూ చేయదగిన వ్యాయామం. సైక్లింగ్ చేయడం వలన మధుమేహం అదుపులోకి వస్తుంది. 30 నిమిషాల పాటు సైక్లింగ్ చేయడం వలన 40 శాతం మందికి మధుమేహం అదుపులో ఉంటుంది. వీటితోపాటు కొద్దిదూరం నడిచినా కొందరిలో కీళ్లనొప్పులు వస్తుంటాయి. ఇలాంటి వారు సైతం సైక్లింగ్ చేయడం ద్వారా కండరాలు శక్తివంతమై కీళ్ల నొప్పులు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

శరీర బరువు తగ్గేటందుకు సహకరిస్తుంది -
సైకిల్ తొక్కటం వలన బరువు త్వరగా తగ్గవచ్చు. అది మీలోని కేలరీలు ఖర్చు చేసి, కొవ్వు నిల్వలు కరిగిస్తుంది. వేగంగా కనుక సైకిల్ తొక్కితే, అసలు మీరు బరువు ఎక్కే ప్రసక్తి లేదు. కనుక సైకిల్ తొక్కే వారైతే, ఆహారం బాగా తగ్గించాల్సిన పని అసలే లేదు. కీళ్ళ నొప్పులకు వ్యాయామం - కండరాలు బలపడటమే కాక, సైకిల్ తొక్కితే మీ కీళ్ళ నొప్పులు కరూడా మాయమవుతాయి. కీళ్ళ నొప్పులు తగ్గించాలంటే ఇది మంచి పరిష్కారం. మందులు వేయాల్సిన పనిలేదు. రెగ్యులర్ గా సైకిల్ తొక్కి దాని ప్రభావం చూడండి.

శ్వాస మెరుగుపరుస్తుంది -
సైకిలింగ్ చేసేటపుడు మీరు అధికంగా గాలి తీసుకోవడం, వదలడం వంటివి చేస్తారు.గట్టిగా శ్వాస తీయడం, వదలడం మీలోని మలినాలను విసర్జిస్తుంది. వేగంగా సైకిల్ తొక్కితే అది మీ శ్వాసను పెంచి గుండెను కాపాడుతుంది.

మానసిక స్థితి మెరుగుపడుతుంది:
సైక్లింగ్ ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడైనది. ఆందోళన ఒత్తిడి, మరియు డిప్రెషన్ తగ్గిస్తాయి . ఆఫీసుకు సైకిల్లో వెళ్ళడం ద్వారా వర్క్ స్ట్రెస్ తగ్గించుకోవచ్చు.

వ్యాధినిరోధక శక్తి మెరుగుపడుతుంది:
వర్క్ స్టేషన్ కు సైకిల్లో వెళ్లడం వల్ల వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడటంతో పాటు వివిధ రకాల వ్యాధులను నుండి బయటపడటానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications