Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
దోసకాయ జ్యూస్ తాగడం వల్ల పొందే అమేజింగ్ బెన్ఫిట్స్..!
కుకుంబర్ జ్యూస్ లేదా దోసకాయ జ్యూస్ న్యాచురల్ క్లెన్సర్ లా పనిచేస్తుంది. డైట్ లో దీన్ని చేర్చుకుంటే.. శరీరంలోని మలినాలన్నీ.. బయటకు పోవడం తేలికవుతుంది. దోసకాయలోని తొక్కలోని, పండులోనూ అనేక హెల్త్ బెన్ఫిట్స్ దాగున్నాయి. విటమిన్ కె, సి, ఏలతో పాటు పొటాషియం, క్యాల్షియం కూడా పుష్కలంగా లభిస్తాయి.
ప్రకాశవంతమైన చర్మానికి టమోటా, కుకుంబర్ ఫేస్ ప్యాక్ !
కుకుంబర్ జ్యూస్ తీసుకోవడం వల్ల సొల్యుబుల్ ఫైబర్ లభిస్తుంది. అలాగే పోషకాలను పూర్తీగా పొందుతారు. డైజెషన్ ట్రాక్ లో బ్యాక్టీరియాను ఎంటరోలిగ్నాన్స్ గా మార్చేస్తుంది. దోసకాయ జ్యూస్ లో క్యాన్సర్ రిస్క్ తగ్గించే సత్తా ఉంది. ఆడవాళ్లలో బ్రెస్ట్, గర్భాశయం, ఒవేరియన్ క్యాన్సర్లను అరికడుతుంది.

దోసకాయలో బ్యూటీ బెన్ఫిట్స్ కూడా బోలెడున్నాయి. దోసకాయ ముక్కలను కళ్లపై పెట్టుకుంటే.. కళ్లకు కూలింగ్ తత్వాన్ని అందిస్తుంది. దోసకాయలో ఉండే ఆస్ట్రిజెంట్ గుణాలు.. దుమ్ము తొలగించి, గుంతలు కనిపించకుండా చేస్తాయి. యాక్నె తొలగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దోసకాయలో ఎక్కువగా నీటిశాతం ఉంటుంది కాబట్టి.. శరీరంలోని మలినాలు తొలగించడానికి అమోఘమైన ఆహారమిది.

శరీరంలో ఉండే మలినాలు కొన్నిసార్లు ఫ్యాట్ సెల్స్ ని స్టోర్ చేస్తాయి. దీనివల్ల ఇన్ల్ఫమేషన్ సమస్య ఎదురవుతుంది. వాటర్ సప్లై కాకుండా.. ఎలక్ట్రోలైట్స్ ని సప్లై చేసి.. శరీర కణాలకు ఫ్లూయిడ్స్ అందేలా సహకరిస్తుంది. దీనివల్ల బరువు తగ్గడానికి దోసకాయ జ్యూస్ సహాయపడుతుంది. అలాగే కీళ్లనొప్పులను కూడా తగ్గిస్తుంది.

దోసకాయలను తొక్క తీయకుండా తీసుకోవడం చాలా అవసరం. ఒకవేళ ఆర్గానిక్ వి కాకుండా.. బయట కొనే దోసకాయలు అయితే.. ఖచ్చితంగా శుభ్రం చేసుకున్న తర్వాతే జ్యూస్ చేసుకోవాలి. చర్మానికి, ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా.. దోసకాయ జ్యూస్ తాగడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications