Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
లేడీస్ బీ అలర్ట్: మీరు నిర్లక్ష్యం చేయకూడని విషయాలు..
ఇంట్లో అందరి కంటే ఎక్కువగా కష్టపడేది మహిళలు. ఇంటి పని, వంట పని, ఉద్యోగం, భర్త, పిల్లల బాగోగులు ఇలా రకరకాల బాధ్యతలతో రోజంతా.. కాదు కాదు ఏడాదంతా కష్టపడుతూనే ఉంటుంది. అయితే ఇది ఏ కొద్ది మందో చెబుతున్న మాటలు కాదు. మగవాళ్లకంటే ఆడవాళ్లే ఎక్కువ మల్టీ టాస్క్ చేయగలుగుతారని అధ్యయనాలు కూడా నిరూపించాయి. తన కుటుంబం కోసం రకరకాల బాధ్యతలు, పనులు చేస్తున్న భార్యకు థ్యాంక్స్ చెబితే సరిపోతుందా ? అయితే చాలా మంది మహిళలు పనిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ స్టడీస్ చెబుతున్నాయి.
మహిళలు పిల్లలు, వాళ్ల పెంపకం, భర్త బాగోగులతో చాలా బిజీగా ఉంటారు. దీంతో వేళకు తింటున్నారో లేదో కూడా పట్టించుకోరు. కానీ.. మహిళలు ఫాలో అవుతున్న ఇలాంటి కొన్ని లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వాళ్ల అనారోగ్యానికి ముప్పు తీసుకొస్తున్నాయట. కాబట్టి.. మహిళలూ బీ అలర్ట్. మీరు తరచుగా అలర్ట్ అవ్వాల్సిన, అలవరుచుకోవాల్సిన ఆరోగ్యకర అలవాట్లు ఏంటో ఇప్పుడు చర్చించుకుందాం..

ఫిట్ నెస్
ఇంట్లో పనులు చేసుకోవడంతో పాటు, ఎక్సర్ సైజ్ చేయడం అలవాటు చేసుకోవాలి. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. అలాగే ప్రమాదకరమైన డయాబెటిస్, గుండె సమస్యలు, క్యాన్సర్ల రిస్క్ నుంచి బయటపడవచ్చు. వ్యాయామం చేయడం వల్ల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయి.. ఒత్తిడిని తగ్గిస్తాయి. మహిళల బీఎమ్ఐ 19 నుంచి 25 మధ్యలో ఉంటే ఆరోగ్యకరం.

ఆహారం తీసుకోవడం
ఐరన్, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం ఉండే ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోవాలి. ఇవన్నీ మహిళలకు చాలా అవసరమైన పోషకాలు. అలాగే మీ జీర్ణవ్యవస్థపై కూడా జాగ్రత్త వహించాలి. ఫ్లూయిడ్స్, హైఫైబర్ ఫుడ్ కంపల్సరీ తీసుకోవాలి.

కొలెస్ట్రాల్ చెకప్
ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటే.. రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కొలెస్ట్రాల్ పెరగకుండా.. డైట్ తీసుకోవాలి. దూమపానానికి దూరంగా ఉంటూ.. వ్యాయామం రెగ్యులర్ గా చేయడం మంచిది.

ఒత్తిడి
గర్భధారణ సమయంలో ఒత్తిడికి లోనవడం తల్లికి, బిడ్డకి ఇద్దరికీ మంచిది కాదు. కాబట్టి ఒత్తిడికి లోనవకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

యూరినరీ ఇన్ఫెక్షన్స్
అన్ని వయసుల మహిళల్లోనూ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్. కాబట్టి తరచుగా యూరిన్ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. అలాగే యాంటీ బయోటిక్స్, ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

థైరాయిడ్ టెస్ట్
హైపోథైరాయిడ్ కారణంగా మెనుస్ట్రియల్ ప్రాబ్లమ్స్, బరువు పెరగడం, చర్మంపై వెంట్రుకలు, గర్భం పొందడంలో సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి థైరాయిడ్ కి దూరంగా ఉండాలంటే.. ప్రతి 6 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి.

సెక్స్
సెక్స్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ల గురించి అవగాహన కల్పించుకోవాలి. ఎలాంటి సమయంలో ఎలాంటి హెల్త్ రిస్క్ లు ఉంటాయి, వాటిని ఎలా అధిగమించాలి అనే విషయాలపై అవగాహన ఉంటే మంచిది.

క్యాన్సర్
మహిళలు ఖచ్చితంగా వాళ్ల బ్రెస్ట్ లను చెక్ చేసుకుంటూ ఉండాలి. రొమ్ము క్యాన్సర్ ను ముందుగానే గుర్తించడానికి ఇదో మార్గం. కాబట్టి ఎప్పటికప్పుడు బ్రెస్ట్ లను పరీక్షించుకుంటూ.. ఏదైనా చిన్న లోపం కనిపించినా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.

స్మోకింగ్
మహిళల మరణానికి చాలా ముఖ్యకారణం స్మోకింగ్. ఒవేరియన్, సర్వైకల్ క్యాన్సర్ కంటే.. లంగ్ క్యాన్సర్ ద్వారానే మహిళలు ఎక్కువగా చనిపోతున్నారట. స్మోకింగ్ చేసే మహిళల్లో చాలా వేగంగా గుండె వ్యాధులు వస్తున్నాయట.

ఆల్కహాల్
మహిళల్లో కంటే మగవాళ్ల శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే వాళ్లు బరువు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆల్కహాల్ సేవించడం వల్ల మహిళల్లో కంటే.. మగవాళ్లలో చాలా ఫాస్ట్ గా డైల్యూట్ అవుతుంది. దీనివల్ల ఆల్కహాల్ సేవించడం వల్ల మగవాళ్లలో కంటే.. మహిళల్లో చాలా త్వరగా దుష్ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ కి దూరంగా ఉండటం చాలా మంచిది.

గైనిక్ చెక్స్
20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలు ఎక్కువగా మెనుస్ట్రియల్ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. హెవీ బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ మెన్సెస్, పెయిన్ ఫుల్ పీరియడ్స్ వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి రెగ్యులర్ గా గైనకాలజిస్ట్ ని సంప్రదిస్తూ ఉండాలి.
చూశారుగా.. మహిళలూ. ఇలాంటి రెగ్యులర్ హెల్త్ చెకప్స్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఫాలో అవడం వల్ల భవిష్యత్ లో వచ్చే అనారోగ్య సమస్యలను ముందుగానే అరికట్టవచ్చు.



Click it and Unblock the Notifications











