ఎండాకాలంలో చల్లచల్లని మజ్జిగతో పొందే పవర్ ఫుల్ హెల్త్ బెన్ఫిట్స్

By Swathi

సంప్రదాయంగా వస్తున్న ఆహారాల్లో మజ్జిగ ఒకటి. మన పూర్వీకుల నుంచి మనం మజ్జిగ తయారు చేసుకుని తాగే అలవాటు అలవరచుకున్నాం. ప్రతి ఇండియన్ ఇంట్లో మజ్జిగ తాగే అలవాటు ఉంటుంది. దీన్ని బట్టర్ మిల్క్, లస్సీ అని పిలుస్తారు. ఎక్కువగా మండుటెండలతో ముప్పుతిప్పలు పెట్టే ఎండాకాలంలో మజ్జిగకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

సమ్మర్ లో ఎండ, వేడిగాలులు, ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. కాబట్టి శరీరానికి చలువ చేసే ఆహారాలనే ఎక్కువగా తీసుకుంటాం. వాటిలో మజ్జిగది ప్రత్యేక స్థానం. సమ్మర్ లో ప్రతి ఒక్క ఇంట్లో మజ్జిగ తాగడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇందులో ఎక్కువగా లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పాల కంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తుంది.

సమ్మర్ లో హెల్తీగా మాత్రమే కాదు.. యాక్టివ్ గా, ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండటానికి మజ్జిగ సహాయపడుతుంది. బట్టర్ మిల్క్ తీసుకోవడం వల్ల పొందే అనేక ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. అసలు సమ్మర్ లో మజ్జిగ తీసుకోవాల్సిన అవసరమేంటో తెలుసుకుంటే.. ఖచ్చితంగా మజ్జిగ తీసుకోవడం ప్రారంభిస్తారు.

శరీరాన్ని హైడ్రెట్ గా ఉంచుతుంది

శరీరాన్ని హైడ్రెట్ గా ఉంచుతుంది

నీళ్లు, పెరుగు, కొన్ని రకాల స్సైసెస్, ఉప్పుు కలిపి చేసే మజ్జిగ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన మజ్జిగ తాగడం వల్ల ఎలక్ట్రోలైట్స్ కి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉప్పుు, నీళ్లు.. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయపడతాయి. కాబట్టి సమ్మర్ లో ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవచ్చు.

ఫ్యాట్

ఫ్యాట్

ఎక్కువ ఆహారం తినడం కంటే.. కొద్దిగా మజ్జిగ తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. అల్లం, మిరియాలు, కొత్తిమీర వంటి వాటితో పాటు, మజ్జిగ జీర్ణశక్తిని మెరుగుపరిచి.. హెల్తీగా ఉండటానికి సహాయపడతాయి. అలాగే.. శరీరంలోని ఫ్యాట్ ని కరిగించి.. పొట్టను తేలికగా మార్చేస్తుంది.

క్యాల్షియం

క్యాల్షియం

మజ్జిగలో క్యాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఒక కప్పు మజ్జిగ తీసుకోవడం వల్ల 28 శాతం క్యాల్షియం అందుతుంది. క్యాల్షియం వంటి పోషకాలు శరీరానికి అందడం వల్ల ఎముకలు స్ట్రాంగ్ గా మారుతాయి. అలాగే బోన్ డిసీజ్ ల రిస్క్ తగ్గిస్తుంది. అలాగే క్యాల్షియం కండరాల ఆరోగ్యానికి సహాయపడుతుంది.

 బ్లడ్ ప్రెజర్

బ్లడ్ ప్రెజర్

మజ్జిగలో బయో యాక్టివ్ ప్రొటీన్స్ ఉంటాయి. ఇవి యాంటీ వైరల్, యాంటీ క్యాన్సర్, కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు కలిగి ఉంటాయి. రెగ్యులర్ గా మజ్జిగ తాగడం వల్ల బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడేవాళ్లకు మజ్జిగ ఎక్సలెంట్ హోం రెమిడీ.

జీర్ణశక్తి

జీర్ణశక్తి

అల్లం, మిరియాలు, జీరా అన్నీ.. జీర్ణశక్తి పెంచడానికి సహాయపడతాయి. ఒకవేళ మీరు ఎప్పుడైనా.. డైజెస్టివ్ ప్రాబ్లమ్ తో బాధపడుతుంటే.. వెంటనే ఒక గ్లాసు మజ్జిగ తాగండి.. వెంటనే ఉపశమనం పొందవచ్చు. ఇంకా అవసరమైతే.. కొంచెం పుదీనా మిక్స్ చేసుకుని.. రెగ్యులర్ గా తీసుకుంటే.. చక్కటి ఫలితం ఉంటుంది.

కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్ తగ్గించే అద్భుతమైన గుణాలు మజ్జిగలో ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడానికి న్యాచురల్ రెమిడీ. రోజూ ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ న్యాచురల్ తగ్గుతాయి.

హై ప్రొటీన్

హై ప్రొటీన్

బట్టర్ మిల్క్ లో ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది. ఒక కప్పు మజ్జిగ తీసుకోవడం వల్ల మహిళలు 15 శాతం, మగవాళ్లు 17 శాతం ప్రొటీన్స్ పొందవచ్చు. అలాగే ప్రొటీన్స్ మజిల్ గ్రోత్ కి, టిష్యూ రిపెయిర్ కి, ఫ్యాట్ కరిగించడానికి సహాయపడతాయి. ఈ పోషకాలు ఎముకలు, కండరాలు, చర్మ ఆరోగ్యానికి, బలానికి సహాయపడతాయి.

ఎసిడిటీ

ఎసిడిటీ

ఎసిడిటీతో పోరాడటాికి మజ్జిగతోపాటు, మిరియాలు, అల్లం సహాయపడతాయి. మజ్జిగ తీసుకోవడం వల్ల పొట్టలో చల్లగా ఉంటుంది. యాసిడ్ రిష్లక్స్ కారణంగా.. కడుపులో వచ్చే ఇబ్బందులు వెంటనే తగ్గిపోతాయి.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల ఎఫెక్టివ్ గా బరువు తగ్గవచ్చు. ఆహారాన్ని త్వరగా జీర్ణమవడానికి మజ్జిగ సహాయపడుతుంది. దీనివల్ల ఫ్యాట్ బయటకు పోయి.. బరువు తగ్గడం తేలికవుతుంది.

బ్యాక్టీరియా

బ్యాక్టీరియా

డైజెస్టివ్ ట్రాక్ హెల్తీగా ఉండటానికి మజ్జిగ సహాయపడుతుంది. చెడు బ్యాక్టీరియా తగ్గించి, గ్యాస్ట్రీక్ సమస్యలు దరిచేరకుండా.. అరికడుతుంది. క్యాన్సర్, డైయేరియా, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వంటి సమస్యలను నివారించడానికి మజ్జిగ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

చర్మానికి

చర్మానికి

మజ్జిగ స్కిన్ క్లెన్సర్ లా పనిచేస్తుంది. రోజు మజ్జిగను స్కిన్ క్లెన్సర్ లా ఉపయోగించవచ్చు. ఒక టేబుల్ స్పూన్ మజ్జిగ, కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్, రోజ్ వాటర్ మిక్స్ చేసి.. ఫేస్ కి అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

Story first published: Sunday, March 6, 2016, 8:00 [IST]
Desktop Bottom Promotion