స్పినాచ్ క్యారెట్ జ్యూస్ లో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ..

యవ్వనంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్, వెజిటేబుల్స్ ను తినడానికి కొంత మంది ఇష్టపడుతారు. కొంత మందికి ఇష్టముండదు. చిన్న తనంలో తల్లిదండ్రుల పిల్లలకు అందించే ఆహారాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుని, హెల్తీ ఫుడ్స్ ను అందివ్వడానికి ప్రయత్నిస్తుంటారు. వారికి ఇష్టం లేకపోయినా, ఆరోగ్యానికి మంచిదని ఏదో ఒక రూపంలో వాటిని అందించే ప్రయత్నం చేస్తుంటారు.

పిల్లలకు ఆకుకూరలు, వెజిటేబుల్స్ తినడమంటే ఇష్టముండదు. అలాగని వారికి హెల్తీ, న్యూట్రీషియన్ ఫుడ్స్ ను అందివ్వక పోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. అందుకే పెరిగే పిల్లలకు తల్లిదండ్రులు ఫోర్స్ చేసి హెల్తీ ఫుడ్స్ ను అందిస్తుంటారు.

Drink Spinach With Carrot Juice

అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. పోషకాహారం లోపంతో వచ్చే వ్యాధులను నివారించడానికి చాలా సమయం పడుతుంది. అంతే కాదు, శరీరంలో పోషకాలు లోపించడం వల్ల అనీమియాకు కారణమవుతుంది. అలాగే వ్యాధినిరోధకశక్తి తగ్గిపోతుంది. దాంతో వ్యాధుల ప్రారంభమువుతాయి. అలా జరగకుండా ఉండాలంటే హెల్తీ డైట్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

మనం ప్రతి రోజూ తీసుకును ఆరోగ్యకరమైన ఆహారాల్లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్, లీన్ మీట్, గుడ్లు, మరియు న్యూట్రీషినల్ పదార్థాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి . ఇలా తీసుకోగలిగినప్పుడు వివిధ రకాల వ్యాధులను నివారించుకోవచ్చు.

తాజాగా ఉండే పండ్లు మరియు కూరలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వివిధ రకాల న్యూట్రీషియన్స్ మరియు మినిరల్స్ మన శరీరానికి అందడంతో వ్యాధినిరోధక శక్తి స్ట్రాంగ్ గా ఉంటుంది.

Drink Spinach With Carrot Juice

హెల్తీ వెజిటేబుల్స్ లో వివిధ రకాలున్నాయి. అందులో క్యారెట్స్ మరియు ఆకుకూరలు ఆరోగ్య సమస్యలను, డిజార్డర్స్ ను దూరం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

క్యారెట్ ను శుభ్రంగా కడిగి తొక్క తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసి , వాటికి శుభ్రం చేసి పెట్టుకున్న ఆకుకూరలను జోడించి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి, జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల అత్యంత శక్తివంతమైన ప్రయోజనాలను పొందుతారు,

ఇటువంటి జ్యూస్ ను ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత 1 గ్లాసు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మరి ఈ స్పినాచ్ అండ్ క్యారెట్ కాంబినేషన్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

Drink Spinach With Carrot Juice

1. అనీమియా సమస్యను తగ్గిస్తుంది: క్యారెట్ అండ్ స్పినాచ్ కాంబినేషన్ డ్రింక్ లో విటమిన్ ఎ మరియు ఐరన్ పుష్కలంగా ఉన్నాయి . ఈ రెండింటి కాంబినేషన్ డ్రింక్ తాగడం వల్ల హెల్తీ రెడ్ బ్లడ్ సెల్స్ మరియు హీమోగ్లోబిన్ పెరగడానికి సహాయపడుతుంది. హెల్తీగా రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పతి అయినప్పుడు, రక్తానికిసంబంధించిన అనీమియా వంటి వ్యాధులను దూరం చేస్తుంది.

2. క్యాన్సర్ నివారిస్తుంది: క్యారెట్ మరియు స్పినాచ్ కాంబినేషన్ డ్రింక్ తాగడం వల్ల క్యాన్సర్ ను నివారించుకోవచ్చు. క్యారెట్ లో ఉండే కెరోటినాయిడ్స్ మరియు ఫ్లెవనాయిడ్స్ పొట్ట ఉదరంలోని సెల్ ప్రొడక్షన్ ను కంట్రోల్ చేస్తుంది, దాంతో క్యాన్సర్ ను నివారించుకోవచ్చు.

Drink Spinach With Carrot Juice

3. ఏజింగ్ సెల్స్ ను ఆలస్యం చేస్తుంది: క్యారెట్ మరియు స్పినాచ్ లో డ్రింక్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి, కణాలను ఉత్తేజపరచడంతో పాటు, దీర్ఘకాలంలో హెల్తీగా ఉంచుతుంది . దాంతో ప్రీమెచ్యుర్ సెల్ డీజనరేషన్ ను దూరం చేస్తుంది.

4. బోన్ హెల్త్ మెరుగుపరుస్తుంది: ఇది బోన్ కెపాటి పెంచడంలో ఈ డ్రింక్ గ్రేట్ గా సహాయపడుతుంది . క్యాల్షియం గ్రహిస్తుంది. బోన్ హెల్త్ కు క్యాల్షియం ఎక్కువ అవసరమవుతుంది స్పినాచ్ లో ఉండే విటమిన్ కె బోన్స్ ను మరింత స్ట్రాంగ్ గా మార్చుతుంది . ఓస్టిరియోఫోసిస్ మరియు జాయింట్ రిలేటెడ్ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Tuesday, June 21, 2016, 17:30 [IST]
Desktop Bottom Promotion