For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆపానవాయువు వదలడం వల్ల కూడా కొన్ని ప్రయోజనాలున్నాయి

ఫార్టింగ్ అనేది మనం బయటకి చెప్పుకోడానికి ఇష్టపడని ఒక ఆరోగ్య సమస్య. మీరు బయట అందరి మధ్యలో ఉన్నప్పుడు అనుకోకుండా అపానవాయువును ఫార్ట్ గా వదిలితే అది సిగ్గుపడే పనిగా భావిస్తారు. మిమ్మల్ని చూసి అందరూ నవ్వు

|

ఫార్టింగ్ అనేది మనం బయటకి చెప్పుకోడానికి ఇష్టపడని ఒక ఆరోగ్య సమస్య.

మీరు బయట అందరి మధ్యలో ఉన్నప్పుడు అనుకోకుండా అపానవాయువును ఫార్ట్ గా వదిలితే అది సిగ్గుపడే పనిగా భావిస్తారు. మిమ్మల్ని చూసి అందరూ నవ్వుతారు మరియు మీకు ఇబ్బందికరంగా అన్పించేలా చేస్తారు.

చాలా కేసుల్లో, ఈ అనవసర అవమానానికి దూరంగా ఉండటానికి చాలామంది తమ ఫార్ట్ ను నియంత్రించుకోటానికి చాలా ప్రయత్నిస్తారు.

అయితే మరి ఈ అపానవాయువు ఎందుకు వస్తుంది? ఇది జీర్ణక్రియ మరియు శ్వాసక్రియలో భాగంగా కడుపులో ఏర్పడే వాయువు. అపానవాయువు శరీరంలోంచి గాలిని బయటకి పంపేసి అనవసర గ్యాస్ సమస్యనుంచి మీకు ఉపశమనం ఇచ్చే ఒక ప్రక్రియ.

benefits of farting

కానీ, వ్యక్తికీ వ్యక్తికీ ఇది వచ్చే సంఖ్య మారుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తికీ వారి జీర్ణక్రియ వేరే వేగాల్లో ప్రత్యేకంగా జరుగుతుంది కాబట్టి.

కొంతమందికి ప్రతి గంటకి ఈ అవసరమొస్తే, మరి కొంతమందికి కేవలం వాష్ రూమ్ కి వెళ్ళినపుడే కలగవచ్చు.

ఏది ఏమైనా, దాన్ని నియంత్రించుకోవటం కన్నా బయటకి వదిలేయటమే ముఖ్యం. అపానవాయువును ఆపేయటం మీ ఆరోగ్యానికి హానికరంగా మారవచ్చు. దాన్ని బయటకి వదిలేయటం ద్వార జీర్ణవ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండి, మీ శరీరంలో గట్ బ్యాక్టీరియా సమతుల్యంగా ఉండి జీర్ణక్రియ, శ్వాసక్రియ బాగా జరుగుతాయి.

అందుకని వచ్చేసారి, ఫార్టింగ్ కి సిగ్గుపడకుందా, మీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక శారీరక క్రియగా భావించండి.

ఈ అపానవాయువులో ఏం ఉంటుంది మరియు ఆసక్తికర వాస్తవాలు

ముందే చెప్పినట్లు అపానవాయువు శరీరంలో జీర్ణక్రియ మరియు శ్వాసక్రియ వలన ఏర్పడే ఒక గ్యాస్. ఈ గ్యాస్ లో 21 శాతం హైడ్రోజెన్, 7 శాతం మీథేన్, 9శాతం నైట్రోజన్,9 శాతం కార్బన్ డై ఆక్సైడ్, 4శాతం ఆక్సిజన్, 1 శాతం హైడ్రోజెన్ సల్ఫైడ్ ఉంటాయి మరియు ఆ హైడ్రోజన్ సల్ఫైడ్ వలనే అంత వాసన కూడా వస్తుంది.

అధ్యయనాల ప్రకారం, పరిశోధకులు చెప్పేది ఏంటంటే ఒక సగటు మనిషి రోజుకి 5 నుంచి పదిసార్లు అపానవాయువును వదులుతాడు. కానీ కొందరికి వారి జీర్ణవ్యవస్థ పనితీరును బట్టి ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు.

చిలకడదుంపలు, నట్'స్, గోధుమ, సోయా, ఆర్టిచోక్ దుంపలు, చిక్కుళ్ళు, పాల ఉత్పత్తులు, మరియు ఓట్'స్ ఇవన్నీ అపానవాయువును కలిగించే పదార్థాలు. ఇవేకాక, ఆకుకూరలైన క్యాబేజి, కాలీఫ్లవర్, ముల్లంగి వంటివి కూడా అధిక మొత్తాల్లో క్రిమిసంహారకమందులు కలిగి వుండి శరీరంలో గ్యాస్ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి.

ఫార్టింగ్ ను ఆపే ఒకే పద్దతి రిఫైన్ చేసిన పంచదారను తినటం, కానీ శరీరానికి ఇది కూడా ఆరోగ్యకరం కాదు.

అపానవాయువును వదలటం వలన కొన్ని లాభాలను తెలుసుకుందాం...

1.ఉబ్బరాన్ని తగ్గిస్తుంది

1.ఉబ్బరాన్ని తగ్గిస్తుంది

అజీర్తి కడుపులో ఉబ్బరానికి దారితీస్తుంది. ఉబ్బరం అంటే గ్యాస్ ఏర్పడి అది అలా పెరిగిపోయి కొన్నిసార్లు స్ట్రోక్ కి కూడా దారితీయవచ్చు. అందుకని ఈ పేరుకున్న గ్యాస్ ను వదలటమే మంచిది.ఇది మీ శరీరానికి ఉపశమనాన్ని ఇచ్చి జీర్ణవ్యవస్థను సరిగా పనిచేసేలా చేస్తుంది.

2.డైట్ ను సమతుల్యం చేయటంలో సాయపడుతుంది

2.డైట్ ను సమతుల్యం చేయటంలో సాయపడుతుంది

అపానవాయువు నేరుగా ఏం ఆహారం తినాలో,ఎంత తినాలో నిర్ణయించదు కానీ ఏ డైట్ ఛార్ట్ మీకు సరిపోతుందో లేదో తెలియచెప్తుంది. మాంసాహారం అనగా ఎర్ర మాంసం వంటి పదార్థాలు తినేవారిలో అపానవాయువు చాలా దుర్వాసన వస్తుందని తెలిసింది. అదే కార్బోహైడ్రేట్లు ఎక్కువ తినేవారిలో అపానవాయువు తటస్థంగా, వాసనలేకుండా ఉంటుంది. ఇది మీ డైట్ లో పోషకాలు లేవని సూచిస్తుంది , మీరు ఇతర పదార్థాలతో దాన్ని భర్తీ చేయవచ్చు.

3.కడుపునొప్పిని తగ్గిస్తుంది

3.కడుపునొప్పిని తగ్గిస్తుంది

అపానవాయువును చాలాసేపు నియంత్రించుకోవటం వలన పేగుల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఇది కడుపునొప్పి మరియు శరీరంలో అసౌకర్యాన్ని కలుగచేస్తుంది. కొన్నిసార్లు మీరు గ్యాస్ ను బయటకి వదలలేరు, అలాంటప్పుడు మీ పొట్టను మెల్లగా మసాజ్ చేస్తూ గ్యాస్ ను ప్రేగుల్లో కదిలేలా చేసి బయటకి పంపవచ్చు. అది కడుపునొప్పిని తగ్గిస్తుంది.

4.పెద్దప్రేగు ఆరోగ్యం

4.పెద్దప్రేగు ఆరోగ్యం

బయటకి వెళ్ళినప్పుడు ఫార్టింగ్ అవమానకరం కావచ్చు కానీ పెద్దప్రేగు సరిగా పనిచేయనివారు తమ అపానవాయువును నియంత్రించుకోలేరని అర్థం చేసుకోవాలి. అలాంటి వారు ఒకవేళ ఆపుకున్నట్లయితే అది ప్రేగులను మరింత ప్రభావితం చేసి, లోపల హెమరాయిడ్స్ పెరిగేలా చేస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. అందుకని ఫార్టింగ్ వలన ప్రేగుల ఆరోగ్యం బాగుపడుతుంది.

5.మీ అపానవాయువు వాసన చూడటం మంచిదే

5.మీ అపానవాయువు వాసన చూడటం మంచిదే

మీ ఫార్ట్ వాసన చూడటం మంచి అలవాటే. ఎందుకంటే అందులో ఉండే హైడ్రోజెన్ సల్ఫైడ్ చిన్నప్రేగుల్లో ఉత్పత్తి అవుతుమ్ది. ఇది మన కణాలలో మైటోకాండ్రియా దెబ్బతినకుండా చేస్తుంది. దానివల్ల స్ట్రోక్స్, కీళ్ళవాతం, గుండెజబ్బుల రిస్క్ లను నివారించవచ్చు.

6.ఆహారంలో అలర్జీలను గుర్తిస్తుంది

6.ఆహారంలో అలర్జీలను గుర్తిస్తుంది

మీకు ఆశ్చర్యకరంగా అన్పించవచ్చు కానీ అపానవాయువు వలన మీ శరీరానికి పడని ఆహారపదార్థాల అలర్జీలను కనుగొనవచ్చు. కోలియాక్ వ్యాధి మరియు లాక్టోస్ ఇంటోలరెన్స్ వంటి అలర్జీలు మనుషులలో గ్యాస్ ను పెరిగేలా చేస్తాయి. మీరు ఒకవేళ అలాంటి ఆహారం తింటే, మీకు అలర్జీ ఉన్నట్లు నిర్థారణ అయిపోతుంది. అలాంటి పరిస్థితులలో మీరు వైద్యున్ని సంప్రదించండి.

7.ఫార్టింగ్ ఆనందాన్ని ఇస్తుంది

7.ఫార్టింగ్ ఆనందాన్ని ఇస్తుంది

ఫార్టింగ్ వలన మీ శరీరంలో గ్యాస్ తగ్గిపోయి, అసౌకర్యం కూడా పోవటంతో మీకు ఆనందం కలుగుతుంది. ఇది ఉబ్బరాన్ని తగ్గించి జీర్ణవ్యవస్థను సులువుగా పనిచేసేలా చేస్తుంది మరియు కడుపునొప్పిని తగ్గిస్తుంది. అదే నియంత్రించుకుంటే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.

అనవసర అవమానాన్ని తప్పించుకోవాలంటే మీ ఆహారం మెల్లగా తినండి, అలా అయితే ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. కూల్ డ్రింక్ లు, కృత్రిమ స్వీట్నర్లకి దూరంగా ఉండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఇలా చేస్తే మీ మెటబాలిజం పెరిగి, ఆహారం సరిగా జీర్ణమయి, గ్యాస్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.

English summary

These 7 Positive Benefits Of Farting Will Make You Happy

Farting in the public may turn you as red as a tomato, but the benefits of releasing this sonorous calamity will definitely make you happy. For example, farting helps relieve bloating and abdominal pain, and can improve your colon's health..
Story first published:Monday, January 8, 2018, 16:37 [IST]
Desktop Bottom Promotion