For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వారానికి ఒకసారి ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగితే చాలు-సెక్స్ పవర్ పెరుగుతుందట!!

|

సాధారణంగా రెడ్ వైన్ అంటే 'మహిళలు తాగే వైన్' అని చాలా మంది పిలుస్తారు. మహిళలు ఎక్కువగా ఆల్కహాల్ కి వ్యసనపరులు అవ్వడం కంటే రెడ్ వైన్ ను ఇష్టపడటానికి కారణం ఉంది. రెడ్ వైన్ కు వందల సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. రెడ్ వైన్ వివిధ జాతుల నల్ల ద్రాక్ష పండ్ల నుండి తయారుచేస్తారు. ఈ ద్రాక్ష ముదురు ఎరుపు నుండి ఊదా లేదా ఇటుక ఎరుపు లేదా ముదురు గోధుమ రంగు లో ఉంటాయి. ద్రాక్ష పండ్లు బాగా పండిన తర్వాత, వాటి నుండి రసంను వేరు చేసి నిల్వ చేయబడుతుంది. ఇది సహజసిద్దంగా తయారుచేయబడినది కాబట్టి మీరు వారానికి ఒకసారి ఒక గ్లాసు రెడ్ వైన్ తీసుకుంటే, అది మీ లైంగిక కోరికలను పెంచుతుందని ఇటీవలి అధ్యాయనాలు కనుగొన్నట్లు పేర్కొన్నాయి! కానీ ఎక్కువ మద్యం సేవించడం వల్ల చాలా మంది పురుషులలో వంధ్యత్వానికి కారణమవుతుంది.

అయితే, ఒక వేళ మీరు ఆల్కహాల్ తీసుకుంటున్నట్లైతే , అప్పుడు మీరు దీన్ని మితంగా తీసుకోవల్సిఉంటుందని గుర్తించుకోండి. ఒక గ్లాస్ రెడ్ వైన్ శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో వ్యతిరేఖంగా పోరాడటానికి మరియు సెక్స్ పవర్ ను పెంచడానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ ను అందిస్తుంది. దీని గురించి పెద్దగా చర్చించాల్సిన పనిలేదు. వైన్ నుండి ఒక రకమైన సామాజిక లూబ్రికెంట్ దొరికినట్లై అవుతుంది. దీని ద్వారా జంటలు బయట ఉత్సాహంగా తిరిగి రావడానికి మరియు తమతమ భావాలను పంచుకునే విశ్వాసాన్ని ఇస్తుంది.

రెడ్ వైన్ అంటే ఏమిటి?

రెడ్ వైన్ అంటే ఏమిటి?

రెడ్ వైన్ అంటే ద్రాక్ష పండ్లతో తయారు చేసిన ఒకరకమైన పానీయం లేదా ఆల్కహాల్ పానీయం. ఇది ముదురు ఊదా, కొద్దిగా ఎరుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది. నల్ల ద్రాక్షనుండి రసంను తీయబడుతుంది. దాని తరువాత, దీనిని స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్లో ఉంచి పులియబెట్టడం జరుగుతుంది. రెడ్ వైన్ ప్రాసెసింగ్‌లో ఉపయోగించే అత్యంత సాధారణ పదార్థం సల్ఫర్ డయాక్సైడ్. ఇది ఆక్సీకరణను ఆలస్యం చేయడం ద్వారా కిణ్వ ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. సున్నితమైన ఎంజైమ్‌లు కొన్నిసార్లు వైన్‌ను ఎరుపుగా మార్చడంలో పాత్ర పోషిస్తాయి. కొంతమంది రెడ్ వైన్ కిణ్వ ప్రక్రియ కోసం ఈస్ట్ ను కూడా ఉపయోగిస్తారు.

రెడ్ వైన్ మరియు సెక్స్

రెడ్ వైన్ మరియు సెక్స్

18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల దాదాపు 800 మంది మహిళలపై జరిపిన అధ్యయనంలో రెడ్ వైన్ లోని పదార్థాలు శృంగారాన్ని మరింత ప్రేరిపించినట్లు కనుగొన్నారు. ఇందులో ఇతర ఏ పానియలాల్లో లేని రసాయనాలను కలిగి ఉంటుంది. ఈ అధ్యయనం గురించి జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ లో ప్రచురించబడింది. ఏదేమైనా, రెడ్ వైన్ క్రమం తప్పకుండా సేవించడం వల్ల లైంగిక కోరికలు పెరుగుతయా లేదా అని నిర్థారణకు రావడంలో పరిశోధనలు విఫలమైంది. కానీ గణాంకాలు మాత్రం దీనికి సాక్షాలుగా నిలిచాయి. రెడ్ వైన్ లోని కొన్ని పదార్థాలు శరీర అవయవాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది స్త్రీ, పురుషులలో లైంగిక ఆసక్తిని పెంచుతుందని కనుగొనబడింది.

రెడ్ వైన్ యొక్క ప్రయోజనాలు

రెడ్ వైన్ యొక్క ప్రయోజనాలు

లైంగిక కోరికను పెంచడానికి ఇది ఉపయోగపడటమే కాదు, అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి. గుండె మరియు ధమనుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా రక్తపోటు రాకుండా సురక్షితంగా ఉంచుతుంది. రెడ్ వైన్ లో ఉండే కంటెంట్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటానికి సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం మరియు మెదడును మరింత శక్తివంతం చేయడంలో సహాయపడుతుంది. లైంగికి ఆసక్తిని పెంచడంతో పాటు ఈ ప్రయోజనాలన్నింటిని మీరు పొందుతారురు. మీరు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు రెడ్ వైన్ తాగితే చాలా మంచిది.

రెడ్ వైన్ లో ఉండే ముఖ్యమైన పదార్థాలు:

రెడ్ వైన్ లో ఉండే ముఖ్యమైన పదార్థాలు:

రెడ్ వైన్లో రెస్వెరాట్రాల్ అనే ముఖ్యమైన పదార్థాలుంటాయి. ఇది అద్భుతమైన యాంటీఆక్సిడెంట్ మరియు ఇది చరిత్రలో అతిపెద్ద పరిశోధనలో తెలుపబడినది. సరైన క్రమంలో తీసుకున్నప్పుడు రెస్వెట్రాల్ 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి మరియు 50 రెట్లు ఎక్కువ విటమిన్ ఇ ని అందిస్తుంది. వృద్ధాప్యాన్ని నివారించడంతో పాటు, రెస్వెరాట్రాల్ పదార్థాలు పురుషులు మరియు స్త్రీలలో లైంగిక ఆరోగ్యాన్నిమెరుగుపరుస్తుంది.

రెడ్ వైన్ సెక్స్ సామర్థ్యంను ఎలా మెరుగుపరుస్తుంది?

రెడ్ వైన్ సెక్స్ సామర్థ్యంను ఎలా మెరుగుపరుస్తుంది?

హోవార్డ్, జాన్స్ హాప్కిన్స్ మరియు యుసి డేవిస్ మెడికల్ స్కూల్ పరిశోధనల ప్రకారం రెస్వెరాట్రాల్ అనేది పురుషులలో ఒక సాధారణ అంగస్తంభన అని చూపిస్తుంది. తద్వారా వారు లైంగిక చర్యలో చురుకుగా పాల్గొనవచ్చు. లైంగిక క్రియకు ప్రధాన కారణమయ్యే వాటిలో రక్తంలో చక్కెర స్థాయిని ఆరోగ్యకరంగా నిర్వహించడం. ఇది శరీరంలోని అన్ని కండరాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది మరియు లైంగిక శక్తి మరియు పనితీరును పెంచుతుంది.అధ్యయనాలు చెప్పే ప్రకారం ఇతర అంగస్తంభన మందుల కంటే రెస్వెరాట్రాల్ ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయంటున్నారు.

రెడ్ వైన్ యొక్క ప్రతికూల ప్రభావాలు

రెడ్ వైన్ యొక్క ప్రతికూల ప్రభావాలు

రెడ్ వైన్ మితంగా తాగడం వల్ల ఎటువంటి ప్రతికూల ప్రభావాలు ఉండవు. కానీ, మిగతా వాటిలాగే, పరిమితి లేకుండా రెడ్ వైన్ తాగడం వల్ల వ్యతిరేక ప్రభావం ఉంటుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల అంగస్తంభన సమస్యలు ఏర్పడవచ్చు మరియు దానిని నిర్వహించడం చాలా కష్టం అవుతుంది. దాని వల్ల భాగస్వామితో లైంగిక చర్యలో పాల్గొనడానికి మీకు అవసరమైన బలం మరియు శక్తిని కోల్పోయేలా చేస్తుంది. చాలా మంది ఆరోగ్య నిపుణులు తమ లైంగిక శక్తిని పెంచుకోవాలనుకునే వారికి కేవలం రెండు మోతాదులను సిఫార్సు చేస్తారు.

తుది నిర్ణయం

తుది నిర్ణయం

చాలా అధ్యయనాలు మహిళలకు రెడ్ వైన్ ఏవిధంగా ప్రభావితం చేస్తాయో పరిశోధనలు జరిపాయి. పురుషుల్లో కూడా మితంగా రెడ్ వైన్ తీసుకునే వారిలో లైంగిక కోరికను ఎక్కువగా కలిగి ఉన్నట్లు ఇటీవల కనుగొనబడింది. ఎందుకంటే దీనిలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ శరీరంలోని అనేక భాగాల పనితీరును లేదా చర్యలను ప్రేరేపిస్తుంది.అందులో ముఖ్యంగా మెదడు మరియు రక్త నాళాలలో రెస్వెరాట్రాల్ అనే పదార్థం వల్ల రెడ్ వైన్ లో లైంగిక కోరికను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి రోజూ ఒక గ్లాసు రెడ్ వైన్ తాగండి. భాగస్వామితో రతీ క్రీడలో ఆనందం పంచుకోండి మరియు లైంగిక జీవితాన్ని ఆస్వాదించండి.

English summary

Drink One Glass Of Red Wine, It will increase Your Sex Power!

ine can be considered as a social lubricant which get couples hanging out and give confidence in expressing their feelings
Story first published: Tuesday, September 10, 2019, 16:58 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more