Latest Updates
-
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి!
గుండెపోటు వస్తుందేమోనని భయపడుతున్నారా? అయితే జాగ్రత్త!
గుండెపోటు వచ్చి చనిపోతానని నిత్యం భయంతో విలవిల్లాడిపోతుంటాడు. దీని కారణంగా ఒక వ్యక్తికి ఛాతీలో కొంచెం నొప్పి ఉంటే, అతని మనస్సులో మొదటి భయం తాను గుండెపోటుకు గురయ్యే అవకాశం అధికంగా ఉన్నట్లు భావిస్తాడు. దీని వల్ల నొప్పి కొం
ఈ మధ్య కాలంలో చిన్నా పిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వాళ్ల వరకు గుండెపోటు వస్తుంది. కూర్చున్న వారు కూర్చున్న చోటే కుప్పకూలిపోతున్నారు. నడుస్తూ, జిమ్ చేస్తూనే ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇలా తరచుగా వచ్చే వార్తలు చూసి చాలా మంధి తీవ్రంగా భయపడిపోతున్నారు. తమకు ఏమైపోతుందోనని తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది కార్డియోఫోబియాకు గురవుతున్నారు.

కార్డియో ఫోబియా అంటే ఏమిటి?
మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దాని గురించి భయపడతారు. కొందరు పైనుంచి కిందకు చూస్తే మరికొందరికి నీళ్లు చూస్తే, నిప్పు చూస్తే తీవ్ర స్థాయిలో భయం కల్గుతుంది. కార్డియో ఫోబియా అనేది ఒక రకమైన మానసిక సమస్య. దీని వల్ల మనిషి తరచుగా భయపడుతూ ఉంటాడు. చిన్న దానికే తెగ ఆయాసపడిపోతూ ఉంటాడు. తమకు ఎక్కడ గుండెపోటు వచ్చి చనిపోతానని నిత్యం భయంతో విలవిల్లాడిపోతుంటాడు. దీని కారణంగా ఒక వ్యక్తికి ఛాతీలో కొంచెం నొప్పి ఉంటే, అతని మనస్సులో మొదటి భయం తాను గుండెపోటుకు గురయ్యే అవకాశం అధికంగా ఉన్నట్లు భావిస్తాడు. దీని వల్ల నొప్పి కొంచెంగా ఉన్నా అధికమైనట్లు అనిపిస్తుంది. ఆందోళన వల్ల మనిషి మరింత ఒత్తిడికి గురై నొప్పి వస్తుంది.
కార్డియోఫోబియా లక్షణాలు..
కార్డియోఫోబియా ఉన్న రోగులు ఎప్పుడూ ఆందోళన కారణంగా ఉంటారు. తీవ్రమైన సందర్భాల్లో, ఆందోళన లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. ముఖ్యంగా తలతిరగడం, వేగవంతమైన హృదయ స్పందన, హైపర్ టెన్షన్ సమస్య, ఆయాసం, విపరీతమైన చెమట, మూర్ఛ, వణుకు వంటి మైదలైనవి కార్డియోఫోబియా లక్షణాలు. ఇవన్నీ మీలోనూ ఉన్నట్లు అయితే మీకూ కార్డియో ఫోబియో సోకినట్లే.
తీసుకోవాల్సిన చర్యలు..
కార్డియోఫోబియా చికిత్స కోసం మానసిక నిపుణులను కలవండి. మంచి గుండె ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి, మీరు సంవత్సరానికి రెండుసార్లు చెకప్ చేయించుకోవాలి. దీని కారణంగా మీరు గుండె జబ్బులు వస్తాయని భయపడరు. లోతైన శ్వాస వ్యాయామాలు, యోగ, ధ్యానం చేయడం వల్ల కార్డియోఫోబియాను తగ్గించుకోవచ్చు. వీలయినంత వరకు మనుసులోని టెన్షన్ తగ్గించుకోవాలి. మీరు సంతోషంగా ఉండే పనులు చేస్తూ.. భయాన్ని మర్చిపోవాలి. మీకు ఇష్టమైన వారితో అధికంగా గడపడం వల్ల ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంటే సమస్య చాలా వరకు తగ్గిపోయినట్లే.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications