Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మీకు తెలుసా యాపిల్ తో సమానమైనది ‘ఈ పండు’! ఈ పండు ఎరుపు లేదా తెలుపు ఏది ఆరోగ్యానికి మంచిది?
మీకు తెలుసా యాపిల్ తో సమానమైనది ‘ఈ పండు’! ఈ పండు ఎరుపు లేదా తెలుపు ఏది ఆరోగ్యానికి మంచిది?
మీకు తెలుసా యాపిల్ తో సమానమైనది 'ఈ పండు'. ఎందుకంటే యాపిల్లో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా ఈ జామకాయలో ఉన్నాయి. అందుకే ఈ పండును పేదవాడి ఆపిల్ పండు అని పిలుస్తుంటారు. ఈ పండును నేరుగా తిన్నా, జ్యూస్ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి మాత్రం బోలెడు ప్రయోజనాలున్నాయి.

చలికాలంలో జామకాయలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. దీనిని సీజనల్ ఫూట్ అని పిలుస్తారు. చలికాలంలో జామకాయ తింటే జలుబు చేస్తుందని చాలా మంది, ఈ కాయను తినరు. కానీ చలికాలంలో ఈ పండును తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే విటమిన్లు, మినిరల్స్, మరియు ఇతర పోషకాలు పెద్ద మొత్తంలో ఉన్నాయని చాలా సార్లు ఆరోగ్య నిపుణులు కూడా తమ నివేధికలలో వెల్లడించారు.
ప్రధానంగా ఈ జామకాయలో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల, ఈ పండును ఇతర రకాల సిట్రస్ పండ్లైన నారింజ, నిమ్మ, బత్తాయి, దానిమ్మ కాయలతో పోల్చితే, విటమిన్ సి కంటెంట్ ఇందులో ఎక్కువగా కనిపిస్తుంది.
దీని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా రక్తంలో తెల్లరక్తకణాల సంఖ్య కూడా పెరుగుతుంది. పేదవాడి యాపిల్ గా పిలుచుకునే ఈ జామ పండులో ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి ప్రయోజనాలు దాగి ఉన్నాయో నేటి ఈ కథనంలో చూద్దాం.

కేలరీలు తక్కువ
పైన చెప్పినట్టు ఈ పండ్లలో పోషకాలు అధికంగా ఉన్నాయి. కానీ చాలా తక్కువ కేలరీలు ఉన్నాయి. కాబట్టి, వెయిట్ లాస్ ప్లాన్ లో ఉన్న వారు, జిమ్ కు వెళ్లే వారు, స్లిమ్ గా మారాలనుకునేవారు ఈ పండును మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది
ముందే చెప్పినట్లుగా, సిట్రస్ పండ్లు అన్నింటిలో కంటే ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
కాబట్టి, శీతాకాలంలో ఈ పండును రోజుకొకటి తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అలాగే పండ్లతో పాటు ఈ పండ్ల రసాన్ని తాగడం వల్ల కూడా శరీరంలో రోగనిరోధక శక్తి అంతర్గతంగా పెరుగుతుంది.

మధుమేహం ఉన్నవారికి
జామపండులో న్యాచురల్ షుగర్ కంటెంట్ ఉండటం వల్ల, ఇప్పటికే డయాబెటిస్ ఉన్నవారు దీనిని మితంగా తీసుకోవాలి. ప్రధానంగా ఈ పండులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా నిరోధిస్తుంది.
అంతేకాదు శరీరంలోని కాలేయ పనితీరును మెరుగుపరచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని ఏ కారణం చేతనైనా మెయింటెయిన్ చేసి మధుమేహం సమస్య పెరగకుండా చేస్తుంది.

అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులు
అధిక రక్తపోటు ఉన్న వారికి పోటాషియం అధికంగా ఉండే కూరగాయలు మరియు పండ్లు చాలా మంచివని మీకు తెలుసా?
ముఖ్యంగా, ఇవి శరీరంలోపల నిల్వ ఉండే సోడియం మొత్తాన్ని తగ్గిస్తాయి మరియు రక్తపోటును చాలా ప్రభావవంతంగా మరియు సమర్ధవంతంగా నిర్వహిస్తాయి.
కాబట్టి, అధిక రక్త పోటు ఉన్న వారు రెగ్యులర్ డైట్ లో జామపండ్లను చేర్చుకుంటే, మితంగా తినడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. అంతే కాదు ఈ పండులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

జామ పండులో ఎరుపు లేదా తెలుపు జామకాయలుంటాయి వీటిలో ఆరోగ్యానికి ఏద మంచిది
వీలైనన్ని ఎక్కువ ఎరుపు రంగు పండ్లను తినండి
తెలుపు జామకాయల కంటే గులాభీ రంగులో లేదా ఎర్రగా ఉండే జామ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
దీని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటంటే, ఎర్రగా ఉండే టొమాటో పండులో లాగా ఎర్రటి జామపండులో లైకోపీన్ అనే ఆరోగ్యకరమైన పదార్ధం పుష్కలంగా ఉంటుంది.
ఇది సూర్యుని నుండి వెలువడే హానికరమైన కిరణాల నుండి మన శరీర చర్మాన్ని రక్షించడమే కాకుండా, చలికాలంలో వివిద రకాల చర్మ సమస్యలు దరిచేరకుండా చూస్తుంది.



Click it and Unblock the Notifications