డెలివరీ తర్వాత భార్యాభర్తలు ఎప్పుడు కలవడం సేఫ్?

శృంగారం విషయంలో కొన్నిసార్లు చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద పెద్ద అనారోగ్యాలకు కారణమవుతుంటాయి. శృంగారం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ అది ఎప్పుడు, ఏ జాగ్రతలు తీసుకుంటూ చేస్తున్నారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా డెలివరీ తర్వాత మహిళలు శృంగారంలో పాల్గొనే విషయంలో కొన్ని కీలక విషయలు గుర్తుంచుకోవాలి.

ప్రసవం తర్వాత మహిళల శారీరకంగా, మానసికంగా ఆమె ఎన్నో మార్పులను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో ప్రతి దంపతుల మదిలో మెదిలే ఓ అతిపెద్ద సందేహం.. డెలివరీ తర్వాత భార్యాభర్తలు మళ్లీ ఎప్పుడు కలవడం సురక్షితం? చాలా మందికి దీనిపై సరైన అవగాహన ఉండదు. సిగ్గు పడో, మొహమాటం కొద్దీ ఎవరినీ అడగలేక, డాక్టర్ల సలహా తీసుకోకుండా తొందరపడి.. తెలియక ఎన్నో ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు.

When is it Safe to Have Physical Intimacy After Delivery Top Gynecologist Explains

డెలివరీ అయిన ఎన్ని రోజులకు శృంగారంలో పాల్గొనడం సేఫ్? తొందరపడితే వచ్చే ప్రమాదాల వంటి ముఖ్య విషయాల గురించి సున్నితమైన, అత్యంత ముఖ్యమైన విషయంపై విశాఖపట్నానికి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ శాంతి శ్రీ తన ఇన్‌ స్టాగ్రామ్ వేదికగా కొన్ని కీలక విషయాలను షేర్ చేశారు. ఆమె ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం.

నార్మల్ డెలివరీ అయితే ఎప్పుడు సేఫ్?

సాధారణ కాన్పు లేదా నార్మల్ డెలివరీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన మహిళల శరీరం లోపల కోలుకోవడానికి కనీసం 6 వారాల సమయం పడుతుంది. అంటే సుమారు 40 రోజుల పాటు భార్యాభర్తలు శృంగారానికి దూరంగా ఉండటం ఎంతో ముఖ్యం. ఆ తర్వాతే ఇద్దరూ కలవడం సురక్షితం. అప్పటికే గర్భాశయం తిరిగి తన సాధారణ స్థితికి చేరుకుంటుంది.

C సెక్షన్ (C-Section) అయితే ఎప్పుడు సేఫ్?

ఆపరేషన్ (సిజేరియన్) ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన తల్లులు మరింత జాగ్రత్తగా ఉండాలి. సి-సెక్షన్ అనేది ఒక పెద్ద సర్జరీ. పొట్టపై వేసిన కుట్లు, లోపల గర్భాశయానికి వేసిన కుట్లు పూర్తిగా మానడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఆపరేషన్ అయిన వారు కనీసం 8 నుంచి 10 వారాల తర్వాత మాత్రమే శృంగారంలో పాల్గొనడం సురక్షితమని డాక్టర్ శాంతి శ్రీ స్పష్టం చేస్తున్నారు.

వీటికన్నా ముందే ప్రయత్నిస్తే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసా?

విపరీతమైన నొప్పి
ప్రసవం తర్వాత జననేంద్రియాలు అత్యంత సున్నితంగా ఉంటాయి. కుట్లు పూర్తిగా మానకముందే కలిస్తే భరించలేని నొప్పి ప్రాణసంకటంగా మారుతుంది.

బ్లీడింగ్ (రక్తస్రావం)
గర్భాశయం ఇంకా కోలుకునే దశలోనే ఉంటుంది కాబట్టి ముందే కలయికలో పాల్గొంటే కుట్లు విడిపోయి, తీవ్రమైన బ్లీడింగ్ అయ్యే ప్రమాదం ఉంది.

ఇన్ఫెక్షన్ రిస్క్
ప్రసవం తర్వాత గర్భాశయ ముఖద్వారం కొంతకాలం పాటు తెరిచే ఉంటుంది. ఆ సమయంలో కలిస్తే బ్యాక్టీరియా సులభంగా లోపలికి వెళ్లిపోయి, ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Thursday, August 20, 2026, 18:46 [IST]
Desktop Bottom Promotion