Latest Updates
-
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.!
మెనోపాజ్ తర్వాత తీవ్రంగా కీళ్లు, ఎముకల సమస్య.. ఇందుకు కారణాలేంటి.. ఎలా బయటపడాలి.?
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కీళ్ల వాతం, మోకాళ్ల నొప్పులు సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఇది సర్వసాధారణం. కానీ మహిళల్లో ఒక దశ రాగానే కీళ్లు, ఎముకల సమస్యలు తీవ్రం అవుతుంటాయి. దీనికి ప్రధాన కారణం మెనోపాజ్.. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మహిళలు శారీరకంగా, మానసికంగా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి ఇందుకు కారణాలేంటి.. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

శరీరంలో రోజువారీ పనులు సులభతరం చేసుకోవడానికి ఎముకలు, కీళ్లు దృఢంగా ఉండటం చాలా అవసరం. కానీ కీళ్లు నొప్పిగా, వాపుగా, బిగుసుకుపోయినట్లుగా మారితే చిన్న పనులు చేసుకోవడం కూడా కష్టతరంగా మారుతుంది. కీళ్లను ప్రభావితం చేసే అలాంటి సమస్యల్లో ఆర్థరైటిస్ ఒకటిగా నిపుణులు చెబుతున్నారు. ఇక మహిళల్లో మెనోపాజ్ సమయంలో సంభవించే హార్మోన్ల మార్పుల కారణంగా ఎముకల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గిపోవడంతో పీరియడ్స్ ఆగిపోయి మెనోపాజ్ దశకు దారితీస్తుంది.
మహిళల జీవితంలో వివిధ దశల్లో అనేక హార్మోన్ల మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా గర్భధారణ సమయంలో బరువు పెరగడం, డెలివరీ తర్వాత శారీరక, మానసిక మార్పుల కారణంగా మోకాళ్లు, తుంటి, పాదాల కీళ్లపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఇక మహిళల్లో ఎముకల బలాన్ని కాపాడటంలో ఈస్ట్రోజెన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో మెనోపాజ్‌తో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గి ఎముకల ఆరోగ్యంపై ప్రభావం చూపి.. బరువు పెరగడం, శారీరక శ్రమ తగ్గడం వంటివి కూడా చోటుచేసుకుంటాయి.
పోషకాహారం ప్రభావం
మెనోపాజ్ దశతో పాటు కాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్ వంటి శరీరానికి అవసరమైన పోషకాలను తీసుకోకపోవడం కూడా ఎముకలు, కండరాల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే మహిళలు చిన్న వయసు నుంచే ఎముకలు, కీళ్ల సంరక్షణ, బలానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మెనోపాజ్ తర్వాత కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

హెల్తీ లైఫ్‌స్టైల్
అయితే వయసు రీత్యా వచ్చే ఆర్థరైటిస్‌ను పూర్తిగా నివారించడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. హెల్తీ లైఫ్ స్టైల్‌ను పాటించడం ద్వారా ఎముకలు, కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ క్రమంలో శరీరానికి సరైన మోతాదులో కాల్షియం తప్పనిసరిగా తీసుకోవాలి. పాలు, పెరుగు, జున్ను, నువ్వులు, పాలకూర వంటి వాటి ద్వారా పుష్కలంగా కాల్షియం లభిస్తుంది. విటమిన్ డి కోసం ఉదయం, సాయంత్రం కాసేపు సూర్యరశ్మిలో ఉండటం వల్ల మేలు చేస్తుంది. ఇంకా డాక్టర్, డైటీషియన్ సలహా ద్వారా సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా పోషకాలు అందుతాయి.
ఇక, ఉద్యోగం చేసే మహిళలు ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడాన్ని నివారించాలి. లేదంటే శరీరంలో కదలికలు తగ్గి, కండరాలు బలహీనపడి ఎముకలు పటుత్వం కోల్పోకుండా చేస్తుంది. రోజూ కాసేపు నడవడం, సైక్లింగ్, స్విమ్మింగ్, స్ట్రెచింగ్, యోగా వంటి రోజువారీ కార్యకలాపాల ద్వారా ఫిట్‌నెస్‌ను కాపాడుకోవచ్చు. అదేవిధంగా బరువును సైతం నియంత్రణలో ఉంచుకోవడం ముఖ్యం.
మహిళలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు
ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత, మహిళలు తమ ఎముకల ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. కుటుంబంలో ఆర్థరైటిస్ చరిత్ర, తరచుగా ఎముకలు విరగడం, అధికంగా శరీర బరువు వంటి సమస్యలు ఉన్నాయేమో చెక్ చేసుకుని సకాలంలో వైద్య పరీక్ష చేయించుకోవాలి. ముందు నుంచే తీసుకునే చిన్నపాటి జాగ్రత్తల వల్ల ఎముకలు, కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మెనోపాజ్ దశను సైతం సులభంగా దాటేయవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
