Latest Updates
-
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.!
ప్రపంచ దోమల నివారణ దినోత్సవం: దోమకాటు తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు.!
వర్షాకాలంలో దోమల బెడద విపరీతంగా ఉంటుంది. దీంతో మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులు ప్రబలుతాయి. ఒక చిన్న దోమకాటు ఎప్పుడు ప్రాణాంతకం కాగలదో చెప్పలేం. అందుకే దోమల నివారణపై అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు దోమల నివారణ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు, జాగ్రత్తలు, నివారణ చర్యలపై జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

చాలా మంది దోమ కాటును నిర్లక్ష్యం చేస్తారు. కానీ చిన్న దోమ కాటు సైతం ప్రాణాంతకం కాగలదు. దోమ కాటు తర్వాత వచ్చే కొన్ని లక్షణాలు తీవ్రంగా కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. సొంత వైద్యం తీసుకోకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో వైద్యుడిని సంప్రదించాలి. వైద్య నిపుణుల సలహాలు చూద్దాం..
ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి..
సాధారణంగా దోమ కాటు కారణంగా దురద, తేలికపాటి వాపు, మంట లేదా చర్మంపై ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. అయితే ఈ లక్షణాలు కాసేపటి తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి కానీ దోమలు కరిచిన తర్వాత జ్వరం, తీవ్రంగా తలనొప్పి, ఒళ్లు లేదా కీళ్ల నొప్పులు, నీరసం తీవ్రంగా ఉండటం, వాంతులు, బ్రీతింగ్ తీసుకునేటప్పుడు ఇబ్బందులు తలెత్తడం, తలతిరగడం, చర్మంపై విపరీతంగా దద్దుర్లు, వాటి నుంచి రక్తస్రావం కనిపిస్తే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ లక్షణాలు డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి వ్యాధుల సంక్రమణను సూచించవచ్చు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
దోమలు కరిచిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ఆ ప్రదేశాన్ని వెంటనే శుభ్రమైన నీరు లేదా సబ్బుతో సున్నితంగా కడుక్కోవాలి. వాటిపైన గోకకూడదు. ఎందుకంటే దోమ కాటుపై గోకిన తర్వాత చర్మంపై పుండ్లు, ఇన్‌ఫెక్షన్లు రావచ్చు. దురద, వాపు ఉన్నప్పుడు చల్లటి నీటితో కాపడం చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. డీహైడ్రేషన్‌కి గురికాకుండా సరైన మోతాదులో నీరు, జ్యూస్‌లు తీసుకోండి. జ్వరం, బాడీ పెయిన్స్, ఇతర లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి.

దోమల నివారణ
దోమల కాటు నుంచి కాపాడుకునేందుకు ముందుగా వీటిని నివారించడానికి ప్రభావవంతమైన మార్గాలు తెలుసుకోవాలి. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. వాటి సంతానోత్పత్తిని నిర్మూలించాలి. ఇంటి ఆవరణలో పూల కుండీలు, కూలర్లు, బకెట్లు, టైర్లు, పగిలిన పాత్రలు ఇంకా ఇతర ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండేలా చూసుకోవడం చేయాలి. ఎందుకంటే నిలిచి ఉన్న నీటిలో దోమల సంతానోత్పత్తి ప్రబలుతుంది. నీటి ట్యాంకులు, డ్రమ్ములు, నీరు ఉన్న పాత్రలపై గట్టిగా మూత పెట్టి ఉంచాలి. ఈ కాలంలో వాటర్ కూలర్లను క్రమం తప్పకుండా ఖాళీ చేసి శుభ్రం చేయాలి. ఇంటా, బయటా పరిశుభ్రత పాటించాలి. బాత్‌రూమ్‌లు, టాయిలెట్లు, వాష్ ఏరియాలను తరచూ శుభ్రం చేయాలి.
ఈ విషయాలు గుర్తుంచుకోండి..
అయితే దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల లక్షణాలు ఒకేలా ఉండవని గమనించాలి. కొంతమందిలో తేలికపాటి లక్షణాలు కనిపించినా.. తర్వాత జ్వరం లేదా ఇతర లక్షణాలు తీవ్రం కావచ్చు. అందుకే దోమ కాటు తర్వాత లేదా ఇన్‌ఫెక్షన్ ద్వారా వచ్చే వ్యాధుల లక్షణాలు తీవ్రంగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
