Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
తొక్క...తొటారాలతో మొక్కలకు రక్షణ....!

సజీవమైన మట్టిలో లెక్కలేనన్ని సూక్ష్మ జీవులుంటాయి. సూక్ష్మజీవులు ఎక్కువగాలంగా ఉన్న మట్టిలో మొక్కలు ఆరోగ్యంగా ఎదగడంతోపాటు చక్కటి దిగుబడులిస్తాయి. మొక్కలు చీడపీడలను తట్టుకుంటూ ఆరోగ్యంగా ఎదగడానికి సూక్ష్మపోషకాలు దోహదపడతాయి. మట్టి నుంచి మొక్క తీసుకునే సూక్ష్మ పోషకాలు సక్రమంగా అందకపోవడం వల్ల మొక్కలు బలహీనపడతాయి. బలహీనంగా ఉన్న మొక్కలకే పురుగులు, తెగుళ్లు సోకుతాయి. రసాయనిక ఎరువులు వాడితే గంధకంతోపాటు ఐరన్, జింక్ వంటి సూక్ష్మపోషకాల లోపాలు మొక్కల్లో అధికంగా కనిపిస్తాయి. విషరసాయనాలు చల్లితే.. అవి పురుగులతోపాటు ఉపయోగపడే కీటకాలను, ఇతర జీవులను కూడా అంతం చేస్తాయి.
ఈ కారణం వల్లే మట్టిని సజీవంగా ఉంచడం ద్వారా పోషకాల సమతుల్యతకు దోహదపడేందుకుగాను కంపోస్టు, పశువుల పేడ తదితరాలతో అనేక సహజ ఉత్పత్తులను తరచూ వాడుతూ మొక్కలను కాపాడు కోవచ్చు. అప్పటికీ చీడపీడలు సోకితే ఇంట్లోనే వివిధ ద్రావణాలు, కషాయాలు తయారుచేసుకొని చల్లడం ద్వారా నివారించుకోవచ్చు కుండీలు, మడుల్లో ఆకుకూరలు, కూరగాయలను ఇంటి పట్టున పెంచుకునే వారు నిపుణుల తోడ్పాటుతో అవగాహనను పరిపుష్టం చేసుకుంటూ.. సేంద్రియ పద్ధతులను పాటించడం ద్వారా ఆరోగ్యదాయకమైన ఇంటి పంటలు పండించుకునే అవకాశం ఉంది.
ఇంట్లో ప్రతి నిత్యం మనకు అందుబాటులో ఉండే వాటితో కూడా మన పెరటి మొక్కలకు రక్షణ కల్పించవచ్చు. అరటితొక్కలను పూలమొక్కల మొదళ్లలో వేస్తే మొక్కలు ఏపుగా పెరుగుతాయి. పూలు ఎక్కువ పూస్తాయి. తులసి మొక్కలకు పట్టే పురుగును నివారించాలంటే... తులసి పాదులో ఒక ఉల్లిపాయను గుచ్చాలి. ఎక్స్‌పైర్ అయిన ట్యాబ్లెట్లు, టానిక్కులు మొక్కలకు మంచి ఎరువుగా పని చేస్తాయి. మొక్కల పాదుల్లో నీరు నిలిచినప్పుడు, మొదళ్లలో కూరగాయల తొక్కలను వేసినప్పుడు సన్నటి ఈగలు, దోమలు వాలుతుంటాయి. ఆ సమస్య పోవాలంటే మొక్కలకు ఉల్లిపాయలు కడిగిన నీటిని పోయాలి. మొక్కలకు చీడపడితే... ఇంగువ నీళ్లు పోస్తే తెగులు, చీడ వంటివన్నీ వదిలిపోతాయి.



Click it and Unblock the Notifications