Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.!
చాలా మందికి ఎదుటి వ్యక్తికి సంబంధించిన విషయాలపై చాలా ఆసక్తి ఉంటుంది. వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని, పలు సందర్భాల్లో వారిని విమర్శించాలని ఆరాటపడుతుంటారు. మీ అనాలోచిత ప్రవర్తన, మాటల కారణంగా అవతలి వ్యక్తి బాధపడుతుంటారు. అది కొందరు గమనించరు.. మరికొందరు ఆ మాటలు అన్నందుకు పశ్చాత్తాపానికి గురవుతుంటారు. ఈ క్రమంలో ముఖ్యంగా ఎదుటి వ్యక్తిని నాలుగు ప్రశ్నలు అడగకూడదని మనస్తత్వ నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..

ఎవరైనా సరే తమ వ్యక్తిగత జీవితంలోని కొన్ని విషయాల గురించి ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పడానికి ఇష్టపడరు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఇలాంటి సంఘటనలు, అనుభవాలు తరచూ ఎదురవుతూనే ఉంటాయి. చాలా మంది ఎదుటి వ్యక్తి ఏది పడితే అది మాట్లాడేస్తుంటారు. ఇది వారిపై మానసిక ఒత్తిడిని పెంచి, వారిని మరింతగా బాధపెడుతుంటుంది. ఈ సమయంలో కొందరు ఆ ప్రశ్నలకు దీటుగా సమాధానం చెప్పగలరు. మరికొందరు ఆ సందర్భంలో ఏమీ అనలేరు. కానీ తప్పనిసరిగా మీరు అమర్యాదగా ప్రవర్తించారని, సంస్కారం లేదని భావిస్తారు.
ప్రతి ఒక్కరికీ వారి జీవితంలో ప్రైవసీ ఉంటుంది. కొన్ని వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంటాయి. వాటిని బయటకు పెట్టుకోలేరు. అలాంటి విషయాల్లోకి ఎదుటి వ్యక్తి ఎప్పుడూ కూడా ప్రవేశించకూడదు. ఉద్దేశపూర్వకంగా అయినా ఇతర కారణాల వల్ల అయినా వారిని బాధించే ప్రశ్నలు అడగవద్దని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.
మన దేశంలో ఎక్కువగా యువతీయువకులు యుక్త వయసుకి రాగానే అడిగే మొదటి ప్రశ్న పెళ్లి గురించి. నిర్దేశించిన వయసు దాటినా కొందరు పెళ్లి చేసుకోకపోతే ఇక పెళ్లెప్పుడూ అంటూ మొదలుపెడతారు. అయితే ఎవరికైనా వారి పెళ్లి, కెరీర్ సంబంధించి కొన్ని అంచనాలు, ప్రణాళికలు ఉంటాయి. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనేది వారి ఇష్టం. కాబట్టి వివాహానికి సంబంధించి ఎప్పుడూ ప్రశ్నించకూడదు.
పెళ్లి తర్వాత చాలా మందికి ఎదురయ్యే మొదటి అభ్యంతరకర ప్రశ్న పిల్లల గురించే. పెళ్లి ఒత్తిడి నుంచి బయటపడి దాంపత్య జీవితంలోకి సంతోషంగా అడుగుపెడతారు. కొందరు కెరీర్‌కి అనుగుణంగా పిల్లల ప్లానింగ్ చేసుకుంటారు. ఈ క్రమంలో కొందరు పిల్లలు ఎప్పుడు కనాలని డిసైడ్ అవుతారు. మరికొందరు ఆరోగ్య కారణాల రీత్యా ఆలస్యం ఉంటుంది. దీంతో ఇది అర్థం కాని కొందరు మీకు ఎప్పుడు బిడ్డ పుడుతుందంటూ వారు మనోవేదనకి గురయ్యేలా ప్రశ్నలు వేస్తుంటారు. ఇలాంటి అసౌకర్యానికి గురి చేసే ప్రశ్నలు అడగడం మానుకోవాలి.

పెళ్లి, పిల్లలు తర్వాత ఎక్కువగా చర్చకు వచ్చేవి ఆర్థిక వ్యవహారాలు. ఒకరి ఆర్థిక పరిస్థితి, జీతం, పొదుపు అనేవి వారి వ్యక్తిగత విషయాలు. భార్యాభర్తలు ఉద్యోగం చేస్తున్నట్లయితే వారిద్దరూ ఎంత సంపాదిస్తున్నారు.. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ అని ఆరాలు తీస్తుంటారు. పెళ్లికి ముందూ యువతీయువకుల విషయంలో ఇలాంటివి తారసపడుతుంటాయి. ఆదాయం గురించిన ప్రశ్నలు అడగడం మానుకోవాలి.
మన దేశంలో కులం, మతం అనేవి సున్నితమైన విషయాలు. ఎవరినీ కూడా మీ కులమేంటి, మీ మతమేంటి అనే ప్రశ్నలు అడగకూడదు. ఇవి వారిని ఇబ్బంది పెట్టి కోపం తెప్పించే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ప్రశ్నలతో వివాదంలో పడే ప్రమాదాలు ఉన్నాయని మనస్తత్వ నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా ఎదుటి వారి వ్యక్తిగత రూపానికి వస్తే వారి బరువు, ఆరోగ్య సమస్యలు, విడాకులు, రూపం రంగు, వారి ఇంటి విషయాలు, వారు బయటకు చెప్పడానికి ఇష్టపడని విషయాల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ అడిగి వారిని మనోవేదనకి గురిచేయకూడదు.



Click it and Unblock the Notifications
