For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిచెన్ క్వీన్ మీరూ కావాలనుకుంటున్నారా....!

|

Tips for Cleaning and Maintaining a Kitchen
వంటగది మీ వ్యక్తిత్వానికి అద్దం లాంటిది. ఇందులో మీ అభిరుచి కనిపించడం చాలా అవసరం. కొన్ని పద్దతులను పాటించి మీర కూడా కిచెన్ క్వీన్ గా మారవచ్చు...

1. అన్నింటికంటే ముందు కిచెన్ ను పూర్తిగా శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే పని పూర్తిచేసుకోగానే వంటగదిని శుభ్రం చేసుకోవాలి.
2. వంటగదిలో యాప్రాన్ వేసుకుని పనిచేయాలి. దానికి వల్ల మీ దుస్తులకు మురికి కాకుండా ఉంటయి.
3. ఒకే పాత్రను అనేక వంటకాల కోసం ఉపయోగించకూడదు. కొంతమంది స్త్రీలు వంటవండేటప్పుడే పప్పువండే పాత్రలోనే అన్నం వండుతారు. ఈ అలవాటు మంచిది కాదు.
3. ప్రతిరోజూ అవసరం అయ్యే వస్తువులను సులభంగా దొరికే ఒక చోట ఉంచండి. అలాగే అప్పుడప్పుడు ఉపయోగించే వస్తువులను వేరుగా ఉంచుకోవాలి.
4. వంటగదిలో రెండు, మూడు చిన్నచిన్న ప్రత్యేకమైన టవల్స్ పెట్టుకోవాలి. వీటిని చేతులు తుడుచుకోవడం, డబ్బాలు తుడవడం, టైల్స్ తుడవడం, స్లాబ్ మొదలైన వాటిని శుభ్రం చేయడానికి ఉపయోగపడుతాయి.
5. వంటగదిలో ఉపయోగించే పరికరాలైన కత్తెర, కటర్, కత్తి, మాచెస్, లైటర్ వంటి వాటిని పిల్లలకు దూరంగా ఉంచాలి.
6. మసాలాలను పారదర్శకమైన డబ్బాల్లో ఉంచాలి. పంచదార, టీపొడి, ఉప్పుతోపాటు మసాలాలు మొదలైన వాటిని అవసరమున్నంత వరకే డబ్బాలో నింపి పెట్టుకోవాలి. ఇది మంచి గృహిణి లక్షణం.
7. ఒక వేళ డబ్బా స్టీల్ ని అయిఉండి పారదర్శకంగా లేకపోతే ఇలాంటి ఆహార సామాగ్రి డబ్బాలపై టేవుల్ పెట్టాలి. దాంతో పాటు వాటిపై పారదర్శకమైన టేప్ పెట్టాలి. ఆ నేమింగ్ టేబుల్ పై రాసినటువంటి అక్షరాలు చెరిపోవు.
8. పాత్రలు మరకలు పడకుండా, అవి పగిలిపోకుండా ఉండడానికి పాత్రల్ని వేర్వేరుగా ఉంచాలి. అంటే చిన్న పాత్రలు, పెద్ద పాత్రలు అల్యూమినియం, గాజుపాత్రలు, కాపర్ మొదలైనవాటిని వేర్వేరుగా ఉంచాలి.
9. ఎలక్ట్రిక్ పరికరాలు ఉపయోగంలో లేనప్పుడు వాటిని ఆఫ్ చేసి ప్లగ్ తీసివేయాలి.
10. కిచెన్ లోని టైల్స్ మొదలైన వాటిని ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి. గచ్చును ఫినాయిల్ తో శుభ్రం చేసుకొంటుండాలి. అప్పుడే వంటగదిలో ఈగలు, దోమలు రాకుండా శుభ్రంగా ఉంటుంది.

English summary

Tips for Cleaning and Maintaining a Kitchen...! | ఈ సూచనలు పాటిస్తే మీరే కిచెన్ క్వీన్...!

The kitchen is one of the busiest rooms in the home, and one where things can get messy fast. Learn these kitchen cleaning tips to keep ahead of the mess. Here are some simple tips to help you keep your kitchen clean.
Story first published:Thursday, April 19, 2012, 14:33 [IST]
Desktop Bottom Promotion