Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
సరిగ్గా చదవకపోతే గాడుదలను కాస్తావా అని మన చిన్నప్పటి వయసులో తల్లిదండ్రులు అనడం సహజం. ప్రస్తుత పరిస్థిలో ఆ పద్ధతి ఇప్పుడు మారింది. నిజంగానే గాడుదలను కాసి కొందరు వ్యాపారులు లక్షల రూపాయలను వెనకేసుకుంటున్నారు. అలాగే గుజరాత్‌కు చెందిన పతన్ జిల్లాల్లోని వ్యక్తి 20 గాడిదలను ఒకేసారి కాసి లీటరు గాడిది పాలను రూ.5000లకు అమ్ముతున్నాడు. .
సాదాసీదా గాడిదపాలు అమ్మే రైతు
గుజరాత్‌లోని పతన్ జిల్లాలో సొలంకి ఒక సాదాసీదా గాడిదలను పెంచుకొని వాటి పాలను అమ్మేవాడు. దీనినే పెద్ద వ్యాపారంగా మార్చుకోవాలని అనుకున్నాడు. దాని కోసం 20 గాడిదలను కొని 22 లక్షల రూపాయల పెట్టుబడితో గాడిద ఫార్మ్‌ను మొదలుపెట్టాడు. గాడిద కొన్ని పాలనే ఇచ్చినా వాటిలో చాలా పోషకాలుంటాయ్. చిన్న బాలిళ్లలో గాడిద పాలను ఎక్కువ రేటుకు అమ్ముతారు కాబట్టి, ఒక లీటరు గాడిదపాలను రూ.5000ల నుంచి రూ.7000ల వరకు అమ్మాడు. అనుకున్నట్లుగా లాభాలు వచ్చాయ్. 20 గాడిదలతో ప్రారంభమైన వ్యాపారం 42 గాడిదల వరకు చేరుకుంది.

1 కేజీ గాడిదపాల పొడి ధర రూ.1 లక్ష
ఇప్పుడు సొలంకి అమ్మే గాడిద పాలకు దక్షిణ భారత దేశంలో మంచి డిమాండ్ ఉంది, కర్నాటక, కేరళలో ఈ పాలను సప్లై చేస్తున్నారు. దాదాపు దేశమంతటా సొలంకి గాడిద పాలకు గిరాకీ బాగా వస్తోంది. ఈ గాడిద పాలను పౌడర్ రూపంలో కూడా అమ్మి వ్యాపారాన్ని మరింత పెద్దగా చెయ్యాలను నిర్ణయించుకొని 1 కేజీ గాడిద పాల పౌడర్‌ను రూ.1 లక్షకు అమ్ముతున్నారు.
ప్రత్యేకమైన పోర్టల్
సొలంకి గాడిద పాల వ్యాపారానికి అవుల్‌లెట్, డెలివరీలకు సంబంధించి ఆన్‌లైన్ పోర్టల్ కూడా ఉంది. ఎవ్వరైనా సరే ఈ ఆన్‌లైన్ పోర్టల్‌లోకి వచ్చి తమ ఆర్డర్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ గాడిద పాల వ్యాపారం టర్నోవర్ సంవత్సరానికి రూ.50 లక్షల నుంచి 2.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంట్లో కొసమెరుపు ఏంటి అంటే సొలంకి వ్యాపారాన్ని మొదలుపెట్టి కేవలం 8 నెలలు మాత్రమే అవుతోంది. గాడిద పాల వ్యాపారం చేయాలని దక్షిణ భారత దేశం నుంచి స్పూర్తి పొందారట.



Click it and Unblock the Notifications
