For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రావణమాసంలో ఎటువంటి ఆహారాలు తినకూడదు?

|

శ్రావణ మాసం మహాదేవుడు అయిన శివుడికి అంకితం చేయబడింది. చాలామంది ఈ మాసమంతా ఉపవాసాలు చేస్తారు మరియు ఈ సమయంలో శాఖాహారానికే పరిమితమై ఉంటారు. హిందూయిజం ఈ మాసమంతా శాఖాహారానికే పరిమితమై ఉండాలని మరియు శాఖాహారంలో కొన్ని కూరగాయలు మాత్రమే భుజించాలని చెప్పబదిఉన్నది.

మహాదేవుడు అయిన శివుడిని స్మరిస్తున్నప్పుడు మరియు పూజలు నె రపుతున్నప్పుడు ప్రజలు సాధారణంగా శాఖాహారాన్నే తీసుకుంటారు. ఈ శ్రావణ మాసమంతా ఉపవాసాలు ఉండి, శివుడిని పూజిస్తూ మరియు స్మరిస్తూ ఉంటే, వారికి శివుడి దీవెనలు పొందుతారని ఒక నమ్మకం. వారివారి కోరికలను శివుడు తీరుస్తాడని నమ్మకం.

అయితే,శ్రావణ మాసంలో శాకాహారం తీసుకోవటానికి కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, శాఖాహారంకాని ఆహార పదార్థాలే కాకుండా, మీరు శ్రావణ మాసంలో తినకూడని కొన్ని శాఖాహారపదార్థాలు కూడా ఉన్నాయి.

ఒక హిందువు శ్రావణ మాసం మొత్తం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా, శాఖాహారం కానివాటిని మాత్రమే కాకుండా, మీరు శ్రావణ మాసంలో తినకూడని ఆహారపదార్థాలను పరిశీలిద్దాం...

ఆకుకూరలు

ఆకుకూరలు

సాధారణంగా, ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివని భావిస్తారు. కానీ హిందూమత గ్రంథాలలో శ్రావణ మాసమంతా మంచి ఫలితం పొందాలి అనుకొంటే అతను / ఆమె గాని ఆకుకూరలు తినకూడదు అని చెప్పబడుతున్నది.. శాస్త్రీయంగా, రుతుపవనాలు సమయంలో ఆకుకూరలు తీసుకోవటం వలన మన శరీరంలో పైత్య పరిమాణం పెంచే అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా ఈ సమయంలో ఆకుకూరలకు ఎక్కువగా కీటకాలు మరియు పురుగులు పట్టి ఉంటాయి ఇవి మన ఆరోగ్య సమస్యలకు గొప్ప కారణమవుతున్నాయి . ఈ కారణాలవల్ల శ్రావణమాసంలో ఆకుకూరలు తీసుకోకూడదు అని హిందూమత గ్రంథాలు పేర్కొన్నాయి.

వంకాయ

వంకాయ

ఆకుకూరలు తరువాత, ఋతుపవనాల సమయంలో వంకాయ కూడా ఒక గొప్ప ఆహారంగా పరిగణించరు. . గ్రంథాలలో వంకాయను మలినాలతోకూడిన ఆహారంగా చెపుతారు. అందువలన కార్తీకమాసంలో ఉపవాసాలు పాటించేవారు వంకాయను భుజించరు. ఎందుకు అంటే. శాస్త్రీయంగా, వంకాయలో సాధారణంగా కీటకాలు చాలా పొంచిఉంటాయి మరియు అందువలన శ్రావణ మాసంలో తినడానికి సురక్షితమైనది కాదు.

పాలు

పాలు

ఆయుర్వేదం ప్రకారం, ఈ సమయంలో పాలు త్రాగినందువలన మన శరీరంలో పైత్యగుణం పెరుగుతుంది. ఒకవేళ పాలు త్రాగాలనుకునేవారు వాటిని బాగా మరిగింఛి, త్రాగాలి. పచ్చి పాలు ఎట్టి పరిస్థితిలోను త్రాగకూడదు. శ్రావణ మాసంలో పాలను పెరుగుగా తయారుచేసుకుని సేవించాలి.

ఉల్లిపాయలు & వెల్లుల్లి

ఉల్లిపాయలు & వెల్లుల్లి

హిందూమతం సాత్విక ఆహారంలో భాగంగా ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి పరిగణించదు. వీటిని విష్ణువు, రాహు మరియు కేతువుల తలలను ఖండించినపుడు వొచ్చిన అమృతంతో ఉద్భవించాయని నమ్ముతారు. అందువలన ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి తీసుకునేవారిలో రాక్షసులకు ఉన్నటువంటి కలుషితమైన ఆలోచనలు ఉంటాయని నమ్మకం. శాస్త్రీయంగా, ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి మానవ శరీరంలో వేడిని పెంచి అనేక వ్యాధులను పెంపొందటానికి కారణమవుతున్నాయి. అందువలన శ్రావణ మాసంలో ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి తినడాన్ని మినహాయింపు ఇచ్చారు.

సారాయి

సారాయి

మద్యం సేవించటం హిందూమతంలో ఒక నిషేధంగా ఉన్నది. మద్యం ఒక తామసిక వస్తువు అందువలన శ్రావణ మాసంలో దీనిని తాగడానికి మినహాయింపు ఇచ్చారు . ఇది మనిషిలో ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది మరియు అతని / ఆమెగాని, తమ స్పృహ కోల్పోతారు. దీనిని సేవించటం వలన వ్యక్తిలో శారీరకవాంఛలను మరియు దురాశవంటి కోరికలను సృష్టిస్తుంది. అందుకే దీనికి శ్రావణ మాసంలో మినహాయింపు ఇచ్చారు.

మాంసాహార ఆహారాలు

మాంసాహార ఆహారాలు

హిందువులు ఈ నెలలో మాంసాహారపదార్థాలకు వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నమ్ముతారు. కాబట్టి మాంసాహారం నివారించటం మంచిది. పౌరాణిక పరంగా శ్రావణమాసం అంటే ప్రేమ మరియు శృంగారాన్ని పండించే నెల అంటారు.. ఆచరణాత్మకంగా,ఈ సమయంలో చాలా జంతువులకు సంతానోత్పత్తి సీజన్. ఈ సమయంలో ఆడచేపలు, వాటి కడుపులో గుడ్లు కలిగిఉంటాయి అందువలన ఈ సమయంలో హిందూమత చట్టాలు ఫిషింగ్ నిషేధించాయి. గర్భం ధరించినప్పుడు లేదా గుడ్లమీద ఉన్నప్పుడు జంతువులను చంపడం ఒక మహాపాపం. అందుకే హిందువులు ఈ నెలలో మాంసం మరియు చేపలకు దూరంగా ఉంటారు.

Desktop Bottom Promotion