తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.!

విదేశాలకు వెళ్లాలని, అక్కడ కొత్త ప్రదేశాలు, అనుభవాలు అనుభూతి చెందాలని చాలా మందికి ఉంటుంది. కానీ బడ్జెట్‌, సమయం, వీసా వంటి సవాళ్ల ద్వారా విదేశీ ప్రయాణం కల వాయిదా పడుతూ వస్తుంది. ముఖ్యంగా విదేశీ పర్యటనలో కీలకమైన వీసా నిబంధనలు.. ఒక్కో దేశానికి ఒక్కో విధంగా ఉంటుంది. అయితే మీరు కూడా మొదటిసారి ఫారిన్‌కి వెళ్లాలని ప్లాన్‌లో ఉన్నట్లయితే వీసా తిరస్కరణకు గురి కాకుండా చూసుకోవాలి. దాని కంటే ముందుగా ఏయే కారణాల వల్ల వీసాను రిజెక్ట్‌ చేస్తారో తెలుసుకోవడం ముఖ్యం.

abroad for the first time these 5 mistakes could lead to your visa being rejected

తప్పుడు సమాచారాన్ని పొందుపరచకండి..

వీసా దరఖాస్తు ఫారంలో చాలామంది తెలిసీతెలియక చేసే ప్రధాన తప్పు తప్పుడు లేదా అసంపూర్ణ సమాచారం ఇవ్వడం. పాస్‌పోర్ట్ నంబర్‌లో లేదా పేరులో చిన్న పొరపాటు ఉన్నా అప్లికేషన్‌ ఆలస్యం కావడం లేదా, తిరస్కరణకి గురి కావచ్చు. వీసా అప్లికేషన్‌ సమర్పించే ముందు పాస్ట్‌పోర్ట్‌, సంబంధిత పత్రాలతో మొత్తం సమాచారాన్ని సరిచూసుకోవాలి. కల్పిత, తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవచ్చు.

ఆదాయ, ఆర్థిక సంబంధిత రుజువు

వీసా మంజూరు చేసే ముందు ప్రయాణికులు తమ జర్నీకి సరిపడా బడ్జెట్‌ కేటాయించుకున్నారో లేదో దేశాలు చెక్‌ చేస్తాయి. అందుకు సంబంధించి బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌లు, శాలరీ స్లిప్‌లు, ఆదాయపు పన్ను పత్రాలు వంటి ముఖ్యమైన పేపర్లను సమర్పించాల్సి ఉంటుంది. అస్పష్టమైన, పొంతన లేని ఆర్థిక పత్రాలను సమర్పించినట్లయితే అది వీసా అప్లికేషన్‌ తిరస్కరణకి దారితీయవచ్చు.

విదేశీ ప్రయాణం ఎందుకు చేస్తున్నారు..

మీరు విదేశీ ప్రయాణం చేయడం వెనుక అసలైన ఉద్దేశాన్ని వీసా దరఖాస్తులో స్పష్టంగా పొందుపరచాలి. బంధువును కలవడం, చదువు, పర్యాటకం, వర్క్‌ ఇలా కారణం ఏదైనా స్పష్టంగా ఉండాలి. ఇతర డాక్యుమెంట్స్‌లో కూడా ఈ విషయం పొందుపరచాలి.

abroad for the first time these 5 mistakes could lead to your visa being rejected

నకిలీ డాక్యుమెంట్స్‌తో జాగ్రత్త

ఎలాగైనా వీసా పొందాలనే ఉద్దేశంతో బ్యాంక్‌ స్టేట్‌మెంట్స్‌, ఉద్యోగానికి సంబంధించిన లెటర్స్‌, హోటల్‌ బుకింగ్‌లు వంటి ఇతరత్రా నకిలీ లెటర్స్‌తో అప్లికేషన్‌ను ఫిల్‌ చేయకూడదు. లేదంటే అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. తప్పుడు సమాచారంతో పట్టుబడితే భవిష్యత్తులో వీసా పొందడంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు.

డాక్యుమెంట్స్‌ పూర్తిగా ఉండాలి

వీసా మంజూరు చేయాలా వద్దా అనే ప్రాసెస్‌లో ప్రతి దేశానికి కొన్ని రూల్స్‌ ఉంటాయి. అప్లికేషన్‌ ఫారాలు, ఫొటోగ్రాఫ్‌లు, ఇన్సూరెన్స్‌, బయోమెట్రిక్‌ డేటా అపాయింట్‌మెంట్‌లు, ఇంటర్వ్యూలు ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా అప్లికేషన్‌ రిజెక్ట్‌ కావచ్చు. ట్రావెల్‌ ఏజెంట్ల సలహాపైన మాత్రమే ఆధారపడకూడదు. మీరు ఏ దేశానికి వెళ్తున్నారో.. ఆ దేశానికి సంబంధించి అధికారిక ఇమ్మిగ్రేషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవాలి.

Story first published: Sunday, October 4, 2026, 7:53 [IST]
Desktop Bottom Promotion