Latest Updates
-
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు!
ఇలా చేస్తే కుండపోత వర్షం కూడా ఆగిపోతుందట.. మన పల్లెల్లో చేసే 7 వింత ప్రయోగాలు!
వర్షం రోజుల తరబడి విరామం లేకుండా కురుస్తుంటే వీధులన్నీ చెరువులను తలపిస్తూ, ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోతుంది. అప్పటివరకు సంతోషాన్నిచ్చిన వాన దేవుడిపై అమాంతం విసుగు పుడుతుంది. సరిగ్గా ఇలాంటి నిస్సహాయ పరిస్థితుల్లోనే, వర్షాన్ని ఆపడానికి మన భారతీయులు కొన్ని విచిత్రమైన, అత్యంత ఆసక్తికరమైన నాటు చిట్కాలను ప్రయోగిస్తుంటారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా, ఇప్పటికీ పల్లెల్లో ఎంతో నమ్మకంతో పాటించే ఆ దేశీ ట్రిక్స్ ఏంటో ఇక్కడ చూడండి.

కప్పలకు విడాకులు ఇప్పించడం
వానలు కురవాలని కప్పలకు పెళ్లి చేయడం మనందరికీ తెలిసిందే. వానలు ఆగాలంటే ఆ కప్పల జంటకు ప్రతీకాత్మకంగా విడాకులు ఇప్పిస్తారు. వాటిని వేరు చేయడం ద్వారా మాకు ఇక నీటి అవసరం లేదు, వానను ఆపేయ్ అని వరుణ దేవుడికి సందేశం పంపుతారన్నమాట.
ఆకాశం వైపు చూసేలా చీపురు నిలబెట్టడం
పల్లెటూళ్లలో ఎవరింటి బయటైనా చీపురును తలకిందులుగా (కట్ట పైకి ఉండేలా) నిలబెట్టడం మీరు ఎప్పుడైనా చూశారా? దానర్థం ఆ ఇంట్లోని వారు వర్షం వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారని. ఇంటి ఆవరణలో చీపురును అలా ఆకాశం వైపు చూపిస్తూ నిలబెడితే, అది మేఘాలను ఊడ్చిపారేస్తుందని, వాన మేఘాలు దెబ్బకు చెదిరిపోతాయని ఒక నానుడి.
ఆరుబయట ఉప్పు చల్లడం
వర్షం పడుతున్నప్పుడు ఇంటి పైకప్పు మీద లేదా ఆరుబయట గుప్పెడు ఉప్పును విసురుతారు. నీటిలో ఉప్పు నెమ్మదిగా ఎలాగైతే కరిగిపోతుందో, ఆకాశాన్ని కమ్మేసిన దట్టమైన మేఘాలు కూడా అలాగే కరిగిపోయి ఎండ వస్తుందని దీని వెనుక ఉన్న లాజిక్.
గ్యాస్ స్టవ్ పై తలకిందులుగా పెనం
ఉత్తర భారతదేశంలోని చాలా ఇళ్లలో వానను ఆపడానికి వేసే మొదటి చిట్కా ఇది. కుండపోత వర్షం ఆగకుండా పడుతున్నప్పుడు, ఇంట్లోని మహిళలు చపాతీలు కాల్చే పెనాన్ని గ్యాస్ స్టవ్ మీద బోర్లా పెట్టి వేడి చేస్తారు. ఆ పెనం ఎంత వేడెక్కితే, ఆకాశంలోని మేఘాలు అంతగా ఆవిరైపోయి వర్షం త్వరగా ఆగిపోతుందనేది వారి ప్రగాఢ నమ్మకం.
పొడి టవల్ కు గట్టి ముడి
వర్షం ఏకధాటిగా దంచికొడుతున్నప్పుడు ఇంటి పెద్దలు ఒక పొడి టవల్‌ను లేదా ఏదైనా పొడి గుడ్డను తీసుకుని దానికి దారం లేదా తాటితో ఒక గట్టి ముడి వేస్తారు. ఆ తర్వాత దాన్ని గుమ్మానికో, మేకుకో వేలాడదీస్తారు. ఆ ముడిలో వానను బంధించేశాం అని, ఇక వర్షం కురవదని వారు విశ్వసిస్తారు.
మట్టిలో గొడ్డలి లేదా మట్టి కప్పులు పాతిపెట్టడం
తడి మట్టిలో ఒక ఎండిన టీ కప్పును బోర్లా పాతిపెడితే అది వర్షాన్ని తిప్పికొడుతుందట. అలాగే కొన్ని ప్రాంతాల్లో గొడ్డలిని తలకిందులుగా భూమిలో పాతిపెట్టడం కూడా మనం చూడొచ్చు. ఇలా చేయడం వల్ల ఆకాశం నిర్మలంగా మారుతుందని వారి నమ్మకం.
ఎదురుకాళ్లతో పుట్టిన వారి కిక్
కాళ్లు ముందుగా వచ్చి (ఎదురుకాళ్లతో లేదా తలకిందులుగా) పుట్టిన పిల్లలకు కొన్ని ప్రత్యేక శక్తులు ఉంటాయని గ్రామీణ ప్రాంతాల్లో బలంగా నమ్ముతారు. వర్షం ఆగనప్పుడు, అలాంటి వారిని పిలిచి ఇంటి బయట ఉన్న ఏదైనా కర్రను లేదా చెట్టును గట్టిగా తన్నమని చెబుతారు. ఆ దెబ్బకు ఇంద్రుడు శాంతించి వర్షాన్ని ఆపేస్తాడని నమ్ముతారు.



Click it and Unblock the Notifications
