Latest Updates
-
మేఘన చికెన్ బిర్యానీ.. అస్సలు మిస్ అవ్వకండి! -
కేవలం వారం రోజుల్లో బరువు తగ్గడం ఎలా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. -
బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కు బెస్ట్..ఇంట్లోనే హై ప్రోటీన్ చపాతీ చేసుకోండిలా.. -
చలికాలంలో జలుబు, దగ్గు దరిచేరనివ్వని..ఇమ్యూనిటీని రెట్టింపు చేసే ఉసిరి చ్యవన్ ప్రాష్ ఎలా చేసుకోవాలంటే.. -
శీతాకాలపు పార్టీల్లో అతిగా తిని, తాగుతున్నారా? తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ ముప్పు! -
చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్నిచ్చే ఆరోగ్యకరమైన నువ్వుల పట్టీ..ఇంట్లోనే ఇలా చేసుకోండి! -
ఒక్క లిప్ కిస్ ప్లీజ్.. విదేశీ యూట్యూబర్ తో మనోడు వెకిలి చేష్టలు, వీడియో చూడండి.. -
రాజస్థానీ పెరుగు వెల్లుల్లి చట్నీ.. ఇడ్లీ, దోశ, చపాతీలకు బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
ఆరోగ్యం, రుచి కలగలిసిన చలికాలం స్పెషల్..బీట్ రూట్ లడ్డూ ఇలా ఈజీగా చేసేయండి! -
సాయంత్రం టీ టైమ్ కోసం కరకరలాడే అటుకులు వేరుశెనగ పకోడీ.. నిమిషాల్లో ఇలా చేసుకోండి!
రైలులో థర్డ్ ఏసీ ప్రయాణంపై కొడుకు ఫిర్యాదు.. జనరల్ కంపార్ట్‌మెంట్ కి తీసుకెళ్లిన తండ్రి.. వీడియో వైరల్
సాధారణంగా ఎప్పుడు ఫస్ట్ క్లాస్ ఏపీ, సెకండ్ క్లాస్ ఏసీలో తన కుటుంబంతో ప్రయాణించేవాడు ఆ బాలుడు. అయితే దీపావళి సమయంలో టిక్కెట్లు దొరక్క తండ్రి థర్డ్ ఏసీలో బుక్ చేయగా..రైలు ఎక్కిన దగ్గర నుంచి థర్డ్ ఏసీలో టిక్కెట్లు బుక్ చేశారని తన తల్లిదండ్రులపై అసహనం వ్యక్తం చేశాడు. దీంతో ఆ తండ్రి తన కుమారుడికి జీవితం అసలు ఎలా ఉంటదో తెలపాలని నిర్ణయించుకున్నారు.
దీపావళి పండుగ సమయంలో అత్యవసర ప్రయాణ ప్రణాళికల కారణంగా తమ కుటుంబం 3AC టిక్కెట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని ఆ తండ్రి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో ద్వారా వివరించారు. హై క్లాస్ సౌకర్యాలకు అలవాటుపడిన తన కుమారుడికి, సామాన్య ప్రయాణికుల కష్టసుఖాలను చూపించాలని ఆయన భావించారు.

ఇందులో భాగంగానే తన కొడుకును తీసుకుని నేరుగా రైలులోని జనరల్ కంపార్ట్‌మెంట్ లోకి నడిచారు. ఆ వీడియోలో కిక్కిరిసిన సాధారణ కోచ్ లో ప్రయాణికులు బెర్త్ లపై, నేలపైన, చివరికి బాత్రూమ్ ల దగ్గర కూర్చుని, పడుకుని ఉండగా ఆ చిన్న బాలుడు ఆ రద్దీ గుండా నడుస్తూ ఉండటం బాలుడు తండ్రి షేర్ చేసిన వీడియోలో చూడవచ్చు. ఎంతో అవగాహన ఉన్న తన బిడ్డకు ఒక కొత్త దృక్కోణాన్ని అందించాలనే తాను ఈ పని చేశానని, తాను చూపించాలనుకున్న దానిపై ఆ బాలుడు కూడా అంతే ఆసక్తి కనబరిచాడని ఆయన తెలిపారు.
సౌకర్యాలు, పరిస్థితులు అనేవి ఇతరులతో మనం ఎలా ప్రవర్తించాలో ఎన్నటికీ నిర్ణయించకూడదని ఆ తండ్రి తన కుమారుడికి అర్థమయ్యేలా చెప్పారు. ప్రతి జీవితం సమానమే, ప్రతి ఒక్కరూ ఒకే గౌరవానికి అర్హులు అని తాను ఎప్పుడూ గుర్తుచేస్తుంటానని ఆయన అన్నారు. సంపద, సామాజిక హోదా శాశ్వతం కాదని వివరిస్తూ.. 300 ఏళ్ల క్రితం రైతులు సంపన్నులుగా ఉండేవారని, శ్రామిక వర్గాన్ని సేవకుల్లా చూసేవారని గుర్తుచేశారు.

కాలక్రమేణా మారే విధానాలతో సమాజంలో ధనిక, పేద నిర్వచనాలు మారుతాయని, వందేళ్ల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరని తెలిపారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒకరి కంటే ధనవంతులుగా, మరొకరి కంటే పేదలుగా ఉంటారని వివరించారు. ధనవంతులు సైతం అర్థంపర్థం లేకుండా మాట్లాడటం తాను చూశానని, కానీ పల్లెటూరి పిల్లలు మాత్రం ఎంతో తెలివైనవారిలా కనిపిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రపంచానికి ప్రతి ఒక్కరూ సమానంగా తోడ్పడతారని ఆ బాలుడికి బోధించారు.
నిజ జీవిత అనుభవం ద్వారా కొడుకుకు సానుభూతి, వినయం నేర్పించిన ఆ తండ్రి పెంపకంపై సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది ఖచ్చితంగా మంచి పెంపకానికి నిదర్శనమని నెటిన్లు కామెంట్లు చేస్తున్నారు.



Click it and Unblock the Notifications
