Latest Updates
-
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే?
వళ్లంతా వత్తైన జుట్టుతో పసిబాలుడు.. తల్లి దానిని తన్నందుకేనా..?
ఫిలిఫైన్స్‌లోని అపాయావోలో ఓ వింత కేసు వెలుగు చూసింది. వళ్లంతా వత్తైన జుట్టుతో ఓ పసివాడు పుట్టాడు. ఆ బాలుడి పేరు జారెన్ గమొంగన్. ప్రస్తుతం జారెన్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయ్. వత్తైన జుట్టుతో జన్మిస్తే పిల్లలు చాలా ఆరోగ్యంగా పుట్టారని భావిస్తాము.. కానీ జారెన్‌కు మెడ, ముఖము, చేతులు, వీపు, ఇలా శరీరంపై అన్ని ప్రదేశాల్లో వత్తైన జుట్టు ఉంది.

image courtesy: news9live.com
హైపర్‌ట్రైకోసిస్
బాలుడు జారెన్ హైపర్‌ట్రైకోసిస్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఇలాంటి కేసు 100 కోట్ల మందిలో ఒక్కరికి మాత్రమే వచ్చే అవకాశం ఉందన్నారు. వందల ఏళ్ల నుంచి కేవలం 50 నుంచి 100 మాత్రమే నమోదైనట్లు స్పష్టం చేశారు. ఇక ఎక్కువ జుట్టుతో కొడుకు జారెన్ పడే బాధల గురించి తల్లి చెబుతూ ఆవేదనకు లోనవుతోంది. ఎండాకాలంలో జారెన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడంటోంది. జుట్టును షేవ్ చేసినా తిరిగి మళ్లీ పెరుగుతుందని తల్లి చెబుతోంది.
శరీరంపై జారెన్‌కు ఉన్న జుట్టును పర్మనెంట్‌గా తీసి వేయాలంటే లేజర్ హేర్ ట్రీట్మెంట్ రిమూవల్ చేయాల్సిందేనని వైద్యులు సూచిస్తున్నారు. ఒక నెలలో కనీసం 10 సార్లు లేజర్ హేర్ రిమూవల్ సెషన్లు అవసరమౌతాయని అంటున్నారు.
కారణం అడవి పిల్లి
జారెన్ ఇలా పుట్టడానికి ప్రత్యేక కారణం ఉందని తల్లి చెప్పుకొచ్చింద. జారెన్ కడుపులో ఉన్నప్పుడు తనకు తాను ఉన్న అడవి ప్రాంతంలో ఆడవి పిల్లులు ఉండేవని. అవి తినడానికి చాలా రుచికరంగా ఉండేవని చెప్పుకొచ్చింది. ఆ అడవి పిల్లులను వేటాడి వంట చేసుకొని ఆనందంగా ఎన్నోసార్లు తిన్నానని అందుకేనేమో కొడుకు జారెన్‌కు పిల్లులకు ఉన్నట్లు వళ్లంతా జుట్టుతో నిండి ఉందని చెబుతోంది.
రెండేళ్ల జారెన్ భవిష్యత్తు
రెండేళ్ల జారెన్‌కు నయమయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. తల్లి మాత్రం అంతా తాను పిల్లులు తినాలనే కోరికతో ఉన్నందుకే ఇలా జరిగిందని అనుకుంటోంది. బిలియన్ మందిలో ఒకరికి మాత్రమే ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. లేజర్ ట్రీట్మెంట్ ద్వారా నిజంగానే జారెన్‌కు ఈ హైపర్‌ట్రైకోసిస్ నయం కావాలని కోరుకుందాం. కేవలం రెండేళ్ల జారెన్‌కు ఇంకా బంగారు భవిష్యత్తు ఎంతో ఉంది. ఎన్నో రోగాలకు చికిత్సలు కనుగ్గొన్న వైద్యులు జారెన్ సమస్యకు కూడా త్వరలోనే పరిష్కారం చూపెడుతారు. కానీ ఈ కేసు గమినస్తే మాత్రం తల్లి గర్భంతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



Click it and Unblock the Notifications
