Latest Updates
-
టేస్టీ అండ్ క్రంచీ స్నాక్ ..కరకరలాడే శనగపిండి మసాలా పల్లీలు ఇలా చేసుకోండి -
తెల్ల ఇడ్లీ కాదు..అసలైన శక్తి ఉన్న నల్ల ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
నేపాల్ ను వణికించిన జలప్రళయం.. వరదల్లో చిక్కుకుంటే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? -
Budha nakshatra gochar 2026 : పూర్వఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు..ఆగస్టు 29 నుంచి ఈ 4 రాశులకు అగ్నిపరీక్షే! -
ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా! -
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు -
నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్
మై బ్రదర్, మై సూపర్ హీరో..మీ సోదరుడికి రాఖీ విషెస్ చెప్పండిలా
అన్నాచెల్లెళ్లు, అక్కాతముళ్ల బంధం చాలా పవిత్రమైనది. ఈ మధురమైన బంధానికి ప్రతీకగా నిలిచే పండుగే రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి). ఈ ఏడాది రాఖీ పండుగను ఆగస్టు 28న జరుపుకుంటారు. రాఖీ పండుగ రోజుల సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి,వారు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సంతోషంగా వర్ధిల్లాలని మనసారా ప్రార్థిస్తారు. అలాగే సోదరులు కూడా తమ అక్కాచెల్లెళ్లకు జీవితాంతం రక్షణగా, ప్రతి కష్టంలోనూ అండగా ఉంటామని వాగ్దానం చేస్తారు.
ఒక్క ముక్కలో రాఖీ పండుగ గురించి చెప్పాలంటే..ఒకరికొకరు ఎప్పటికీ తోడుంటామనే భరోసాను ఇచ్చే అద్భుతమైన సందర్భం. ఈ ప్రత్యేకమైన రోజున మీ ప్రియమైన సోదరుడికి మీ ప్రేమను వ్యక్తపరచాలనుకుంటున్నారా? మీ మనసులోని భావాలను అందమైన పదాలుగా మలచి మీ అన్నయ్యకు లేదా తమ్ముడికి పంపగలిగే టే కొన్ని బెస్ట్ రాఖీ విషెస్, స్టేటస్ సందేశాలను ఇక్కడ చూడండి.

మీ సోదరుడికి పంపాల్సిన బెస్ట్ రక్షాబంధన్ విషెస్
-నాన్న తర్వాత నాన్నలా నన్ను చూసుకునే నా అన్నయ్యకు రాఖీ పండుగ శుభాకాంక్షలు.
నాకు ఎలాంటి సిరిసంపదలూ, ఖరీదైన కానుకలూ వద్దు. నీ సంతోషమే నా బహుమతి. మన అన్నాచెల్లెళ్ల ప్రేమ కలకాలం ఇలాగే వర్ధిల్లాలి. రక్షాబంధన్ శుభాకాంక్షలు.
-నా ప్రియమైన సోదరా, నీ ప్రతి ఆనందంలో నీ చిరునవ్వు వెలగాలి, నీ ప్రతి అడుగులో విజయం దరిచేరాలి. నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండాలి. హ్యాపీ రక్షాబంధన్.
-నా అల్లరినంతటినీ ఓపికగా భరిస్తూ, నా ప్రతి అడుగులోనూ అండగా నిలిచే నీలాంటి సోదరుడిని ఇవ్వడం దేవుడు నాకిచ్చిన గొప్ప వరం. రక్షాబంధన్ శుభాకాంక్షలు.
-పట్టు దారంతో ముడిపడిన మన అమూల్యమైన ప్రేమ బంధం ఎప్పటికీ ఇలాగే నిలిచిపోవాలి. నా జీవితంలో నువ్వు ఎల్లప్పుడూ తోడుండాలని కోరుకుంటూ.. నా ప్రియమైన సోదరుడికి రక్షాబంధన్ శుభాకాంక్షలు.

-కష్టసమయాల్లో నాకు కొండంత అండగా నిలిచే మొదటి వ్యక్తివి నువ్వే. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
-మనం ఎంత గొడవపడినా, నువ్వంటే నాకు ప్రాణం. నా ప్రియమైన సోదరుడికి హ్యాపీ రాక్షాబంధన్!
-బాల్యపు జ్ఞాపకాలు ఎన్నటికీ పాతబడవు, మన కబుర్లు ఎప్పటికీ ముగియవు. జీవితంలో మనం ఎంత దూరంలో ఉన్నా మన హృదయాల మధ్య బంధం ఎన్నడూ విడిపోదు. రాఖీ పండుగ శుభాకాంక్షలు.
-ఎన్ని జన్మలైనా నువ్వే నా సోదరుడిగా పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. హ్యాపీ రాఖీ.
-మణికట్టుకు కట్టే రాఖీ దారం, హృదయంలో దాచుకున్న ప్రేమ.. ఇవే మన బంధానికి పునాదులు. సోదరా, నువ్వు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సుసంపన్నంగా ఉండాలి. హ్యాపీ రక్షాబంధన్.
-ప్రపంచంలోకెల్లా అత్యంత స్వచ్ఛమైన బంధం మనది. ఎన్నిసార్లు గొడవ పడినా క్షణాల్లో కలిసిపోయే నీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
-నిన్ను చూసి నేను ఎప్పుడూ గర్విస్తుంటాను. నా గర్వకారణమైన సోదరుడికి రాఖీ శుభాకాంక్షలు.

-నేను నీ మణికట్టుకు రాఖీ కడుతూ, నీ దీర్ఘాయువు కోసం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వయసుతో పాటు అన్నీ మారినా నేను ఎప్పటికీ నీ గారాల చెల్లెలినే.
-నా పట్ల ఎంతో శ్రద్ధ వహించే నా సోదరుడిని చూసి నేను గర్వపడుతున్నాను. ఈ పవిత్రమైన రాఖీ పండుగ మన ప్రేమను శాశ్వతంగా నిలబెడుతుంది. రక్షా బంధన్ శుభాకాంక్షలు.

వాట్సాప్, ఫేస్ బుక్ కోసం రాఖీ స్టేటస్, కోట్స్
-తోబుట్టువుల ప్రేమను మించిన ఆస్తి ఈ ప్రపంచంలో మరొకటి లేదు. రాఖీ శుభాకాంక్షలు.
-ఈ ప్రపంచంలోనే బెస్ట్ బ్రదర్ కి రాఖీ శుభాకాంక్షలు.
-మై బ్రదర్.. మై సూపర్ హీరో.. హ్యాపీ రాఖీ.
-దూరం మన దేహాలకే కానీ మనసులకు కాదు. హ్యాపీ రాఖీ బ్రదర్.
-నీ తిట్లలోనూ నాపై అంతులేని ప్రేమ దాగుంటుంది. నువ్వు దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా, నీ ఉనికి మాత్రమే నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. హ్యాపీ రక్షాబంధన్.
-చిన్న విషయాలకే అలిగి మనస్తాపం చెందడం, ఆ తర్వాత వారంతట వారే ఒకరినొకరు ఓదార్చుకోవడం ఇదే మన బంధంలోని అందం. ప్రతి క్షణం మన బాల్యాన్ని గుర్తు చేసే అద్భుతమే ఈ రాఖీ.
-ప్రతి క్షణం నీకు తోడుగా ఉండాలి, నీ ప్రతి విజయంలో నేను భాగం కావాలి. నా సోదరుడికి జీవితంలో ఏ కష్టమూ రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. రక్షాబంధన్ శుభాకాంక్షలు.
-మన ప్రేమ కేవలం ఒక దారంతో ముడిపడి ఉన్నా, మన మధ్య ఉన్న నమ్మకం మాత్రం ఉక్కు కవచం లాంటిది. ప్రపంచమే మారినా మన అనుబంధం ఎప్పటికీ చెరగనిది.
-లవ్ యు ఆల్వేస్ బ్రదర్. రాఖీ పండుగ శుభాకాంక్షలు.
-నువ్వు నాకు కేవలం సోదరుడివి మాత్రమే కాదు.. నా బెస్ట్ ఫ్రెండ్, నా మార్గదర్శివి. నా కలలకు రెక్కలు తొడిగి, నా ప్రతి సంతోషంలో భాగమైన నీకు రాఖీ శుభాకాంక్షలు.
-నువ్వు లేకుండా నా బాల్యం అసంపూర్ణంగానే మిగిలిపోయేది. నీతో పంచుకున్న మధుర జ్ఞాపకాలు నా జీవితానికి సరిపడా ఆనందాన్నిస్తాయి. హ్యాపీ రాఖీ.
-ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీలాంటి సోదరుడు నాకు దొరికాడు. నా ప్రతి ఆనందంలోనూ, బాధలోనూ నా నీడలా ఉన్నందుకు కృతజ్ఞతలు. హ్యాపీ రాఖీ.



Click it and Unblock the Notifications