For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్మీ ఆఫీసర్ నుండి మిస్ ఇండియా 2017 వరకు షాలిని సింగ్ విజయ ప్రస్థానం ఎంతో మందికి ప్రేరణ

By R Vishnu Vardhan Reddy
|

కష్టాల నుండి తప్పించుకోవడం కష్టం. వాటికి తలొగ్గకుండా ఎదిరించడం నేర్చుకోవాలి, వాటిని తట్టుకొని దైర్యం గా నిలబడాలి అని తెలియ చెబుతూ ఎంతో మందికి ఆదర్శం గా నిలుస్తుంది షాలిని సింగ్.

23 సంవత్సరాలకే భర్త మరణించడంతో వితంతువుగా మారింది. అప్పటికే ఆమెకు 2 సంవత్సరాల వయస్సున్న కొడుకు కూడా ఉన్నాడు. ఇలాంటి సంక్లిష్ట సమయంలో కష్టాలను దాటుకొని విజయ తీరాలకు ఎలా చేరింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

మై స్టోరి: నా వైవాహిక జీవితమే ఒక పెద్ద రేప్!మై స్టోరి: నా వైవాహిక జీవితమే ఒక పెద్ద రేప్!

ఆర్మీ ఆఫీసర్ నుండి మిస్ ఇండియా 2017 అయ్యేంత వరకు షాలిని సింగ్ చూపించిన పట్టుదల అద్వితీయం. దేనైనా సాధించగలం అనే కృతనిశ్చయంతో ముందుకెళ్తే మనల్ని విజయానికి చేరనివ్వకుండా ఎవ్వరు ఆపలేరు అని రుజువు చేస్తుంది షాలిని సింగ్ జీవితం.

ఆమె ప్రేరణాత్మక నిజ జీవిత కథ మీకోసం....

ఆమె తన భర్తను ఎలా పోగొట్టుకుందంటే :

ఆమె తన భర్తను ఎలా పోగొట్టుకుందంటే :

షాలిని భర్త మేజర్ అవినాష్ సైన్యంలో పని చేసేవాడు. కాశ్మీర్ లో, 2001 లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అవినాష్ తన ప్రాణాల్ని పణంగా పెట్టి ఉగ్రమూకలతో పోరాడాడు. ఆ పోరాటం లో తన ప్రాణాలు దేశానికి అర్పించాడు. అనుకోని ఈ పరిణామంతో షాలిని ఒంటరిగా మిగిలిపోయింది. ఉన్న ఒక్కగానొక కొడుకుని తానే ఒంటరిగా పెంచవలసి వచ్చింది. ఆ సమయంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది.తనకు జరిగిన నష్టాన్ని ఎవ్వరు పూడ్చలేరని, అది తట్టుకొని నిలబడే శక్తి తనకు లేదని భావించి ఒకానొక సమయంలో ఆత్మహత్యకు ప్రయత్నించింది. కానీ తన కొడుకుని ఎవరు చూసుకుంటారు అనే ఆలోచన తనను ఆత్మహత్య వైపు అడుగు వేయనీయకుండా ధైర్యంతో ముందడుగు వేయించింది.

తన జీవిత గమనాన్ని మార్చుకుంది :

తన జీవిత గమనాన్ని మార్చుకుంది :

షాలిని, భర్త ఉన్నప్పుడు ఉన్నత చదువులు చదవాలని భావించింది. కానీ భర్త మరణించిన తర్వాత సర్వీస్ సెలక్షన్ బోర్డు కి దరఖాస్తు చేసుకుంది. అందులో భాగంగా రోజుకు కొన్ని గంటలపాటు వారం రోజులు ఇంటర్వ్యూ లకు హాజరు కావాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆ చిన్న బాబుని షాలిని తల్లిదండ్రులు ఇంటర్వ్యూ జరిగే ప్రాంత ఆవరణ బయట ఉండి చూసుకునేవారు.

అదృష్టం ఆమె పక్కనే ఉంది :

అదృష్టం ఆమె పక్కనే ఉంది :

ఎట్టకేలకు ఇంటర్వ్యూని విజయవంతంగా పూర్తి చేసి తాను దరఖాస్తు చేసుకున్న ఉద్యోగానికి ఎంపిక అయ్యింది. శిక్షణ నిమిత్తం ఆమెను చెన్నై పంపించారు. తన భర్త మొదటి సంవత్సరీకానికి కొద్దిరోజుల ముందు సెప్టెంబర్ 7, 2002 లో భారత దేశ సైన్యంలో ఆఫీసర్ గా భాద్యతలు చేపట్టింది.

6 సంవత్సరాల పాటు దేశానికి సేవ చేసింది :

6 సంవత్సరాల పాటు దేశానికి సేవ చేసింది :

షాలిని భారతీయ సైన్యం లో ఆరు సంవత్సరాల పాటు దేశానికి సేవ చేసింది. ఆమె ప్రస్తుత వయస్సు 39 సంవత్సరాలు. ఆమె ఇప్పటికి ఎన్నో ఉన్నత లక్షణాలను నిర్దేశించుకొని వాటిని చేరుకుంటూ తన విజయాల కిరీటంలో వెలకట్టలేని ఎన్నో విజయాలను అందుకుంటూ దూసుకు పోతోంది. ఈమధ్యనే " మిస్ ఇండియా 2017 క్వీన్ అఫ్ సబ్ స్టెన్స్ " కిరీటం అందుకుంది.

ఇదే నా కథ: ఒక వ్యభిచారిణి బిడ్డగా పెరగటం పూలపాన్పు కాదు...ఇదే నా కథ: ఒక వ్యభిచారిణి బిడ్డగా పెరగటం పూలపాన్పు కాదు...

ఆమె ఎంతో మందికి ఆదర్శం :

షాలిని ఎదుర్కొన్న కష్టాలు, తన జీవితంలో చేరాలనుకున్న లక్ష్యాల కోసం సవాళ్లను దాటి విజయాలను అందుకున్న తీరు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. దేశ వ్యాప్తంగా ఉన్న మహిళలకు, ఒంటరి తల్లిదండ్రులకు ప్రేరణగా మారింది ఆమె జీవితం. ఆమె సాధించిన ఈ కొత్త విజయాన్ని తన భర్తకు అంకితం చేసింది.

ఇలాంటి ధైర్య సాహసాలు కలిగిన మహిళలు మన సమాజం నుండి ఇంకా చాలా మంది రావాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది.

English summary

Real Life Story Of Shalini Singh A Single Mother

At the age of 23, she found herself widowed with a 2-year-old son but Shalini Singh decided to change her situation for the better!
Story first published:Saturday, August 19, 2017, 15:37 [IST]
Desktop Bottom Promotion