దిన ఫలాలు: శనివారం 30 డిసెంబర్ 2017

By Deepthi T A S

భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.

ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..

horoscope for 30 December 2017

ఓం శ్రీ గురుభ్యోనమః

అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.

ది. 30-12-2017 తారీఖు, శనివారం నాటి దిన ఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, శీతాకాలం, పుష్య మాసం, శుద్ధ ద్వాదశి శనివారం మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషాల వరకు ఉంది. కృత్తికా నక్షత్రం రాత్రి 12 గంటల 13 నిమిషాల వరకూ ఉంది. అమృత సమయం మధ్యాహ్నం 3 గంటల 51 నిమిషాల నుండి 5 గంటల 21 నిమిషాల వరకూ ఉంది. వర్జ్యం ఉదయం 6 గంటల 17 నిమిషాల నుండి 8 గంటల 45 నిమిషాల వరకూ ఉంది. దుర్ముహర్తం ఉదయం 7 గంటల 45 నిమిషాల వరకూ. సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 34 నిమిషాలకు, సూర్యాస్తమయ సమయం 5 గంటల 32 నిమిషాలకు.

మేష రాశి: 21 మార్చి-20 ఏప్రిల్

మేష రాశి: 21 మార్చి-20 ఏప్రిల్

ధనానికి సంబంధించిన ప్రణాళికలు వేస్తారు. భార్య సహకారంతో విజయాలు సాధిస్తారు. తండ్రి గారి ఆశీర్వాదం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు భాగ్యాన్ని కలుగచేస్తాయి. ధనానికి సంబంధించి ఆలోచనలు చేస్తారు.

వృషభ రాశి: 21 ఏప్రిల్-21 మే

వృషభ రాశి: 21 ఏప్రిల్-21 మే

అనుకున్నవన్నీ పూర్తి చేస్తారు. విందు భోజనం కూడా లభిస్తుంది. సోదరులు, పని వారి సహకారం ఉంటుంది. చేయు పనులలో అడ్డంకులు ఉంటాయి. దూరపు ప్రాంత వార్తలు వింటారు.

మిథున రాశి: 22 మే-21 జూన్

మిథున రాశి: 22 మే-21 జూన్

ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన కూడా ఏర్పడుతుంది. ఖర్చు గురించి ఆలోచన ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలు బావున్నాయి. పిల్లలతో ఆనందంగా గడుపుతారు.

కర్కాటక రాశి: 22 జూన్-22 జూలై

కర్కాటక రాశి: 22 జూన్-22 జూలై

అనుకున్న పనులు ఆటంకాలతో జరుగుతాయి. బంధు మిత్రుల కలయికలు ఉంటాయి. వారితో ఆనందంగా గడుపుతారు. గృహ సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. పిల్లలు వారి పనులు సక్రమంగా పూర్తి చేస్తారు.

సింహ రాశి: 23 జూలై-21 ఆగష్ట్

సింహ రాశి: 23 జూలై-21 ఆగష్ట్

దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవ దర్శన ప్రాప్తి కలదు. ఖర్చుల గురించి కొంచెం ఆలోచించవలసిన సమయం. పిల్లల విషయం సంతృప్తినిస్తుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కన్యా రాశి : 22 ఆగష్ట్-23 సెప్టెంబర్

కన్యా రాశి : 22 ఆగష్ట్-23 సెప్టెంబర్

పని వారి సహాయ సహకారాలు ఉంటాయి. ధన ప్రణాళికలు వేయవలసి ఉంటుంది. ఇంటి పనులు శ్రద్ధగా పూర్తి చేస్తారు. పిల్లల ప్రవర్తనపై ఒక కన్నేసి ఉంచాలి. దూరపు బంధువుల రాకపోకలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

తులా రాశి: 24 సెప్టెంబర్-23 అక్టోబర్

తులా రాశి: 24 సెప్టెంబర్-23 అక్టోబర్

అనుకున్న పనులు బాధ్యతగా పూర్తి చేయవలసి ఉంటుంది. వ్యాపార ప్రణాళికలు అనుకూలిస్తాయి. అధికారులు ప్రసన్నం అవుతారు. కొన్ని అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

వృశ్చిక రాశి: 24 అక్టోబర్-22 నవంబర్

వృశ్చిక రాశి: 24 అక్టోబర్-22 నవంబర్

భార్య సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. దైవ దర్శన ప్రాప్తి కూడా చేస్తారు. దూరపు బంధువుల వార్తలు కూడా వింటారు. వృత్తి వ్యాపారాలు లాభాన్ని ఇస్తాయి.

ధనూ రాశి: 23 నవంబర్-22 డిసెంబర్

ధనూ రాశి: 23 నవంబర్-22 డిసెంబర్

కొన్ని పనులు సులువుగా జరుగుతాయి. కొన్ని పనులు కష్టంగా జరుగుతాయి. ధనానికి ఇబ్బందులు ఉన్నాయి. కొత్త అవకాశాలు చేతికి వచ్చి జారిపోయే ప్రమాదం ఉంది. జాగర్త పడాల్సిన సమయం. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకర రాశి: 23 డిసెంబర్-20 జనవరి

మకర రాశి: 23 డిసెంబర్-20 జనవరి

పిల్లలతో ఆనందంగా గడుపుతారు. భార్య సహకారంగా కూడా ఉండగలదు. తండ్రి గారి ఆశీర్వాదం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభాన్ని ఇస్తాయి.

కుంభ రాశి: 21 జనవరి-20 ఫిబ్రవరి

కుంభ రాశి: 21 జనవరి-20 ఫిబ్రవరి

ఇంటికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. తల్లి గారి ఆశీర్వాదం కూడా ఉంటుంది. పిల్లలు చేసే పనులపై ఒక కన్నేసి ఉంచాలి. చేయు పనులందు లాభాన్ని ఆశిస్తారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

మీన రాశి: 20 ఫిబ్రవరి-20 మార్చి

మీన రాశి: 20 ఫిబ్రవరి-20 మార్చి

దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పిల్లల యెడల శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలిస్తాయి. దైవ దర్శన ప్రాప్తి కలదు. అనుకున్న పనులందు ఆటంకాలు కూడా ఉన్నాయి.

ఇప్పటి వరకూ ఈ నాటి దిన ఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు.

సర్వేజనా సుఖినోఃభవంతు

సమస్త సన్మంగళానిభవంతు

అందరికీ నా నమస్కారం.

Story first published: Saturday, December 30, 2017, 7:00 [IST]
Desktop Bottom Promotion