Latest Updates
-
రిలేషన్షిప్లో ఓసీడీ.. పదే పదే మీలో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయా.? -
మన గ్రామాల్లో మరచిపోయిన 6 పాత ఆచారాలు.. ఇవే ఒకప్పుడు కుటుంబాలను కాపాడిన సంప్రదాయాలు! -
కొందరు మగాళ్లకి ఆడవాళ్లంటే ఎందుకంత వ్యామోహం.. ఒక్కరితో ఎందుకు సరిపెట్టుకోరు.? -
చుక్క నూనె లేకుండా ప్రొటీన్ రిచ్ కర్రీ.. ఇలా చేస్తే ఉత్తి గ్రేవీనే తినేస్తారు.! -
ఇంట్లో పనులతో ఎక్సర్‌సైజ్‌కి టైం ఉండట్లేదా.. కిచెన్లోనే ఇలా కేలరీలు ఖర్చు చేయొచ్చు.! -
పుష్కలంగా ఫైబర్, ప్రొటీన్.. బరువు తగ్గేందుకు హెల్తీ అండు కొర్రల పాలక్ రైస్ -
బర్గర్‌ను నోరు బాగా తెరిచి తింటున్నారా.. ఈ ట్రిక్స్‌తో ఈజీగా తినేస్తారు.! -
థైరాయిడ్ సమస్యకి మందులు వాడుతున్నారా?.. వెంటనే ఈ ఫుడ్స్ మానేయండి -
2026 జూన్ 12: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. కెరీర్లో అద్భుతమైన మార్పులు ఖాయం! -
నేడు అరుదైన రాజయోగం.. ఈ రాశుల వారికి ఆర్థికంగా తిరుగులేదు, జాక్ పాట్ ఖాయం!
అలాంటి వారి ముఖంపై గాండ్రించి ఉమ్మించినా సిగ్గు రాదు, వాళ్లతో నీకెందుకు #mystory378
అందరూ అప్పుడు నా గురించి గొప్పగా మాట్లాడుకున్నారు. కాలేజీలో అందరూ అభినందించారు. కానీ ముందుంది ముసళ్ల పండుగ అనే విషయం నాకు తెలియదు. నిత్యం నరకంజాబ్ లో జాయినయ్యాక అక్కడ నాతో పాటు పని చేసే అమ్మాయిలతో
కొందరి ముఖంపై గాండ్రించి ఉమ్మించినా సిగ్గు రాదు. అలాంటి వాళ్లు ప్రతి ఒక్కరికి వారి జీవితంలో ఎదురవుతూనే ఉంటారు. వారిని అస్సలు పట్టించుకోకండి. వారి గురించి ఆలోచిస్తూ ఉంటే నీ జీవితం సగం అయిపోతుంది. మహా అంటే ఏ మనిషి అయినా ఇప్పుడున్న కాలంలో డెబ్బై ఏళ్లకు మించి బతకడు.
ఉన్న ఈ కొద్ది జీవితంలో కూడా సగం జీవితం నువ్వు లోకం గురించి తెలుసుకోవడానికి సరిపోతుంది. ఇక నీ లక్ష్యాలను సాధించేదెప్పుడు, నీ కలల్ని నెరవేర్చుకునేదెప్పుడు.

ఏదో ఒక రోజు చచ్చేవారే
ఎవడూ ఎక్కువ కాలం భూమి మీద ఉండడనే విషయం ఒక్కటి గుర్తు పెట్టుకో. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చచ్చేవారే. కానీ పిచ్చి కుక్కలకు ఈ విషయం తెలియక వాటి జీవితాన్ని మొరగడానికే కేటాయిస్తాయి. చివరకు దిక్కులేని చావు చస్తాయి.

ఒక్కదాన్నే కూతుర్ని
ఈ కథంతా ఎందుకు చెబుతున్నానంటే చాలా మంది నాలాగే జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. మా నాన్న నా చిన్నప్పుడు యాక్సిడెంట్ లో చనిపోయాడు. నేను ఒక్కదాన్నే కూతుర్ని. అమ్మ నన్ను
అష్టకష్టాలుపడి పెంచింది.

కాలేజీలో టాఫర్ గా
ప్రతి క్లాస్ లో నేనే ఫస్ట్ స్టూడెంట్ ని. టెన్త్ లో మండలంలో నేనే టాఫర్ని. ఎంసీఏ వరకు నేను చదివిన ప్రతి కాలేజీలో టాఫర్ గా నిలిచాను. తర్వాత క్యాంపస్ ప్లేస్ మెంట్ లో జాబ్ సాధించాను.

అందరూ అభినందించారు
అందరూ అప్పుడు నా గురించి గొప్పగా మాట్లాడుకున్నారు. కాలేజీలో అందరూ అభినందించారు. కానీ ముందుంది ముసళ్ల పండుగ అనే విషయం నాకు తెలియదు.

నిత్యం నరకం
జాబ్ లో జాయినయ్యాక అక్కడ నాతో పాటు పని చేసే వాళ్లతో నిత్యం నరకం అనుభవిస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడతారు. నోటికొచ్చినట్లు కూస్తారు.

ఏ రోజు కెలికింది లేదు
ఏ ఒక్కరినీ నేను ఏ రోజు కెలికింది కూడా లేదు. నా పని నేను చేసుకుంటూ ఉంటాను. నా జీవితం ఇప్పటికే చాలా పాఠాలు నేర్పింది. మళ్లీ ఇతరులను కెలుక్కుని కొత్తగా కష్టాలు తెచ్చుకోవాలని నాకు లేదు.

ఓర్వలేకే ఇలా
కానీ వారు మాత్రం సంస్థ కోసం నేనే చేసే పనిని రోజూ పేర్లు పెట్టేవారు. అతితక్కువ కాలంలో నాకొస్తున్న పేరును చూసి ఓర్వలేకే ఇలా చేసేవారు. వాళ్ల అమ్మలు సక్కగా ఒక్కడితోనే కాపురం చేసి వారిని కని ఉంటే ఇలా అవతలివారిని అన్యాయంగా వేధించరు.

పొట్టతిప్పల కోసం
ఒక పూట తిని ఒక పూట తినక, ఊరికిగానీ ఊరికొచ్చి పొట్టతిప్పల కోసం కష్టపడుతున్నా. వీళ్లకు ఏమీ తెలుస్తాయి నా కష్టాలు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతుంటారు.

పనిని నమ్ముకుని బతికేదాన్ని
నేను పనిని నమ్ముకుని బతికేదాన్ని. మీలాంటోళ్లు వందమంది వందరకాలుగా నన్ను ఇబ్బందులుపెట్టేందుకు ప్రయత్నించినా పీకేదేమీ లేదు. నా జీవితంలోనే కాదు మీ జీవితంలో కూడా ఇలాంటి వారు ఎదురయ్యే ఉంటారు.

ముఖంపై గాండ్రించి
అది మీరు పని చేసే చోట అయినా కావొచ్చు, మీరు ఉండేచోట అయినా కావొచ్చు ఇంకెక్కడయినా కావొచ్చు అలాంటి వాళ్లని మీరు ముఖంపై గాండ్రించి ఉమ్మించిన వాళ్లకు సిగ్గురాదు. మీ విషయంలో ఎవరెన్ని పుల్లలు పెట్టినా మీ పై వాళ్లతో బాగుండండి.

మీకు మంచి పేరు ఉంటే
మీ పై వాళ్లు ఒక మాట అంటే పడండి. వాళ్ల దగ్గర మీకు మంచి పేరు ఉంటే నిన్ను ఇలాంటి చేతకానీ కుక్కలు ఏమీ చేయలేవని గుర్తు పెట్టుకో. మీ పై స్థాయి వారికి మాత్రమే గౌరవం ఇవ్వండి. పనికిమాలిన వాళ్లంతా నీకు అవసరం లేదు. ఎవ్వరినీ పట్టించుకోకు.. నీ జీవితాన్ని నువ్వు బాగా ప్రేమించు చాలు.



Click it and Unblock the Notifications