For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్క ఫేస్ బుక్ పోస్ట్ గంగమ్మను గాయని జానకిలా మార్చింది, ఆమె జీవితం ఆదర్శం, ఇప్పుడామె సెలబ్రిటీ

గంగమ్మక కర్ణాటకలో జూనియర్ ఎస్. జానకి గా పేరుగాంచింది. జూనియర్ జానకి అంటే గుర్తు పట్టని వారు ఎవరూ ఉండరు. అంతగా పాప్ లర్ అయిపోయింది. గాయని జానకి గురించి మనకు తెలిసిందే.

|
ఒక్క ఫేస్ బుక్ పోస్ట్ గంగమ్మను గాయని జానకిలా మార్చింది | Boldsky

మనం ఎన్నో మనస్సును కదిలించే కథనాలు చదివి ఉంటాం. వారి బాధలు, గాథలు చూసి మనం కూడా కన్నీరు కారుస్తుంటాం. కొందరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ప్రతిభనే శ్వాసగా బతికి విజయం సాధించిన వారూ ఉంటారు. అలాంటి వారు అందరికీ ఆదర్శం. అలాంటి కథనే ఈమె జీవితం. ఈమె పేరు గంగమ్మ. ఒక్క వీడియో ఈమె జీవితాన్ని మార్చింది. పాటనే నమ్ముకుని... పాటనే ప్రాణంగా భావిస్తున్న ఈమె నేటి యువతకు ప్రేరణ.

ఈతరానికి స్ఫూర్తిదాయకం

ఈతరానికి స్ఫూర్తిదాయకం

ఫేస్ బుక్ ఇప్పుడు మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రతిభను కూడా ప్రపంచానికి పరిచయం చేస్తోంది. అలాగే గంగమ్మకూడా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆమె పాడిన ఒక పాటను ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తే 6 గంటల్లో 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అందుకే ఈమె ఈతరానికి స్ఫూర్తిదాయకం. గంగమ్మ జీవితంలో పడ్డ కష్టాలు, ఆమె కుటుంబ పరిస్థితి, ఎలా తన లైఫ్ టర్న్ అయ్యింది, ప్రస్తుతం ఆమె చేతిలో ఆఫర్స్ ఇలా అన్నీ బోల్డ్ స్కై కి ప్రత్యేకంగా వివరించింది.

మారుమూల గ్రామం

మారుమూల గ్రామం

గంగమ్మది కర్ణాటకలో ఒక మారుమూల గ్రామం. ఆ ఊరి పేరు కొప్పల్. ఆమెది ఒక సన్నకారు రైతు కుటుంబం. తల్లిదండ్రులు ఉన్న కొద్ది భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రమే. అందుకే ఆమె ఐదో తరగతి దాకే చదివింది.

బాల్యం అంతా కష్టాల కడలిలో

బాల్యం అంతా కష్టాల కడలిలో

గంగమ్మకు మొత్తం 9 మంది తోబుట్టువులు. ఆమె బాల్యం అంతా కష్టాల కడలిలో సాగింది. అందుకే ఆమె చదువు ఆపేయాల్సి వచ్చింది. కానీ చిన్నతనం నుంచే గంగమ్మకు పాటలంటే ప్రాణం. పాటే శ్వాసగా ధ్యాసగా బతికింది గంగమ్మ.

కన్నడతో పాటు హిందీ, తెలుగు పాటలు ఆమె కమ్మని గొంతుతో పాడుతుంటే మైమరిచిపోయి వింటాం. హిందీ, తెలుగు పాటలు మొత్తం కూడా కన్నడ భాషలో రాసుకుంటూ పాడుతూ ఉంటుంది గంగమ్మ.

పాటనే ఆ కుంటుబానికి అండ

పాటనే ఆ కుంటుబానికి అండ

గంగమ్మ నాన్న చనిపోయిన తర్వాత తన ఇద్దరు తోబుట్టులు కూడా మరణించారు. ఆ సమయంలో గంగమ్మ కుటుంబ చాలా కష్టాలు ఎదుర్కొంది. కానీ గంగమ్మ పాటనే ఆ కుంటుబానికి అండ అయ్యింది. పూట గడవడానికి ఆమె పాటే ఆధారమైంది. చిన్నతనం నుంచే గంగమ్మకు పాటలపై ఇష్టం పెంచుకుంది. కానీ ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల ఆమె తల్లి మనకెందు ఆ పాటలుగీటలు అంటూ మందలించింది.

ఆర్కెస్ట్రాలలో పాడేది

ఆర్కెస్ట్రాలలో పాడేది

పాటలు అనుకుంటూ తన కూతురు బెంగుళూరులాంటి నగరాలకు వెళ్తే అక్కడ తనకు ఏమవుతుందోనని గంగమ్మ తల్లి భయం. ఆ ప్రేమతోనే కూతురికి ఇష్టమైన అభిరుచిని వదులుకోమంది. కానీ గంగమ్మ మాత్రం తల్లికి తెలియకుండానే ఆర్కెస్ట్రాలలో పాడేది. దీంతో ఆమె గొంతు బయటి ప్రపంచానికి తెలిసింది. గంగమ్మ పాట విన్న వాళ్లంతా మళ్లీ మళ్లీ ఆ పాట వినాలని ఆశించేవారు.

గంగమ్మ కూలీ పనులు చేస్తూనే మరోవైపు ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా పాటలు పాడేది. ఈ క్రమంలో ఆమెకు శివప్రసాద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని ద్వారా గంగమ్మ ప్రతిభ ప్రపంచానికి తెలిసింది.

6 గంటల్లో 5 లక్షల మంది వీక్షించారు

6 గంటల్లో 5 లక్షల మంది వీక్షించారు

శివప్రసాద్ గంగమ్మ పాట వినగానే ఈమె ఇక్కడ ఉండాల్సింది కాదు అనుకున్నాడు. ఒకసారి గంగమ్మతో పాట పాడించి ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు. అంతే క్షణాల్లో లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. 6 గంటల్లో 5 లక్షల మంది ఆ వీడియోను చూశారు. వేలాది మంది కామెంట్స్ చేశారు. వందలాది మంది షేర్ చేశారు. శివప్రసాద్ ఆమెతో ఫేస్ బుక్ లో లైవ్ లో పాడించడం మొదలుపెట్టించాడు. దీంతో ఆమె క్రేజీ మరింత పెరిగింది.

జూనియర్ ఎస్. జానకి గా పేరు

జూనియర్ ఎస్. జానకి గా పేరు

ఇప్పుడు గంగమ్మక కర్ణాటకలో జూనియర్ ఎస్. జానకి గా పేరుగాంచింది. జూనియర్ జానకి అంటే గుర్తు పట్టని వారు ఎవరూ ఉండరు. అంతగా పాప్ లర్ అయిపోయింది. గాయని జానకి గురించి మనకు తెలిసిందే. దక్షిణ భారతదేశంలోనే ఆమె ఫేమస్ సింగర్. అంతేకాదు జానకి 17 భాషలలో 48,000 పాటలను పాడి రికార్డ్ క్రియేట్ చేశారు. జపనీస్, జర్మనీ వంటి భాషల్లోనూ జానకి పాడారు. 1957 నుంచి ఇప్పటికీ జానకి పాడుతున్నారు.

నిజమైన జానకివి నువ్వేనమ్మా

నిజమైన జానకివి నువ్వేనమ్మా

అంత పాపులారిటీ ఉన్న జానకి గంగమ్మను ఏమందో తెలుసా.. ఒకసారి జానకి గంగమ్మ పాట విన్నారు. " జానకిని నేను కాదమ్మా.. నిజమైన జానకివి నువ్వేనమ్మా" అని ఆ జానకి ఈ జూనియర్ జానకికి కితాబిచ్చారు. జానకి అంటే గంగమ్మకు కూడా చిన్నప్పటి నుంచి ప్రేరణ. ఎప్పటికైనా ఆమెకు అంతకాకున్నా తను కూడా జానకిలా పేరు తెచ్చుకోవాలని కలలు కనేది గంగమ్మ. ఆ కల నిజం చేసుకుంది.

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు

ప్రస్తుతం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి గంగమ్మకు పాడేందుకు ఆఫర్లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో గంగమ్మ పాడిన పాటల వీడియోలు వైరల్ అయినప్పటి నుంచి ఆమె పేరు మారిమోగిపోతుంది. ఎన్నో అవార్డులు రివార్డులు గంగమ్మకు దక్కాయి.

20 ఏళ్ల ప్రతిభ ఒక్క ఫేస్ బుక్ పోస్ట్ తో వెలుగులోకి

గంగమ్మ 20 ఏళ్లుగా తన ప్రతిభను చాటుకునేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. కానీ ఫేస్ బుక్ లో ఆమె పోస్ట్ చేసిన 15 రోజుల్లోనే ఆమె లైఫ్ మారిపోయింది. ఇప్పుడు ఆమె ఒక సెలబ్రిటీ. కొప్పల్ నుంచి ఇప్పుడు ఆమె బెంగుళూరు వచ్చింది. రోజూ పాటలు పాడడంతో పాటు బిజీ షెడ్యూల్ తో ఆమె బిజీబిజీగా ఉంటుంది. ప్రతిభ ఉండి గంగమ్మలా ఇబ్బందులుపడేవారు చాలా మందే ఉంటారు. కానీ ఆ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తే మీ వెంటే ప్రపంచం పడుతుంది.

English summary

Real-life Story: junior janaki gangamma luck changed with a single facebook post

Real-life Story: junior janaki gangamma luck changed with a single facebook post
Desktop Bottom Promotion