Latest Updates
-
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.!
Baby Aya, Syria Earthquake: భూకంప శిథిలాల్లో శిశువుకు జననం, ఆ పాప ఓ 'అద్భుతం'
భూప్రళయంలో తల్లిదండ్రులు, తోబుట్టువులు ప్రాణాలు కోల్పోగా, చనిపోతున్న ఆఖరి క్షణంలో ఆ తల్లి తన శిశువుకు బిడ్డనిచ్చింది. అలా కొత్త ఊపిరి పోసుకుంది అయా అనే శిశువు.
ఈతరంలో కనీవినీ ఎరుగని ఘోర ప్రకృతి విపత్తు టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం. ఈ ఘోర ప్రకృతి విలయంలో ఇప్పటి వరకు 21 వేల మందికి పైగా మరణించారు. టర్కీ, సిరియాల్లోని నివాస ప్రాంతాలు శవాల దిబ్బలుగా మారాయి. ఎటు చూసిన కన్నీటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. మనసుల్ని కకావికలం చేసే ఘటనలు వెలుగుచూస్తున్నాయి. భూకంప తీవ్రతతో కుప్పకూలిన ఓ భవనం శిథిలాల కింద ఓ తల్లి శిశువుకు జన్మనిచ్చింది.

భూప్రళయంలో తల్లిదండ్రులు, తోబుట్టువులు ప్రాణాలు కోల్పోగా, చనిపోతున్న ఆఖరి క్షణంలో ఆ తల్లి తన శిశువుకు బిడ్డనిచ్చింది. అలా కొత్త ఊపిరి పోసుకుంది అయా అనే శిశువు.
టర్కీ, సిరియాల్లో సోమవారం తెల్లవారుజామున వచ్చిన భూకంపంలో సిరియాలోని జిండిరెస్ ప్రాంతంలో ఓ నిండు గర్భిణి తన కుటుంబంతో శిథిలాల కింద చిక్కుకుపోయింది. శిథిలాలు మీద పడటంతో కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోగా ఆ గర్భిణి కూడా చావు అంచుల్లో నిలబడింది. అప్పుడే ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. చావు అంచుల్లో ప్రసవ వేదన భరిస్తూ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది.
సహాయక చర్యల్లో భాగంగా రెస్క్యూ సిబ్బంది భవన శిథిలాలను తొలగిస్తున్న సమయంలో వారికి చిన్నారి ఏడుపు వినిపించింది. ఆ ఏడువు వస్తున్న చోటుకు హుటాహుటినా వెళ్లిన సిబ్బంది నెమ్మదిగా ఒక్క శిథిలాన్ని తొలగించారు. కింద ఉన్న ఆ చిన్నారికి ఆ గాయం కాకుండా భవన వ్యర్థాలను నెమ్మదిగా తొలగించి ఆ పసికందును సురక్షితంగా బయటకు తీశారు.
ఒంటి నిండి రక్తంతో, బొడ్డు తాడు వేలాడుతూ, గాయాలతో, శ్వాస కూడా తీసుకోలేని స్థితిలో ఆ పసికందును ఆస్పత్రికి తరలించారు. అయితే ఇప్పుడు ఆ పసికందు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. వైద్యులే ఆ శిశువుకు అయా అనే పేరు పెట్టారు. అయా అంటే అద్భుతం అని అర్థం. శిథిలాల కింద జన్మనివ్వడం తల్లి చనిపోయాక ఆ శిశువు బతికిబట్టకట్టడం నిజంగా ఓ అద్భుతమనే చెప్పాలి. అందుకే వారు ఆ శిశువుకు అయా అనే పేరు పెట్టారు.
ఈ విషయం, పాప ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆ చిన్నారిని దత్తత తీసుకుంటామని వేలాది మంది ముందుకొచ్చారు. కానీ బంధువులే ఆ పసికందు బాధ్యత తీసుకున్నారు. చికిత్స అందిస్తోన్న ఓ వైద్యుడి భార్యే ఆ శిశువుకు పాలు పట్టి మానవత్వాన్ని చాటుకుంది.



Click it and Unblock the Notifications