Latest Updates
-
కోడిగుడ్లతో రొటీన్ కూరలు బోర్.. ఈ 'ఎగ్ బటర్ మసాలా' తప్పక ట్రై చేయండి! -
చంద్ర, కేతు సంయోగంతో సింహ రాశిలో గ్రహణం.. చిక్కుల్లో పడబోయే రాశులు ఇవే.! -
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే! -
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.! -
దానిమ్మ తింటే నిజంగానే టెస్టోస్టెరాన్ పెరుగుతుందా.. పురుషులు తెలుసుకోవాల్సిన లాజిక్ ఇదే.! -
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'! -
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.!
హైదరాబాద్‌లోని ఈ 5 ప్లేసుల్లో గరం గరం ఛాయ్ తాగితీరాల్సిందే..
హైదరాబాద్‌లో ఇరానీ ఛాయ్ చాలా ప్రాంతాల్లో దొరుకుతుంది. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అది అమృతంలా ఉంటుంది. ఆ ప్లేసులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టీ, ఛాయ్ ఈ పేరు వింటేనే చాలా మందికి ఉత్సాహం వచ్చేస్తుంది. ఇరానీ ఛాయ్ పేరు వింటే చాలు నోట్లు నీళ్లూరుతాయి. ఇరానీ ఛాయ్‌కు హైదరాబాద్ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువగా తాగే పానీయాల్లో ఛాయ్‌ది మూడో స్థానం. మొదటి స్థానంలో నీళ్లు, రెండో స్థానంలో కాఫీ ఉంటాయి. హైదరాబాద్ అనగానే మొదట గుర్తుకు వచ్చేది బిర్యానీ అయితే తర్వాత గుర్తుకువచ్చేది ఇరానీ ఛాయ్ విత్ ఉస్మానియా బిస్కట్.

(image: kadakhouse)
హైదరాబాద్‌లో ఇరానీ ఛాయ్ చాలా ప్రాంతాల్లో దొరుకుతుంది. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అది అమృతంలా ఉంటుంది. ఆ ప్లేసులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కేఫ్ నీలోఫర్
కేఫ్ నీలోఫర్‌లో ఛాయ్ చాలా అద్భుతంగా ఉంటుంది. హైదరాబాద్‌లో చాలా ఫేమస్ ఛాయ్ ఏంటి అని ఎవరిని అడిగినా మొదట చెప్పే పేరు కేఫ్ నీలోఫర్. 1978లో స్థాపించబడిన కేఫ్ నీలోఫర్ అప్పటి నుండి అదే అద్భుతమైన టేస్ట్‌ను అందిస్తూ వస్తోంది.
హైదరాబాద్‌లో కేఫ్ నీలోఫర్ బ్రాంచులు ౪ వరకు ఉంటాయి. హిమాయత్ నగర్, బంజారా హిల్స్, రెడ్ హిల్స్, లక్డీకపూల్ ప్రాంతాల్లో కేఫ్ నీలోఫర్ ఔట్‌లెట్లు ఉంటాయి.
నీలోఫర్ ఆస్పత్రికి సమీపంలో ఈ కేఫ్ ఉంటుంది. దాని పేరు నుండే నీలోఫర్ కేఫ్ అనే పేరు వచ్చింది.
ఇక్కడ షాందార్ ఛాయ్‌తో పాటు బన్ మస్కా, మలై బన్, కూకీస్, పఫ్స్, చస్కా ఇక్కడ చాలా ఫేమస్.

2. థైబా/టైబా హోటల్
మసాబ్ ట్యాంక్‌లో ఉండే థైబా హోటల్ ఇరానీ ఛాయ్‌కు చాలా ఫేమస్. బయోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ రోడ్డులో శాంతినగర్ కాలనీలో ఉంటుంది.
ఇరానీ ఛాయ్‌తో పాటు రెండు ఉస్మానియా బిస్కెట్లు తినడం మాత్రం మర్చిపోవద్దు. టైబా హోటల్‌లో కేవలం ఛాయే కాకుండా స్నాక్స్ కూడా బాగుంటాయి.
3. నిమ్రా కేఫ్
ఛార్మినార్‌కు అతి సమీపంలో మంచి రుచి గల ఇరానీ ఛాయ్ కావాలంటే నిమ్రా కేఫ్‌కు వెళ్లాల్సిందే. గరం గరం ఛాయ్‌లో ఉస్మానియా బిస్కెట్ తింటూ ఛాయ్‌లోని మాధుర్యాన్ని ఛార్మినార్ అందాన్ని ఒకేసారి ఆస్వాదించొచ్చు.
ఇక్కడి వెళ్లినప్పుడు గరం గరం ఛాయ్‌తో పాటు వేడివేడి ఉస్మానియా బిస్కెట్ తినడం అస్సలే మర్చిపోవద్దు.

4. బ్లూ సీ హోటల్
బ్లూ సీ హోటల్ గురించి ఛాయ్ ప్రియులకు తెలిసే ఉంటుంది. హైదరాబాద్‌లో చాలా ఫేమస్ ఇరానీ ఛాయ్ ఇక్కడ దొరుకుతుంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి నడవగలిగే దూరంలోనే ఉంటుంది ఈ బ్లూ సీ హోటల్. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో కనిపిస్తుంది.
బ్లూ సీ టీ అండ్ స్నాక్స్ సికింద్రాబాద్ అని మ్యాప్‌లో సులభంగానే వెతకొచ్చు.

5. ఆల్ఫా హోటల్
ఛాయ్ ప్రియులకు ఆల్ఫా హోటల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హోటల్ 1957లో స్థాపించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడ ఇరానీ ఛాయ్‌్లోని మాధుర్యం ఏమాత్రం తగ్గలేదు.
హైదరాబాద్‌లో ఉండే వాళ్లు తప్పనిసరిగా కనీసం ఒక్కసారి అయినా ఇక్కడికి వెళ్లి ఛాయ్ తాగాల్సిందే. ఛాయ్‌తో పాటు రెండు ఉస్మానియా బిస్కెట్లు తింటే మజాగా ఉంటుంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మెయిన్ గేట్‌కు సమీపంలోనే ఉంటుంది ఈ ఆల్ఫా హోటల్. గేట్‌కు అభిముఖంగా నిల్చుంటే కుడి చేతి వైపు కనిపిస్తుంది. మీరెప్పుడైనా సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చినా, లేదా టీ తాగాలనిపించినా ఆల్ఫా హోటల్‌లో ఒక్కసారి టీ తాగండి.



Click it and Unblock the Notifications
