Latest Updates
-
వంశాభివృద్ధికి, పితృదేవతల ఆశీస్సులకు మహాలయ అమావాస్య.. తర్పణం, శుభ సమయం వివరాలివే.! -
రోజూ 10 నిమిషాలు సూర్యాస్తమయాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా? -
నాటు శైలిలో ఘాటుగా 'రొయ్య పొట్టు చారు'.. పల్లెటూరి రుచుల మజానే వేరు.! -
ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టపడ్డారు..పెళ్లి చేసుకున్నారు..7 నెలలకే స్కూల్ టైతో భర్త గొంతు నులిమి.. -
మెంతులు ఆరోగ్యానికి మంచిదే కాదు... ఈ వ్యాధులు ఉన్నవారికి ముప్పూ తేవచ్చు! -
నానమ్మల కాలం నాటి నల్చిన కారం..చికెన్, మటన్ కూడా పోటికి రావు..రోలు, మిక్సీ కూడా అక్కర్లేదు చేత్తోనే.. -
బాబా వంగా అంచనా..అక్టోబర్ 5వ తేదీ నుంచి ఆ 5 రాశుల వారికి రాజయోగం పక్కా! -
తిండి ఆలస్యమైందని దండన.. జొమాటో డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వైరల్ వీడియో.! -
ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఉలవల కారం పొడి..ఒక్కసారి చేస్తే నెల రోజులు నిల్వ..ఇడ్లీ, వేడి అన్నంలోకి బెస్ట్ -
కోడిగుడ్లతో రొటీన్ కూరలు బోర్.. ఈ 'ఎగ్ బటర్ మసాలా' తప్పక ట్రై చేయండి!
న్యూ ఇయర్ పార్టీ ఈ ప్లేసెస్‌లో చేసుకుంటే ఆ కిక్కే వేరు.. బ్యాచిలర్ పార్టీలకీ సూపర్ డెస్టినేషన్స్
టెర్రస్ పైన, ఫ్రెండ్ ఇంట్లో కేక్ కోసి న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పే రోజులు పోయాయి. ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చిందంటే ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లి ఎంజాయ్ చేయాలని కోరుకుంటోంది యువత.
కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. డిసెంబర్ 31 రాత్రి కొత్త సంవత్సరానికి వెల్‌కం చెప్పేందుకు అంతా సిద్ధమైపోయారు. టెర్రస్ పైన, ఫ్రెండ్ ఇంట్లో కేక్ కోసి న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పే రోజులు పోయాయి. ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చిందంటే ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లి ఎంజాయ్ చేయాలని కోరుకుంటోంది యువత. దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి పార్టీలు చేసుకుంటున్నారు. మీరు కొత్త సంవత్సరాన్ని ఎక్కడ, ఎలా జరుపుకోవాలో అనే సందిగ్ధంలో ఉన్నారా.. అయితే ఇది చదవండి.

ఇక్కడ ఉన్న ప్రాంతాలు బ్యాచిలర్ పార్టీలకు కూడా మస్త్ ఫేమస్. ఎక్కడికైనా దూరంగా వెళ్లి తెగ ఎంజాయ్ చేయాలనుకునే వారు తప్పకుండా వీటి గురించి తెలుసుకోండి.

1. గోవా
కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి, బ్యాచిలర్ పార్టీకి గోవా చాలా అనువైన ప్రదేశం. తాగాలన్నా, తూగాలన్నా ఈ ప్లేసుకు మించింది మరొకటి ఉండదు. బీచ్ లు, బీరులు, కాసినోలు, నైట్ క్లబ్ లు ఇలా ఒక్కటేమిటి చాలానే ఉన్నాయి. మీ దోస్తానాతో ఫుల్లుగా ఎంజాయ్ చేయాలన్నా, హాంగౌట్ చేయాలన్నా దీన్ని మించింది ఇంకొకటి లేదనే చెప్పవచ్చు. వారాంతాల్లో కూడా మీరు ఇక్కడికి వెళ్లి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు.

2. కసోల్
ప్రకృతిని ఆస్వాదించాలంటే మీరు కచ్చితంగా హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న కసోల్ కు వెళ్లాల్సింది. ఇది పార్వతి లోయలో పార్వతీ నది ఒడ్డున ఉన్న అందమైన పట్టణం. ఇక్కడ అందాలను చూస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంత ఒత్తిడినైనా చిటికెలో తొలగించుకోవచ్చు. ఇలాంటి చోటుకు స్నేహితులతో కిలిసి ఎంజాయ్ చేయడం అంటే స్వర్గలోకానికి వెళ్లినట్లే. ఇక్కడ అధిక శాతం ఇజ్రాయెల్ పర్టాయకులు ఉండటం వల్ల దీన్ని ఇజ్రాయల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.

3. రిషికేష్
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఈ రిషికేష్ లో విపరీతమైన వాటర్ గేమ్స్ ను మీరు ఎంజాయ్ చేయవచ్చు. థ్రిల్లింగ్ వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. రాత్రి నదీ ఒడ్డున కూర్చొని రిలాక్స్ అవ్వొచ్చు. ట్రెక్కింగ్, రివర్ రాఫ్టింగ్, పగటిపూట బంగీ జంపింగ్, రాత్రి అద్భుతమైన క్యాంప్ ఫైర్ తో నైట్ అవుట్ చెయ్యొచ్చు. నది ఒడ్డున, ఇసుక తిన్నెల్లో.. వెన్నల వెలుగులో ఎంజాయ్ చేయడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.

4. జిరో వ్యాలీ
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ జీరో వ్యాలీలో న్యూ ఇయర్ పార్టీ చేసుకుంటే జీవింతాంతం మర్చిపోలేరు. మళ్లీ మళ్లీ అక్కడకు వెళ్లాలనిపిస్తుంటుంది. నీలి రంగులో ఉన్న ఆకాశం, పక్కనే ఉన్న కొండలు, పర్వతాలు, ప్రకృతి రమణీయత మిమ్మల్ని కట్టిపడేస్తుంది. పచ్చ గడ్డిమీద కూర్చొని ఇష్టమైనవి తింటూ.. హాయిగా ఓ బీరు వేసుకుంటూ ఫుల్లుగా చిల్లవ్వచ్చు. అంతేకాదండోయ్ ఇక్కడ జరిగే మ్యూజిక్ ఫెస్టివల్ మరింత ప్రత్యేకం. చెవికి ఇంపైన మ్యూజిక్ వింటూ ప్రకృతిలో గడిపితే వచ్చే కిక్కే వేరప్పు. మీరూ ఓసారి వెళ్లి రండి మరి.

5. పుదుచ్చేరి
పుదుచ్చేరినే పాండిచ్చేరి అని కూడా పిలుస్తారు. అయితే ఇక్కడ అద్భుతమైన సాంస్కృతిక సమ్మేళనంతో పాటు బీచ్ లు కూడా ఉన్నాయి. సముద్రపు ఆహారాన్ని ఇష్టపడే ఆహార ప్రియులు ఇక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఎక్కువగా పురాతన కాలం నాటి కట్టడాలను మీరు చూడొచ్చు. బ్యాచిలర్ పార్టీ చేసుకోవడానికి ఇది అనువైన ప్రదేశం.

6. బాంధవ్ గఢ్ నేషనల్ పార్కు
బాంధవ్ గఢ్ నేషనల్ పార్కు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉమారియా అనే ప్రాంతంలో ఉంది. ఈ పార్కులో ఎక్కువగా పులులు ఉన్నాయి. పులుల సంరక్షణకు ఈ ఉద్యాన వనం పేరుగాంచింది. ఇందులో 37 జాతుల క్షీరదాలు, 250 కి పైగా రకరకాల జాతుల పక్షులు, 80 రకాలకు పైగా సీతాకోక చిలుకలు, సరీసృపాలు ఉన్నాయి. వర్షాకాలంలో వివిధ జాతులకు చెందిన పలు పక్షులు ఈ ఉద్యానవనాన్నికి వలసకి వస్తాయి. అయితే ఈ పార్కులో ట్రీ హౌస్ ను అద్దెకు తీసుకోవచ్చు. అక్కడ మీ స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకున్నారంటే లైఫ్ లాంగ్ మార్చిపోలేరు.



Click it and Unblock the Notifications
