Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
Bill Gates: లేటు వయస్సులో మళ్లీ ప్రేమలో పడ్డ బిల్ గేట్స్, సీఈవో భార్యతో డేటింగ్
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు, గేట్స్ ఫౌండేషన్ తో ప్రపంచ దేశాలకు సాయం అందిస్తున్న వ్యక్తి బిల్ గేట్స్ మరోసారి ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. ఒరాకిల్ దివంగత సీఈవో భార్య పాలా హర్డ్ తో బిల్ గేట్స్ డేటింగ్ చేస్త
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు, గేట్స్ ఫౌండేషన్ తో ప్రపంచ దేశాలకు సాయం అందిస్తున్న వ్యక్తి బిల్ గేట్స్ మరోసారి ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం మిలిందా తో బిల్ గేట్స్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుండి కొంత కాలం వరకు ఒంటరిగా ఉన్న ఆయన.. గత ఏడాది నుండి ఓ మహిళతో చెట్టా పట్టాల్ వేసుకుని తిరుగుతున్నాడని, పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడని వార్తలు వస్తున్నాయి.

ఒరాకిల్ దివంగత సీఈవో భార్య పాలా హర్డ్ తో బిల్ గేట్స్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బిల్ గేట్స్ - పౌలా హర్డ్ రొమాంటిక్ రిలేషన్‌షిప్ లో ఉన్నారని, వారిది విడదీయలేని బంధం అని వారిద్దరికీ అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తి చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది.
ఒరాకిల్ సీఈవో మార్క్ హర్డ్ క్యాన్సర్ తో పోరాడుతూ 2019 లో ప్రాణాలు విడిచారు. ఆయన భార్య పౌలా హర్డ్ టెక్ ఎగ్జిక్యూటివ్ గా పని చేశారు. ఆమెకు ఇ్దదరు కుమార్తెలు. ప్రస్తుతం పౌలా హర్డ్ ఈవెంట్ ప్లానర్ గా పని చేస్తున్నట్లు సమాచారం. ఈమె కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో చాలా చురుగ్గా ఉంటారట. బిల్ గేట్స్, తన గేట్స్ ఫౌండేషన్ తో చాలా దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్నారు. వివిధ దేశాలకు ఆయన సాయం అందిస్తున్నారు. అలా వీరిద్దరి మధ్య బంధానికి బీజం పడిందని అంటున్నారు. ప్రస్తుతం బిల్ గేట్స్ వయస్సు 67 సంవత్సరాలు, పౌలా హర్డ్ వయస్సు 60 సంవత్సరాలు. ఆరు పదుల వయస్సులో ఈ జంట ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొని కెమెరాకు చిక్కారు. అలా వారిపై డేటింగ్ ఊహాగాలను బలం చేకూరింది.
ఓ సంవత్సరం నుండి బిల్ గేట్స్ - పౌలా హర్డ్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల మెల్ బోర్న్ లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్ ఫైనల్ లో ఈ ప్రేమ జంట పక్కపక్కనే కూర్చొని ఆటను వీక్షించారు.
వీరిద్దరు సన్నిహితంగా మెలుగుతున్నట్లు వస్తున్న వార్తలపై వారి సన్నిహితులు స్పందిస్తూ వారిద్దరిది విడదీయరాని బంధమని పేర్కొన్నారు.
బిల్ గేట్స్, మిలిందా దంపతులు 2021లో విడాకులు తీసుకున్నారు. 1987లో మైక్రోసాఫ్ట్ లో బిల్ గేట్స్ - మిలిందా పరిచయం వారి పెళ్లికి దారి తీసింది. అా 1994లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాదాపు 3 దశాబ్దాల వివాహ బంధానికి 2021లో ముగింపు పలికారు. వీరికి ముగ్గురు పిల్లలు. ట్యాక్స్ ఎగ్గొట్టడానికి వీరిద్దరూ విడాకులు నాటకం ఆడుతున్నారని రూమర్స్ వినిపించాయి. అయితే డైవర్స్ తీసుకున్న తర్వాత మిలిందా మాజీ టీవీ రిపోర్టర్ జాన్ డ్యూ ప్రీతో డేటింగ్ చేస్తున్నట్లు కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. కొన్ని నెలలుగా మిలిందా - జాన్ రిలేషన్‌షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది.



Click it and Unblock the Notifications