Latest Updates
-
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.!
Dmitry Medvedev: అమెరికాలో అంతర్యుద్ధం, ఎలాన్ మస్క్ తదుపరి అధ్యక్షుడు.. దిమిత్రి మెద్వ్‌దేవ్ 2023 అంచనాలు
రష్యా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం రష్యా భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వ్‌దేవ్ కూడా అంతర్జాతీయ పరిణామాలపై తనదైన శైలిలో కొన్ని 2023 గురించి కొన్ని అంచనాలు మన ముందుంచారు.
కొన్ని రోజుల్లో 2023 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. 2022 సంవత్సరం దాదాపు పూర్తయింది. 2023లో ఎలా ఉండబోతుంది జ్యోతిష్యులు చెబుతూ వస్తున్నారు. రష్యా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం రష్యా భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వ్‌దేవ్ కూడా అంతర్జాతీయ పరిణామాలపై తనదైన శైలిలో కొన్ని 2023 గురించి కొన్ని అంచనాలు మన ముందుంచారు.

కొత్త సంవత్సరం వేళ అందరూ భవిష్యత్తుకు సంబంధించిన అంచనాలు చెబుతుంటారు.. మా తరఫున ఇవే 2023 అంచనాలు అంటూ ట్విట్టర్ లో పోస్టు పెట్టారు.
1. ఇంధన ధర బ్యారెల్‌కు 150 డాలర్లకు పెరుగుతుంది. గ్యాస్ ధర వెయ్యి క్యూబిక్ మీటర్లకు 5 వేల డాలర్లకు చేరుకుంటుంది.
2. బ్రిటన్ మళ్లీ యూరోపియన్ యూనియన్‌లోకి వచ్చేస్తుంది. తర్వాత ఈయూ కూలిపోతుంది. వారికి యూరో కరెన్సీగా మారుతుంది.
3. పోలాండ్, హంగేరీలు గతంలో ఉన్న ఉక్రెయిన్ వెస్ట్ ప్రాంతాలను ఆక్రమిస్తాయి. జర్మనీ భూభాగం, పోలాండ్, బాల్టిక్ రాష్ట్రాలు, చెక్ రిపబ్లిక్, స్లొవేకియా, ఇతర ప్రాంతాలతో కలిపి నాల్గొవ జర్మనీ(ఫోర్త్ రీచ్) ఏర్పడుతుందని దిమిత్రి మెద్వ్‌దేవ్ అంచనా వేశారు.
4. తరవాత ఫ్రాన్స్‌కు, పోర్త్ రీచ్‌కు మధ్య యుద్ధం జరుగుతుంది. దీని వల్ల ఐరోపా విభజించబడుతుంది. ఈ క్రమంలోనే పోలాండ్ విభజించబడుతుంది.
5. నార్త్ ఐర్లాండ్ బ్రిటన్ నుండి విడిపోతుంది. తర్వాత అది రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌లో చేరుతుంది.
6. అమెరికాలో అంతర్యుద్ధం మొదలవుతుంది. టెక్సాస్, కాలిఫోర్నియాలు స్వతంత్ర ప్రాంతాలుగా ఆవిర్భవిస్తాయి. మెక్సికో, టెక్సాస్ ప్రాంతాలు మిత్రరాజ్యంగా ఏర్పడతాయి.
7. అంతర్యుద్ధం ముగిసిన తర్వాత జరిగే ఎన్నికల్లో ఎలాన్ మస్క్ చాలా రాష్ట్రాల్లో విజయం సాధించి ప్రెసిడెంట్ అవుతారు.
8. స్టాక్ మార్కెట్లు అమెరికాను, ఐరోపాను వీడి ఆసియా దేశాలకు వెళ్తాయి.
9. బ్రెట్జన్ వుడ్స్ మానిటరీ మేనేజ్‌మెంట్ వ్యవస్థ కుప్పకూలిపోతుంది.
10. ప్రపంచ బ్యాంక్ కూడా పతనం అవుతుంది. యూరో, డాలర్ల చలామణి పూర్తిగా తగ్గిపోతుంది.



Click it and Unblock the Notifications
