Latest Updates
-
కరకరలాడే బెండకాయ భుజియా.. జిగురు లేకుండా ఈ స్నాక్ చేస్తే పిల్లలు కూడా వదిలిపెట్టరు! -
షుగర్ కంట్రోల్ కావాలంటే డైలీ ఎంత సేపు నడవాలి.. భోజనం తర్వాత ఇలా చేయాల్సిందే.! -
ఒకే ప్లేట్లో ఉగాది షడ్రుచులు.. గుమ్మడికాయ ఉల్లి కారం టేస్ట్‌కి లొట్టలేయాల్సిందే.! -
హ్యాపీ గాంధీ జయంతి 2026.. మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ శుభాకాంక్షలు, కోట్స్, వాట్సాప్ స్టేటస్ లు -
ఫ్లై దుబాయ్ ఘటన.. కాక్‌పిట్‌లో గొడ్డలి ఎందుకు ఉంటుంది, ఇద్దరు పైలట్ల నియమమేంటి.? -
కడుపులో చెత్తను తొలగించి హెల్తీగా ఉంచే కొత్తిమీర పొంగలి.. ఇడ్లీ కంటే ఈజీగా చేసేయండి.! -
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.! -
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
Sankranthi 2023: సంక్రాంతి రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు.. మరి ఏం చేయాలో తెలుసా..
సంక్రాంతి పండగ రోజు కొన్ని పనులు చేయడం వల్ల ఇంట్లో శ్రేయస్సు తొలగిపోతుంది. కొన్ని పనుల వల్ల మంచి జరుగుతుంది. శ్రేయస్సు, ఆనందం వెల్లివిరుస్తాయి. మకర సంక్రాంతి రోజు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుస
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంక్రాంతి పండగ మరో వారం రోజుల్లో రానుంది. చాలా మందికి ఇష్టమైన పండగ సంక్రాంతి. సంక్రాంతి అంటే రకరకాల పిండి వంటలు, కోడి పందేలు, ఎద్దుల పందేలు, రంగవల్లులు ఇలా చాలా గుర్తుకువస్తాయి. సంక్రాంతి దేశం మొత్తం వివిధ పేర్లతో జరుపుకుంటారు. సూర్యుడు మృగశిర రాశి నుండి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ రోజును మకర సంక్రాంతి అని కూడా పిలుస్తారు.

పంట చేతికి వచ్చిన ఆనందం జరుపుకునే పండగ సంక్రాంతి. ఈ రోజు సూర్యుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. నదుల్లో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. వివిధ వస్తువులు దానం చేస్తుంటారు. కర్రలు, గొబ్బెమ్మలు, ఆవు నెయ్యితో మంటలు వెలిగించి భోగి జరుపుకుంటారు. అయితే సంక్రాంతి పండగ రోజు కొన్ని పనులు చేయడం వల్ల ఇంట్లో శ్రేయస్సు తొలగిపోతుంది. కొన్ని పనుల వల్ల మంచి జరుగుతుంది. శ్రేయస్సు, ఆనందం వెల్లివిరుస్తాయి. మకర సంక్రాంతి రోజు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

సంక్రాంతి రోజు చేయాల్సిన పనులు:
- సంక్రాంతి రోజు సూర్యుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
- నదిలో స్నానం చేసి సూర్యుడిని నమస్కరించాలి.
- వ్యవసాయ భూముల్లో పంటలు పండటానికి సహాయపడిన నీటి వనరులను ఆరాధించారు.
- సంక్రాంతి రోజు శివుడు, విష్ణువు, లక్ష్మీ దేవిని పూజించాలి.
- దేవుళ్లకు నువ్వులు, బెల్లం, పెరుగు, తాజా వరి కోతతో చేసిన అన్నం సమర్పించాలి.
- సంక్రాంతి రోజు ఇంటికి కొత్త చీపురు కొనండి.
- సంక్రాంతి రోజు నువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూలను దేవుళ్లకు సమర్పించాలి. ఎవరికైనా దానం చేయాలి. అలాగే కుటుంబసభ్యులు తినాలి.
- మకర సంక్రాంతి రోజున పెద్దలు, పూర్వీకుల నుండి ఆశీర్వాదం పొందాలి. పూర్వీకులకు ఈ రోజున నమస్కరించడం మంచిది.
- అవసరం ఉన్న వారికి సహాయం చేయాలి.
- నువ్వులు, నల్లని వస్తువులు దానం చేయాలి.

సంక్రాంతి రోజు చేయకూడని పనులు:
- సంక్రాంతి పండగ రోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి.
- పారే నీటిలో కాకుండా ఒకేచోట ఉన్న నీటిలో స్నానం చేయకూడదు.
- స్నానం చేసిన తర్వాత దేవుళ్లను పూజించడం మర్చిపోవద్దు.
- దేవుళ్లను పూజించడానికి ముందు ఆహారం తీసుకోవద్దు.
- సంక్రాంతి ముఖ్య ఉద్దేశమనే ప్రకృతిని ప్రార్థించడం, గౌరవించడం కాబట్టి ఈరోజు చెట్లను నరికివేయడం, మొక్కలను పెకిలించడం లాంటి పనులు చేయవద్దు.
- మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.
- ఈ రోజు ఇళ్లకు వచ్చిన అతిథులను తక్కువ చేసి చూడకూడదు.
- వెల్లుల్లి, ఉల్లిపాయలు తినకూడదు.
- ఎవరైనా సన్యాసి ఇంటికి వస్తే ఖాళీ చేతులతో వెళ్లనివ్వొద్దు.
- సంక్రాంతి రోజు చెడుగా ప్రవర్తించకూడదు. ఎవరితోనూ అనుచితంగా వ్యవహరించకూడదు.
- ఇంటికి వచ్చే బిక్షగాళ్లను, బ్రాహ్మణులను, అవసరం కొద్దీ ఇంటికి వచ్చిన వారిని, నిరుపేదలను ఖాళీ చేతులతో పంపించకూడదు.
నదీ జలాల్లో పవిత్ర స్నానం చేయడం, సూర్యుడికి, శని దేవునికి నైవేద్యాలు సమర్పించడం, గాలిపటాలు ఎగురవేయడం ఈ వేడుకను జరుపుకునే విలక్షణమైన మార్గాలు. ఈ సందర్భాన్ని జరుపుకుంటున్నప్పుడు, మీరు తప్పనిసరిగా చేయవలసిన అనేక అంశాలు ఉన్నాయి. సరళంగా చెప్పాలంటే, ఇతరులను బాధపెట్టే, ప్రకృతికి హాని కలిగించే పనులు చేయకూడదు. అలాగే సంక్రాంతిని పెద్దల పండగ అని కూడా పిలుస్తారు. అంటే పూర్వీకులను, పితృ దేవతలను సంక్రాంతి రోజు స్మరించుకుంటారు. వారి పూజించి, వారికి ఇష్టమైన వంటకాలు సమర్పిస్తారు.



Click it and Unblock the Notifications
