Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు ఆకాశాన్ని అంటుతాయి, ఎలా చేసుకుంటారో తెలుసా?
సంక్రాంతి అనగానే గుర్తొచ్చేవి ఆంధ్రలో జరిగే వేడుకలు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమలను చాలా అట్టహాసంగా జరుపుకుంటారు. కోడిపందేలు, ఎద్దుల పరుగులు, రంగవల్లులు, పిండి వంటలు ఇలా చాలా ఆకట్టుకునే విషయాలు ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగే పండగల్లో అతి ముఖ్యమైనది సంక్రాంతి పండగ. చాలా మందికి బాగా ఇష్టమైన పండగ సంక్రాంతి. సంక్రాంతి రోజు ఊర్లలో కనిపించే ఆ వాతావరణమే వేరు. సూర్యుడు 12 రాశుల గుండా పూర్వ రాశి నుండి ఉత్తర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. రైతులు పండించిన పంట చేతికి వచ్చే సందర్భంలో సంక్రాంతి జరుపుకుంటారు. అందుకే సంక్రాంతి పండగను రైతుల పండగ అంటారు.

సంక్రాంతి అనగానే గుర్తుకువచ్చేది పల్లె వాతావరణం, పాడి పంటలు. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం చేసే వారు కూడా సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తుంటారు.
సంక్రాంతి అనగానే చాలా మందికి గుర్తొచ్చేవి ఆంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో జరిగే వేడుకలు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమలను చాలా అట్టహాసంగా జరుపుకుంటారు. కోడిపందేలు, ఎద్దుల పరుగులు, రంగవల్లులు, పిండి వంటలు ఇలా చాలా ఆకట్టుకునే విషయాలు ఉంటాయి.

భోగి నుండి సంబరాలు మొదలు
తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానం చేస్తారు. ఇంట్లోని పాత వస్తువులతో, కర్రలతో భోగి మంటలు వెలిగిస్తారు. వీధి వాళ్లంతా కలిసి ఆ మంటల వద్ద చేరుతారు. భోగి రోజు చిన్నపిల్లలకు భోగి పండ్లతో స్నానం చేయిస్తారు. భోగి రోజు అందరూ కొత్త బట్టలు ధరిస్తారు.
కొంత మంది రైతులు భోగి రోజు సాంప్రదాయంగా కొంత భూమిలో సాగు పనులు ప్రారంభిస్తారు. నీరు పారించడాన్ని పులకేయడం అంటారు. భోగి రోజు నీరు పారించడాన్ని భోగి పులక అంటారు.

సంక్రాంతి రోజు అసలు సిసలైన వేడుకలు
- సంక్రాంతి రోజున తెల్లవారుజామునే లేచి ముగ్గులు వేస్తారు. రకరకాల రంగులతో ఆ ముగ్గులను వేస్తారు. సంక్రాంతి రంగవల్లులు అంటే వీధిలో పెయింటింగ్‌లు వేసినట్లుగానే ఉంటాయి. రంగవల్లుల్లో గొబ్బెమ్మలను పెడతారు. గొబ్బెమ్మల చుట్టూ గొబ్బెమ్మల పాటలు పాడతారు.
- ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న రకరకాల పిండి వంటలను దేవుళ్లకు సమర్పిస్తారు.
- అందంగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతారు. వాటితో రకరకాల విన్యాసాలు చేయిస్తారు. డోలు సన్నాయి గంగిరెద్దులు సంక్రాంతి పండగకు ప్రతిబింబం లాంటివి.
- హరిదాసులు ఇంటింటికి తిరుగుతూ భిక్షం అడుగుతారు.
- మకర సంక్రాంతి రోజున దానాలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని చెబుతారు. గత పాపపుణ్యాలు తొలగిపోతాయని అంటారు.
- మకర సంక్రాంతి రోజున ఆడపడుచులను, కొత్త అల్లుల్లను ఇంటికి పిలిచి కొత్త బట్టలు పెడుతుంటారు.
- మూడో రోజు కనుమ పండగను జరుపుకుంటారు.
- బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.
- ఈ పండగ దినాల్లో కోల్ల పందాలు నిర్వహిస్తారు.
- కనుమ రోజున ఆవులు, దూడలు, ఎద్దులను శుభ్రంగా కడుగుతారు. వాటి కొమ్ములను అందంగా అలంకరిస్తారు. కొమ్ములకు డబ్బుల మూట కడతారు.
- అందంగా అలంకరించిన పాడి పశువులను వీధుల్లో తిప్పుతారు. పశువుల కొమ్ములకు ఉండే మూటలను తీసుకునేందుకు అందరూ ఎగబడతారు. వారు చేసే గోలతో పశువులు కంగారులో అవి పరుగులు పెడతాయి.
- సాయంత్రం అయ్యాక పశువులు ఒక చోట చేరుతాయి. వాటిపై నీటిని చల్లి వాటి కొమ్ములకు కట్టిన డబ్బుల మూటను ఇంటికి తీసుకెళ్తారు.
- లక్ష్మీ దేవి ఇంటికి వస్తున్నట్లు భావిస్తూ వాటిని ఇంటికి స్వాగతిస్తారు.
- ఏపీలో జరిగే కోడి పందేలు ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కోడి పందేల్లో పాల్గొవడానికి వివిధ రాష్ట్రాల నుండి వస్తారు.
- కోడి పందేలను చాలా మంది తమ ప్రతిష్టగా భావిస్తారు. అందులో తమ కోడి ఓడిపోతే తమ పరువు పోయిందన్నట్లుగా భావిస్తారు.
- కోడి వీరోచితంగా పోరాడుతుంటే తమ పౌరుషానికి చిహ్నంగా భావించే చాలా మంది పందెంరాయుళ్లు ఉన్నారు గోదావరి జిల్లాల్లో.
- పందేలు ఒకవైపు జరుగుతుంటే మరోవైపు వాటిపై బెట్టింగ్ కాసే వాళ్లు చాలా మంది ఉంటారు.
- సంక్రాంతి వచ్చిందంటే గోదావరి జిల్లాల్లో మొదలయ్యే పండుగ కోడిపందేలే. దాదాపు కోట్ల రూపాయల్లో పందేలు జరుగుతుంటాయి.
- కోడిపందెంలో గెలిచిన కోడికి ఎంత ప్రత్యేకత ఉంటుందో.. అలాగే ఓడిపోయి చనిపోయిన కోడికి కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. ఓడిపోయి చనిపోయిన కోడి మాంసాన్ని వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తారు.

కనుమ రోజు ఏం చేస్తారంటే..




Click it and Unblock the Notifications