For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారతదేశ మొట్టమొదటి నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మనం నమ్మలేని నిజాలు...

ఈరోజు(మే 9వ తేదీ) రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క 160వ జయంతి. ఈ సందర్భంగా ఆయన గురించి అనేక ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకుందాం...

|

మన భారతదేశానికి జాతీయ గీతాన్ని అందించిన గొప్ప విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో ఒకటైన నోబెల్ అవార్డును సైతం ఆసియాలోనే మొట్టమొదటిసారిగా అందుకున్న ఏకైక వ్యక్తి. 'గీతాంజలి' కావ్య రచనకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది.

Interesting Facts about Rabindranath Tagore

ఠాగూర్ మానవ విముక్తి తత్వాన్ని తన గుండె లోతుల్లో పెంచి పోషించాడు. ఈయన కవితలు, పాటలు, కథలు, నవలలు, నేటికీ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రవీంద్రనాథ్ ఠాగూర్ మన మనసులలో, ఆలోచనలలో ఎప్పుడూ సజీవంగానే జీవిస్తూ ఉంటాడు. అంతటి గొప్ప కవి యొక్క పుట్టినరోజు ఈరోజు(మే 9వ తేదీ) ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

ఠాగూర్ జననం..

ఠాగూర్ జననం..

రవీంద్రనాథ్ ఠాగూర్ కలకత్తా మహానగరంలోని బ్రహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్, తల్లి శారదాదేవి. ఈ దంపతులకు 13వ సంతానం ఠాగూర్. ఈయన చిన్నతనంలోనే ఆమె తల్లి మరణించారు. దీంతో ఆయన నాలుగు గోడల మధ్యే బతకాల్సి వచ్చేది. బయటి ప్రపంచంతో పెద్దగా సంబంధాలు ఉండేవి కావట.

ప్రపంచం అనే రహస్యాన్ని..

ప్రపంచం అనే రహస్యాన్ని..

రవీంద్రుడు చిన్ననాటి నుండే ప్రపంచం అనే రహస్యం గురించి తెలుసుకోవాలని ఎన్నో కలలు కనేవాడట. రవీంద్రనాథ్ ఠాగూర్ 8 సంవత్సరాల వయసులోనే పద్యాలు రాయడం మొదలుపెట్టాడట. ఆయన రాసిన మొట్టమొదటి పద్యం ‘సంపుటి భానుసింహ‘. అయితే దీన్ని బెంగాలీ పండితులు ఆమోదించలేదట.

11 ఏళ్లకు ఉపనయనం..

11 ఏళ్లకు ఉపనయనం..

రవీంద్రనాథ్ ఠాగూర్ కు 11 సంవత్సరాల వయసులో ఉపనయనం జరిగింది. ఆ తర్వాత రవీంద్రుడు తన సోదరులతో కలిసి తండ్రి స్థాపించిన శాంతినికేతన్ ఎస్టేట్ కు వెళ్లాడు. అప్పుడే ఆయన హిమాలయాలలోని డల్హౌసీ, పర్వత ప్రాంతాలను సందర్శించాడు. ఆ ప్రాంతాలు రవీంద్రుని మనసును ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో అక్కడే కొన్ని నెలల పాటు గడిపాడు. ఆ సమయంలోనే ఎందరో ప్రసిద్ధ వ్యక్తుల జీవిత చరిత్రలు, ఆయన తండ్రి జీవిత చరిత్ర, బెంజమిన్ ఫ్రాంక్లిన్(రచయిత) జీవిత చరిత్ర,కాళిదాసు కవిత్వాలతో పాటు తదితర రచనలను ఆకళింపు చేసుకున్నారు. అప్పటి నుండి తాను స్వయంగా రాయడం ప్రారంభించారు.

1878లో ఇంగ్లండుకు

1878లో ఇంగ్లండుకు

రవీంద్రుడు బారిస్టర్ చదివి న్యాయవాది కావాలనేది తండ్రి దేవేంద్రనాథ్ కోరిక. అందుకే 1878లో రవీంద్రుడిని ఇంగ్లండుకు పంపించారు. ఇంగ్లండులో న్యాయ శాస్త్ర కళాశాలలో చేరినప్పటికీ ఆయన బారిస్టర్ పూర్తి చేయలేదు. చదువును మధ్యలోనే ఆపేసి, షేక్స్ పియర్ రచనలు ‘రెలిజియో మెడసి‘, ‘కొరియొలోనస్‘, ‘ఆంటోని క్లియోపాత్రా‘ తదితర వాటిని బాగా ఆకళింపు చేసుకున్నారు. ఇంగ్లీష్ లో మాట్లాడటం, రాయటం నేర్చుకోవడంతో పాటు ఐరిష్, స్పానిష్ జానపద గేయాలను నేర్చుకున్నారట. ఆ తర్వాత 1880లో స్వదేశం చేరుకున్నారు. అప్పటి నుండి బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను యూరప్ దేశాల సంస్క్రుతులను మేళవించి, రెండింటిలోనూ మంచిని, తాను నమ్మిన సిద్ధాంతాలకు అన్వయించాడు.

రవీంద్రుని వివాహం..

రవీంద్రుని వివాహం..

రవీంద్రుడు 1883వ సంవత్సరంలో భవతారిణి శాఖకు చెందిన మృణాళినీదేవితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. ఈయన జమీందారీ వ్యవహరాలు చూసుకుంటూనే రచనలు చేసేవారు. అంతేకాదు అందులోని నిర్వహణా లోపాలను సవరించేశారు. వ్యవసాయ భూములను రైతులకు అప్పగించి, వారి నుండి నామమాత్రపు శిస్తు వసూలు చేసేవారు. 1901లో రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ కు మకాం మార్చుకున్నారు. అక్కడ ఇద్దరు పిల్లల్ని, భార్యను కోల్పోయారు. దీంతో ఆయన విరాగిగా మారిపోయారు. 1905లో రవీంద్రుని తండ్రి కూడా మరణించడంతో ఆయనకు జీవితంపై ఆసక్తి తగ్గిపోయింది. అప్పటినుండి అన్నింటినీ వదిలేసి నెలకు తన రచనల ద్వారా వచ్చే 2 వేల రూపాయల రాయల్టీతో సామాన్య జీవితం గడపడం ప్రారంభించాడు.

అప్పట్లోనే నిరసన..

అప్పట్లోనే నిరసన..

ఠాగూర్ తన రచనలలో చాలా వాటికి స్వయంగా ఆంగ్లానువాదాలు చేశారు. నోబెల్ బహుమతి అందుకున్న అనంతరం బ్రిటన్ మహారాణి ఠాగూర్ కు ‘నైట్‘ బిరుదు ప్రదానం చేశారు. అయితే జలియన్ వాలా బాగ్ దుర్ఘటనలో బ్రిటీష్ సైన్యం భారతీయులను హతమార్చిన సంఘటన ఆయనను తీవ్రంగా కలచివేసింది. దీంతో ఆ బిరుదును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.

మానవులంతా ఒక్కటే..

మానవులంతా ఒక్కటే..

రవీంద్రుడు అనేక దేశాలు సందర్శించి ‘ప్రపంచంలోని మానవులందరూ ఒక్కటే‘ అనే సందేశాన్ని చాటి చెప్పారు. తాను నమ్మిన బ్రహ్మ సమాజ సిద్ధాంతాల ద్వారా మతాలకతీతమైన పరబ్రహ్మ మొక్కటే అందరికీ దైవం అని ప్రచారం చేసి ‘విశ్వకవి‘, ‘గురుదేవ్‘ బిరుదులను శాశ్వతం చేసుకున్నారు. ప్రపంచ పర్యటనలో 35కు పైగా దేశాలలో భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని చాటిచెప్పారు. ఈయన జీవితం ఒక విజ్ణాన భాండాగారం. ఎవరు ఏ కోణంలో వెతికినా దానికి తప్పక వివరణ లభిస్తుంది.

1941లో తుది శ్వాస..

1941లో తుది శ్వాస..

‘గీతాంజలి‘, గోరా, ఘరే బైరే మొదలైన రచనలన్నీ సహజత్వం ఉట్టిపడేలా సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యేలా వాడుక భాషలో, సరళమైన శబ్దాలతో ఉండేలా, దేశభక్తిని, విశ్వమానవ సౌభ్రాతత్వం చాటేలా రెండు గీతాలను భారతదేశం(జనగణమన), బంగ్లాదేశ్ (అమార సోనార్ బంగ్ల) జాతీయ గీతాలను రచించారు. ఈయన కేవలం గీత రచయిత మాత్రమే కాదు.. నాటక రచయిత, నాటక కర్త, వక్త, వ్యాఖ్యతగా బహుముఖ ప్రజ్ణాశాలిగా ప్రసిద్ధి చెందాడు. వీటితో పాటు ప్రపంచ ప్రజలందరినీ ఉత్తేజపరిచే సందేశాన్నిచ్చిన విశ్వకవి 1941వ సంవత్సరంలో ఆగస్టు 7వ తేదీన తుదిశ్వాస విడిచారు.

English summary

Interesting Facts about Rabindranath Tagore

Here we talking about interesting facts about india's first nobel prize winner rabindranath tagore. Read on
Desktop Bottom Promotion