Latest Updates
-
మెంతులు ఆరోగ్యానికి మంచిదే కాదు... ఈ వ్యాధులు ఉన్నవారికి ముప్పూ తేవచ్చు! -
నానమ్మల కాలం నాటి నల్చిన కారం..చికెన్, మటన్ కూడా పోటికి రావు..రోలు, మిక్సీ కూడా అక్కర్లేదు చేత్తోనే.. -
బాబా వంగా అంచనా..అక్టోబర్ 5వ తేదీ నుంచి ఆ 5 రాశుల వారికి రాజయోగం పక్కా! -
తిండి ఆలస్యమైందని దండన.. జొమాటో డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వైరల్ వీడియో.! -
ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఉలవల కారం పొడి..ఒక్కసారి చేస్తే నెల రోజులు నిల్వ..ఇడ్లీ, వేడి అన్నంలోకి బెస్ట్ -
కోడిగుడ్లతో రొటీన్ కూరలు బోర్.. ఈ 'ఎగ్ బటర్ మసాలా' తప్పక ట్రై చేయండి! -
చంద్ర, కేతు సంయోగంతో సింహ రాశిలో గ్రహణం.. చిక్కుల్లో పడబోయే రాశులు ఇవే.! -
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే! -
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.! -
దానిమ్మ తింటే నిజంగానే టెస్టోస్టెరాన్ పెరుగుతుందా.. పురుషులు తెలుసుకోవాల్సిన లాజిక్ ఇదే.!
Rayalaseema Famous Foods: రాయలసీమ అంటే రాగి సంగటి ఒక్కటే కాదు మచ్చా.. ఇంకా సానానే ఉన్నాయ్
రాయలసీమ ప్రాంతాల్లో రాగి సంగటితో పాటు ఇంకా ఏమేం ఫుడ్ ఐటెమ్స్ ఫేమస్సో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల ప్రజలు మంచి భోజనప్రియులు. ఇక రాయలసీమ వాసుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రాయలసీమ అనగానే రాగి సంగటి నాటు కోడి కూర మాత్రమే అనుకుంటారు చాలా మంది. రాయలసీమలో రాగి సంగటి, నాటు కోడి కూర ఫేమస్సే. కానీ అదొక్కటే ఫేమస్ కాదు. ఈ ప్రాంతంలోని రాయలసీమ వాసులు చాలా ఇష్టంగా తినే ఫుడ్ ఐటెమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని క్లాస్ గా ఉంటాయి, మరికొన్ని కారం నషాళానికి అంటేలా మాస్ గా ఉంటాయి.

రాయలసీమ ప్రాంతాల్లో రాగి సంగటితో పాటు ఇంకా ఏమేం ఫుడ్ ఐటెమ్స్ ఫేమస్సో ఇప్పుడు తెలుసుకుందాం.
1. గుంట పునుగులు
రాయలసీమలో ఒక సాంప్రదాయ చిరుతిండి గుంట పునుగులు. మినపపప్పు, బియ్యం పిండితో గుంట పునుగులు తయారు చేస్తారు. కొందరు దోశ, ఇడ్లీ పిండితోనూ తయారు చేస్తుంటారు. కొబ్బరి చట్నీ లేదా ఊరగాయతో గుంట పునుగులు తింటే అద్భుతంగా ఉంటుంది.
2. మిర్చి భజ్జీ, ఉగ్గాని
మరమరాలతో ఉగ్గాని తయారు చేస్తారు. దీనిని కొన్ని ప్రదేశాల్లో బొరుగులు ఉప్మా అని కూడా అంటారు. నానబెట్టిన మరమరాలతో క్యారెట్లు, ఉల్లిపాయలు, సన్నగా తరిగిన టొమాటో, జీలకర్ర, ఆవాలు, మాసాలా వేయించి ఉగ్గాని తయారు చేస్తారు. ఉగ్గానితో పాటు మిర్చీ భజ్జీ క్రేజీ కాంబినేషన్.
3. రొయ్యల ఇగురు
రొయ్యలతో తయారు చేసే మంచి స్పైసీ ఫుడ్ ఇది. గ్రేవీ లేకుండా వండుతారు. గరం మసాలాలు దట్టిస్తారు. తక్కువ గ్రేవీతో భలే టేస్టీగా ఉంటుంది రొయ్యల ఇగురు. దీనిని వేడి వేడి అన్నంతో తింటే అద్భుతః
4. అలసంద వడలు
వడ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ అలసంద వడలు మాత్రం రాయలసీమ ఫేమస్ అనే చెప్పాలి. అలసందలు, పీస్ తో తయారు చేస్తుంటారు. అలసంద వడలను చికెన్ గ్రేవీ, ఆలు కుర్మాతో తింటే మధురంగా ఉంటుంది.
5. కడప కారం దోశ
పేరులో ఉన్నట్లుగానే ఈ కారం దోశ తినడం అందరి వల్ల అయ్యే పని కాదు. కడప జిల్లాలో చాలా ఫేమస్ ఈ కారం దోశలు. కడప కారం దోశ, బొంబాయి చట్నీ కాంబినేషన్ అదిరిపోవాలంతే. కారం దోశతో పాటు వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆవపిండితో చేసే చట్నీ కూడా బాగుంటుంది.
6. గోంగూర మాంసం
గోంగూరతో కలిపి చేసే మాంసం కూర ఇది. కొందరు చికెన్ తో, మరికొందరు మటన్ సహా ఇతర మాంసంతో తయారు చేస్తుంటారు. అయితే ఇందులో గోంగూర కామన్ ఇంగ్రీడియెంట్ అని మాత్రం మర్చిపోవద్దు.
7. మటన్ ఖీమా బాల్స్
మటన్ అసలైన రుచిని ఆస్వాదించాలనుకుంటే మటన్ ఖీమా బాల్స్ తినాల్సిందే. ఇందులో తక్కువ మొత్తంలో మసాలా వాడతారు. మిగతా పదార్థాలన్నీ తక్కువ మొత్తంలోనే ఉంటాయి. మటన్ టేస్ట్ పోకుండా, మటన్ తింటున్న ఫీల్ వచ్చేలా ఉంటాయి ఈ బాల్స్.
8. బొబ్బట్లు
తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ ఈ స్వీట్. అయితే రాయలసీమ రుచుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే బొబ్బట్లు లేకుండా ఆ లిస్టు కంప్లీట్ కాదు.



Click it and Unblock the Notifications
