Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
Parents' day 2022: ఈ రోజును మర్చిపోలేని మధురజ్ఞాపకం చేసేద్దాం
తల్లిదండ్రుల పట్ల ఎలాంటి ప్రేమ, ఆప్యాయతలు, బాధ్యతలు కలిగి ఉండాలో చెప్పేందుకు ఈ పేరెంట్స్ డే ను దేశవ్యాప్తంగా జులై 24న జరుపుకుంటారు.
Parents' day 2022: పిల్లలు తమ తల్లిదండ్రులతో తమ బంధాలను బలోపేతం చేసుకోవడానికి మరియు వారి సంరక్షణ కోసం తాము సిద్ధంగా ఉన్నామని చూపించడానికి పేరెంట్స్ డే ఒక అద్భుతమైన అవకాశం. తల్లిదండ్రులను గౌరవించడం కోసం ప్రతి సంవత్సరం జులై 24న నేషనల్ పేరెంట్స్ డేని జరుపుకుంటారు. తల్లిదండ్రులకు వారి పిల్లల పట్ల నిస్వార్థ అంకితభావం, వారి పిల్లలతో బంధాన్ని పెంపొందించడానికి వారు చేసిన అనేక త్యాగాలకు ధన్యవాదాలు తెలిపే రోజు ఈ పేరెంట్స్ డే.

తల్లిదండ్రుల పట్ల ఎలాంటి ప్రేమ, ఆప్యాయతలు, బాధ్యతలు కలిగి ఉండాలో చెప్పేందుకు ఈ పేరెంట్స్ డే ను దేశవ్యాప్తంగా జులై 24న జరుపుకుంటారు. పిల్లలు తమ తల్లిదండ్రులతో తమ బంధాలను బలోపేతం చేసుకోవడానికి, అలాగే వారికి చూసుకోవడానికి తాము ఉన్నామనే చూపించడానికి పేరెంట్స్ డే నిర్వహిస్తారు.
తల్లిదండ్రుల ప్రాముఖ్యత
కుటుంబంలో ప్రధానమైన వ్యక్తులు తల్లిదండ్రులే. కుటుంబం మొత్తం శ్రేయస్సును కోరుకుంటారు పేరెంట్స్. వారికి ఎలాంటి హాని జరగకుండా కాపాడుకుంటారు. కష్టం తెలియకుండా పెంచాలని తాపత్రయ పడతారు. నష్టం వచ్చినా వారి జీవితంపై ఎలాంటి ప్రభావం పడకుండా జాగ్రత్త పడతారు. పిల్లలు పెరిగే కొద్దీ వారికి సాధ్యమైనంత ఉత్తమమైన ఆర్థిక, సామాజిక భద్రతను అందించాలని కష్ట పడతారు పేరెంట్స్. వారిని మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో ఎంతో కృషి చేస్తారు. పిల్లల ఆరోగ్యం, విద్య మరియు మానసిక శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకుంటారు.

పేరెంట్స్ డే చరిత్ర
మనం సమస్యను ఎదుర్కొన్న ప్రతిసారీ... ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏమిటంటే.. తమ కుటుంబం తమకు అండగా ఉండాలని.వారి నుండి మద్దతు ఆశిస్తారం. కుటుంబ సభ్యులు మన వెనక ఉండి నడిపిస్తే అదో రకమైన ధీమా, ధైర్యం ఉంటుంది. మనం పడిపోతే పట్టుకుంటారు, గాయాలు కాకుండా చూసుకుంటారన్న విశ్వాసం ఉంటుంది. ఈ విశ్వాసం ఉంటే ఎలాంటి భయం, బెరుకు లేకుండా ముందుకు సాగుతాం. జీవితంలోనూ అంతే వేగంగా ఎదుగుతాం. కుటుంబం అందించే ధీమా మరెవరూ అందించలేరు. తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహం మరెవరూ ఇవ్వలేరు. వారిచ్చి భరోసా ఎక్కడా దొరకదు. 1994లో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కాంగ్రెస్ తీర్మానంపై సంతకం చేయడం ద్వారా పేరెంట్స్ దినోత్సవాన్ని చట్ట ప్రకారం జరుపుకుంటున్నారు.

మొదట ఎక్కడ ప్రారంభమైంది?
తల్లిదండ్రుల దినోత్సవం అనేది మొదట యునైటెడ్ స్టేట్స్‌లో ప్రారంభమైంది. మొదటి పేరెంట్స్ డే మరుసటి సంవత్సరం జూలై 28, 1995న జరుపుకున్నారు. నేషనల్ ఆర్కైవ్స్ వెబ్‌సైట్ ప్రకారం, ఈ రోజు మొదటి నేషనల్ పేరెంట్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ద్వారా కూడా గుర్తించబడింది. దీనిని మిస్టర్ క్లింటన్ స్వయంగా అందజేశారు. ఈ రోజును స్మరించుకోవడం వెనుక ఉన్న కారణం తల్లిదండ్రుల విధులు మరియు సూక్ష్మ నైపుణ్యాలకు నివాళులు అర్పించడం. ఈ రోజు తమ పిల్లల జీవితాలకు తల్లిదండ్రుల సహకారం పట్ల సమాజం యొక్క గౌరవాన్ని ప్రదర్శిస్తుంది మరియు పిల్లలను పెంచడంలో పడిన శ్రమను అభినందిస్తుంది.

పిల్లలు తమ తల్లిదండ్రులకు నివాళులు అర్పించేందుకు తల్లిదండ్రులతో నాణ్యమైన సమయాన్ని గడపవచ్చు. నేషనల్ పేరెంట్స్ డే జరుపుకోవడానికి ఇక్కడ కొన్ని మంచి మార్గాలు ఉన్నాయి: పేరెంట్స్ డేని ఇలా జరుపుకోండి
1. తల్లిదండ్రులకు తగిన గౌరవం ఇస్తున్నామని, వారంటే మీకు ఎంతో ప్రేమ ఉందని కృతజ్ఞతా పూర్వకంగా చెప్పాలి
2. తల్లిదండ్రులు మీ సమయం తప్ప మరేమీ అడగరు. కాబట్టి, మీ తల్లిదండ్రులతో తగినంత సమయం గడపడానికి వీలు కల్పించుకోండి. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్న వారు తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి కలవండి.
3. మీరు రెస్టారెంట్, గార్డెన్, మ్యూజియం, చిన్న విహార యాత్రకు తీసుకువెళ్లండి. వారికి ఏది ఇష్టమో అది చేసి వారిని ఆనందపరచండి. ఏదైనా ట్రిప్ కు ప్లాన్ వేసి వారిని ఆశ్చర్యపరచవచ్చు.
4. వారిని కొన్ని సాహస క్రీడలకు తీసుకెళ్లండి.
5. కుటుంబ విహారయాత్రకు ప్లాన్ వేయండి.
6. వారికి రుచికరమైన విందును సిద్ధం చేయండి.
7. బయటకు తీసుకు వెళ్లి సినిమా చూపించండి.
8. వారికి బహుమతి ఇవ్వండి. అది ఏదైనా కావొచ్చు.. స్వీట్లు, పువ్వులు, చాక్లెట్లు, చేతి గడియారం, హ్యాండ్‌బ్యాగ్, వారికి ఇష్టమైన పాటల సేకరణ, కార్డ్‌లు, కేక్ మొదలైనవాటిని బహుమతిగా ఇవ్వండి.
9. మీ ఇంటిని శుభ్రపరచండి మరియు ఇంటి పనులను చేయడం ద్వారా వారికి విశ్రాంతి ఇవ్వండి.
10. వారి సమస్యలను వినండి. వాటిని అర్థం చేసుకోండి. వారిని ఒత్తిడి లేకుండా చేయడానికి ప్రయత్నించండి.
11. పాత కుటుంబ చిత్రాలు మరియు వీడియోలను కలిసి చూడండి.
ప్రతి రోజూ తల్లిదండ్రుల దినోత్సవం లాగే ఉండండి. మీ విషయంలో పేరెంట్స్ ఎప్పుడూ సెలవు తీసుకోరు. కాబట్టి వారి త్యాగాలను గుర్తించడానికి, వారిని సంతోషంగా చూసుకోవడానికి ఒక్క రోజు సరిపోదని గుర్తించండి. మీరు మీ తల్లిదండ్రులను ఎంతగా ప్రేమిస్తున్నారో వారికి తెలిసేలా చేయండి. ప్రేమ అనేది ఎప్పుడైనా వ్యక్తీకరించాలి.. అప్పుడే వారికి తెలుస్తుంది.



Click it and Unblock the Notifications