Latest Updates
-
చంద్ర, కేతు సంయోగంతో సింహ రాశిలో గ్రహణం.. చిక్కుల్లో పడబోయే రాశులు ఇవే.! -
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే! -
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.! -
దానిమ్మ తింటే నిజంగానే టెస్టోస్టెరాన్ పెరుగుతుందా.. పురుషులు తెలుసుకోవాల్సిన లాజిక్ ఇదే.! -
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'! -
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.!
2023లో ఫిట్‌గా ఉండాలంటే ఈ హెల్త్ టిప్స్ పాటించండి, వీటితో ఆరోగ్యం, ఆనందం
గతం గతః, అయిందేదో అయిపోయింది. ఇక నుండి అయినా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు ఏమేం చేయోలో, ఎలాంటి రిజల్యూషన్స్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
2022 ఏడాది దాదాపు ముగిసిపోయింది. మరో రెండు రోజుల్లో 2023 సంవత్సరంలోకి ప్రవేశించనున్నాం. న్యూ ఇయర్ అనగానే రిజల్యూషన్స్ అంటూ ఒక పదం బాగా సర్క్యూలేట్ అవుతుంది. ఈ ఏడాది ముగిసిపోయింది, వచ్చే ఏడాదైనా మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకుందామని చాలా మంది అనుకుంటారు. ఆరోగ్యంగా, ఫిట్‌నెస్ పరంగా, మానసిక, భావోద్వేగ చాలా అంశాల పరంగా మెరుగవ్వాలని అనుకుంటారు. అలా వచ్చిందే రిజల్యూషన్ పదం.

కోవిడ్-19 మహమ్మారి మనకు మంచి రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యం, శారీరక దృఢత్వం యొక్క ప్రాముఖ్యతను తెలిసేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వ్యక్తులు ఇప్పుడు జీవితంలోని ఇతర అంశాల కంటే తమ ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఫిట్‌గా ఉండటం, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం ఒక్క రోజులో అయ్యే పని కాదు. కొన్ని రోజుల పాటు అంకితభావంతో సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు, వర్కవుట్స్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండగలం.
గతం గతః, అయిందేదో అయిపోయింది. ఇక నుండి అయినా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు ఏమేం చేయోలో, ఎలాంటి రిజల్యూషన్స్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఫ్యాడ్ ఫుడ్‌లకు దూరంగా ఉండండి
వివిధ రకాల ఫ్యాడ్ డైట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రారంభంలో బాగా పని చేస్తాయి. భారీ బరువు తగ్గడానికి దారితీస్తాయి. కానీ అవి స్థిరంగా పనిచేయవు. కొంతకాలం తర్వాత, పోషకాహార లోపాలు, బలహీనత, డీహైడ్రేషన్, మానసిక కల్లోలం కూడా ఉండవచ్చు. మీ ఆహారంలో ఫైబర్, ప్రోటీన్ మరియు ఇతర ముఖ్యమైన పోషకాలను జోడించడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కొంత కాలం పాటు స్థిరంగా బరువు తగ్గడం ఉత్తమం.

2. ఒత్తిడి లేకుండా చూసుకోండి
ఒత్తిడి.. ఇది అనేక శారీరక, మానసిక సమస్యలకు కారణం. ఒత్తిడి వల్ల సంబంధాలు కూడా దెబ్బతింటాయి. అందుకే వీలైనంతగా ఒత్తిడికి దూరంగా ఉండేలా చూసుకోవాలి. అతిగా ఒత్తిడి కల్పించే అంశాలకు దూరంగా ఉండాలి. వ్యక్తిగత ప్రశాంతతకు, కుటుంబ ప్రశాంతతకు భంగం కలిగించే ఆ ొత్తిడికి దూరంగా ఉండటమే ఉత్తమం. ఉద్యోగంలో, వ్యాపారంలో ఒత్తిడి సహజం. అలాంటి ఒత్తిడికి దూరంగా ఉండేందుకు వారాంతంలో ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో ఔటింగ్ ప్లాన్ చేసుకోవాలి.

3. యోగా, ప్రాణాయామం
నిరాశ ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది. ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో అనుకున్న పని జరగకపోతే నిరాశ వస్తుంది. సంబంధంలో కూడా నిరాశ వచ్చి తీరుతుంది. సమయం, సందర్భం వల్ల నిరాశ నిస్పృహలు వస్తాయి. ఇది ఎవరి లైఫ్‌లో అయినా సాధారణం. ఇలాంటి సందర్భాల్లో యోగా, ప్రాణాయామం తప్పకుండా ఉపయోగపడతాయి. యోగా సాధన చేయడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యం ఉండొచ్చు. ప్రాణాయామం చేయడం వల్ల ఒత్తిడి, నిరాశ లాంటి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవచ్చు. యోగా, ప్రాణాయామం మానసిక స్థితిని మెరుగ్గా ఉంచడంలో సహాయపడతాయి. ఈ పద్ధతులు దీర్ఘకాలిక వ్యాధులను చక్కగా నిర్వహించడంలో కూడా సహాయపడతాయి.

4. స్క్రీన్‌టైమ్‌ను తగ్గించుకోండి
ఆధునిక కాలంలో, గాడ్జెట్‌లు, కంప్యూటర్‌లకు దూరంగా ఉండటం కష్టం. పని చేస్తున్నప్పుడు స్క్రీన్‌లకు అతుక్కొని ఉంటారు. విశ్రాంతి సమయంలో కూడా గాడ్జెట్‌లపై ఆధారపడతారు. ఈ నూతన సంవత్సరం 2023 మీ ప్రియమైన వారితో కొంత గాడ్జెట్-రహిత సమయాన్ని గడపడం అలవాటు చేసుకోండి. ఇది మీ సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా మీ మనస్సుకు ప్రశాంతత కల్పిస్తుంది.

5. హాబీ నేర్చుకోండి
ప్రతి వ్యక్తికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. వాటిని రోజూ లేదా అప్పుడప్పుడు క్రమం తప్పకుండా చేయడం వల్ల అవి అలవాట్లుగా మారతాయి. ఉదయం జిమ్‌కు వెళ్లడం, వ్యాయామం చేయడం, నడక, పరుగు, లేదా ఏదైనా ఆర్ట్ నేర్చుకోవడం, యోగా, ధ్యానం ఇలాంటిది ఏదైనా ఒక దానిని అలవాటుగా చేసుకోవాలి.
హాబీలు ప్రతి వ్యక్తి జీవితంలో ఊరటను కల్పిస్తాయి. పని ఒత్తిడి, వ్యాపారంలో ఎదురయ్యే ఆందోళన, బంధంలో ఏర్పడే ప్రెజర్ వంటి వాటి నుండి ఆ హాబీలు ఊరట కల్పిస్తాయి.



Click it and Unblock the Notifications
