Latest Updates
-
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.! -
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.! -
బ్లాక్ కాఫీ vs గ్రీన్ టీ.. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కి ఈ రెండింటిలో ఏది బెస్ట్?
Indian Foods in Vizag: ఫేమస్ ఇండియన్ ఫుడ్స్.. వైజాగ్‌లో ఏది ఎక్కడ దొరుకుతుందో తెలుసా?
కేరళలో ఇడియప్పం, పంజాబ్ లో ఆలూ పరాటా, మధ్యప్రదేశ్ లో పోహా, తమిళనాడులో వెన్ పొంగల్ లాంటివి ఫేమస్. వీటిని టేస్టు చేయాలంటే ఆయా రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మన వైజాగ్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఫేమస్ ఫుడ్స్ ఎక్కడెక్క
దేశంలో ఎన్నో రాష్ట్రాలు, ఒక్కో రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలు, ఒక్కో చోట ఒక్కో రకమైన ఆహార పదార్థం ఫేమస్ అయి ఉంటుంది. వాటిని అక్కడి వారు ఎక్కువగా తింటుంటారు. తెలుగు రాష్ట్రాలకు వస్తే మనోళ్లు భోజన ప్రియులు. కొత్త ప్రాంతానికి వెళ్తే అక్కడి ప్రత్యేక రుచులు ఏంటో తెలుసుకుని మరీ టేస్టు చూసే ఫుడ్ లవర్స్ ఎంతో మంది ఉంటారు.

కేరళలో ఇడియప్పం, పంజాబ్ లో ఆలూ పరాటా, మధ్యప్రదేశ్ లో పోహా, తమిళనాడులో వెన్ పొంగల్ లాంటివి ఫేమస్. వీటిని టేస్టు చేయాలంటే ఆయా రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మన వైజాగ్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఫేమస్ ఫుడ్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇడియప్పం (కేరళ) - మల్లు విష్
కేరళలో ఇడియప్పం చాలా ఫేమస్. ప్రసిద్ధ భారతీయ వంటకాల్లో ఇది కూడా ఒకటి. దీనిని కడల కర్రీ, కొబ్బరి పాలతో తింటే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఇడియప్పంను స్ట్రింగ్ హాప్పర్, నూల్ పుట్టు, ఒట్టు షావిగే వంటి పేర్లతో పిలుస్తారు. ఈ సాంప్రదాయ కేరళ వంటకం వైజాగ్ లోని మల్లు విష్ లో లభిస్తుంది.

ఖమన్ ధోక్లా - గుజరాత్
ఖమన్ ధోక్లా గుజరాత్ లోని ప్రసిద్ధ వంటకం. ధోక్లాను మసాలా పుదీనా చట్నీ, వేయించిన మిర్చీలను టాపింగ్స్ గా అందిస్తారు. వైజాగ్ లోని స్వీట్ ఇండియాలో ఖమన్ ధోక్లా లభిస్తుంది.
వైజాగా CBM కాంపౌండ్ లో, సంపత్ వినాయక్ టెంపుల్ రోడ్డులో ఉంటుంది స్వీట్ ఇండియా. ఘుమఘుమలతో ఎప్పుడూ సాదర స్వాగతం పలుకుతుంది.

వెన్ పొంగల్ - తమిళనాడు
వెన్ పొంగలు తమిళనాడు ప్రసిద్ధ వంటకం. అన్నం, పప్పు, మిరియాలపొడితో తయారు చేస్తారు. వేడి వేడి సాంబార్, కొబ్బరి చట్నీతో వెన్ పొంగల్ తింటే అద్భుతంగా ఉంటుంది. వైజాగ్ లోని హోటల్ మా నేతి విందులో వెన్ పొంగల్ ను మంచి సువాసన గల నెయ్యితో అందిస్తారు. రుచి అద్భుతంగా ఉంటుంది.
వైజాగ్ రామ్ నగర్ లోని సెవెన్ హిల్స్ హాస్పిటల్ ఎదురుగా ఉంటుంది హోటల్ మా నేతి విందు. ఇప్పుడే వెళ్లి ఆరగించండి.

పోహా - మధ్యప్రదేశ్
తెలుగు రాష్ట్రాల్లోనూ పోహా చాలా ఫేమస్. మధ్య ప్రదేశ్ వాసులు ఎక్కువగా, ఇష్టంగా తినే వంటకం ఇది. వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తుంటారు. పౌవా, సిరా, చిరా, అవల్ అని అంటారు. వైజాగా లో శ్రీ శ్యామ్ రెస్టారెంట్ లో మధ్యప్రదేశ్ ఫ్లేవర్డ్ పోహా దొరుకుతుంది.
వైజాగ్ దాబా గార్డెన్స్ సమీపంలో HDFC బ్యాంకు ముందు వచ్చే లెఫ్ట్ లేన్ లో ఉంటుంది శ్రీ శ్యామ్ రెస్టారెంట్.

ఆలూ పరాఠా - పంజాబ్
ఆలూ పరాఠా.. ఈ పంజాబ్ కు చెందిన వంటకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆలూ పరాఠా అంటే చాలా మందికి తెలిసిన వంటకమే. మంచి టేస్టీ ఆలూ పరాఠా కావాలంటే మాత్రం రియల్ దీపక్ పంజాబీ దాబాకు వెళ్లాల్సింది.
వైజాగ్ అసిల్మెట్ట జంక్షన్ లో తిరుమల ఆర్కేడ్ వద్ద ఉంటుంది రియల్ దీపక్ పంజాబీ దాబా.



Click it and Unblock the Notifications
