For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అజారుద్దీన్ సెకండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగుతోందా... అజారుద్దీన్ గురించి ఆసక్తికరమైన విషయాలు...

మహమ్మద్ అజారుద్దీన్ 1984లో ఇంగ్లాంగ్ పై భారత జట్టు తరపున ఇంటర్నేషనల్ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ నుండే తన బ్యాటింగ్ తీరుతో అందరి ప్రశంసలు అందుకున్నాడు.

|

అప్పటివరకు క్రికెట్ ఆటలో మన తెలుగు వారి తెగువ ఎంతలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. ఆయన ఆరంగేట్రం చేసిన తొలి మ్యాచ్ లోనే తన సత్తా ఏంటో చూపాడు. ఇంగ్లాండ్ తో ఆడిన తొలి మ్యాచ్ లోనే అర్థసెంచరీకి పైగా పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

Unknown Facts About Mohammad Azaruddin

అతనే మన తెలుగు బిడ్డ మహమ్మద్ అజారుద్దీన్. తన బ్యాటింగ్ శైలితో ప్రత్యర్థులు తొలి ఓవర్ నుండే బెంబేలెత్తించేవాడు. అజారుద్దీన్ భారత క్రికెట్ లో ఆడటం మొదలుపెట్టాక.. అప్పటివరకు ఉన్న ఇండియన్ టీమ్ వేరు..

Unknown Facts About Mohammad Azaruddin

అజారుద్దీన్ ఎప్పుడైతే ఇండియన్ కెప్టెన్ అయ్యాడో అప్పటివరకు ఉన్న భారత క్రికెట్ జట్టు వేరు.. అది ఎంతలా అంటే తను అడుగుపెట్టినప్పటి నుండి అజారుద్దీన్ కు ముందు.. అజారుద్దీన్ తర్వాత అనేంతలా భారత క్రికెట్ జట్టులో మార్పులు తీసుకొచ్చాడు.

Unknown Facts About Mohammad Azaruddin

అప్పట్లో ఆయన ట్రెండ్ సెట్టర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. అతని బ్యాటింగ్ స్టైల్, మైదానంలో చురుకైన ఫీల్డింగ్, అతని ఆశ్చర్యకరమైన నిర్ణయాలతో భారత జట్టును గెలుపు బాట పట్టించడంలో కీలకపాత్ర పోషించాడు.

Unknown Facts About Mohammad Azaruddin

అయితే అతని కెరీర్ చివర్లో కొన్ని ఆరోపణల వల్ల అజారుద్దీన్ ప్రతిష్ట బాగా దెబ్బతిన్నది. అయితే ఇటీవలే తన కెరీర్ లో రెండో ఇన్సింగ్స్ మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాల క్రితం కాంగ్రెస్ తరపున రాజకీయాల్లో అడుగు పెట్టాడు. అనంతరం హైదరాబాద్ క్రికెట్ అసొసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఏక్రీగవంగా ఎన్నికయ్యాడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

అజార్ జననం..

అజార్ జననం..

మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో 1963, ఫిబ్రవరి 8వ తేదీన జన్మించాడు. అతని తండ్రి పేరు కూడా మహమ్మద్ అజారుద్దీన్. తల్లి పేరు యూసఫ్ సుల్తానా.

ప్రాథమిక విద్య..

ప్రాథమిక విద్య..

మహమ్మద్ అజారుద్దీన్ హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక ఆల్ సెయింట్స్ హైస్కూల్ లో చదువుకున్నాడు. ఈ పాఠశాల క్రికెట్ కు చాలా ప్రసిద్ధి చెందింది.

తొలి మ్యాచ్..

తొలి మ్యాచ్..

మహమ్మద్ అజారుద్దీన్ 1984లో ఇంగ్లాంగ్ పై భారత జట్టు తరపున ఇంటర్నేషనల్ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ నుండే తన బ్యాటింగ్ తీరుతో అందరి ప్రశంసలు అందుకున్నాడు.

మొదటి మూడు నెలల్లో..

మొదటి మూడు నెలల్లో..

అప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో మూడో టెస్టులోనే సెంచరీని ఎవ్వరూ సాధించలేదు. అజారుద్దీన్ మాత్రమే భారత్ తరపున క్రికెట్లో మూడో టెస్టులోనే తొలి సెంచరీ సాధించిన క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు. అది కూడా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి సిరీస్ లో ఈ ఫీట్ సాధించాడు.

అర్జున్ అవార్డు..

అర్జున్ అవార్డు..

ఈయన క్రికెట్ లో చేసిన సేవలకు గుర్తింపుగా అర్జున్ అవార్డును అందుకున్నాడు. తన విజయాలను గుర్తించిన భారత ప్రభుత్వం 1986లో ప్రతిష్టాత్మక అర్జున అవార్డును అజారుద్దీన్ కు ప్రకటించింది.

విజయవంతమైన సారథి..

విజయవంతమైన సారథి..

1990 వన్టే మ్యాచుల్లో భారత జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. 2014లో కెప్టెన్ కూల్ ధోని అజారుద్దీన్ అధిగమించేంత వరకు తనే పేరిట రికార్డు అలానే ఉండేది. అంతకుముందు మరో ఇండియన్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా 21 టెస్టు మ్యాచ్ లతో అజారుద్దీన్ తర్వాతి స్థానంలో నిలిచాడు.

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు..

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు..

అయితే 2000 సంవత్సరంలో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ కు సంబంధించి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఫిక్సింగ్ కుంభకోణంలో చిక్కుకున్నాడు. దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అజార్ ను జీవితకాలం నిషేధించింది. అతన్ని అంతర్జాతీయ క్రికెట్లో పాల్గొనకుండా నిషేధించింది.

Photo curotsy

సెకండ్ ఇన్సింగ్స్..

సెకండ్ ఇన్సింగ్స్..

దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అజార్ ఆ తర్వాత 2009 సంవత్సరంలో సెకండ్ ఇన్సింగ్ మొదలుపెట్టాడు. రాజకీయాల్లోకి అదే సంవత్సరం అడుగు పెట్టాడు. 2009వ సంవత్సరం, ఫిబ్రవరి 19వ తేదీన భారత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ నుండి పోటీ చేసి, పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు.

Photo curtosy

వ్యక్తిగత జీవితం..

వ్యక్తిగత జీవితం..

అజారుద్దీన్ తన వ్యక్తిగత జీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు. మొదట నౌరీన్ ను వివాహం చేసుకున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు, అసద్ మరియు అయాజ్ జన్మించారు. అయితే వివాహం జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత వారిద్దరూ విడిపోయారు. విడాకులు తీసుకున్నారు.

మళ్లీ పెళ్లి..

మళ్లీ పెళ్లి..

అయితే 1996లో మోడల్ బిజ్లానీని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈమెతో కూడా 2010లో విడిపోయాడు. ప్రస్తుతం అజారుద్దీన్ ముచ్చటగా మూడోసారి ఢిల్లీకి చెందిన షానన్ మేరీ తల్వార్ తో వివాహం చేసుకున్న వివరాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది తెలీదు.

విషాదం..

విషాదం..

అజారుద్దీన్ కు తీరని శోకం మిగిల్చింది 2011వ సంవత్సరం. ఆ ఏడాది సెప్టెంబర్ 16, 2011న తన కుమారుడు అయాజుద్దీన్ (19) రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

నిషేధం ఎత్తివేత..

నిషేధం ఎత్తివేత..

2012, నవంబర్ 8న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అజారుద్దీన్ పై మ్యాచ్ ఫిక్సింగ్ నిషేధం కేసును కొట్టి వేసింది. జస్టిస్ అశుతోష్ మొహంత,జస్టిస్ క్రిష్ణ మోహన్ రెడ్డిలతో కూడిన డివిజనల్ బెంచ్ తనపై జీవితకాల నిషేధాన్ని ఎత్తివేసింది.

అజార్ బయోపిక్..

అజార్ బయోపిక్..

ఈ మధ్యన బయోపిక్ సినిమాలు ఎక్కువగా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఎన్నో సినిమాలు కూడా వచ్చి వెండితెరపై ఎన్నో విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలోనే అజారుద్దీన్ బయోగ్రఫీకి సంబంధించి కూడా ఓ సినిమా 2016లో విడుదల అయ్యింది. టోనీ డిసౌజా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ‘అజార్‘ అని పేరు పెట్టారు. ఇందలో ప్రాచీ దేశాయ్, నర్గిస్ ఫఖ్రీ, హుమా, ఖురేషిలతో పాటు ఇమ్రాన్ హష్మీ నటించారు. ఇది బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది.

English summary

Unknown Facts About Mohammad Azaruddin

Here we talking about unknown facts about mohammad azaruddin. Read on
Desktop Bottom Promotion