Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు!
ఈ రాశి వారు ఏ విషయంలో రాజీ పడరు.....వెనకడుగు వేయరు...!!
మకరరాశి కాలపురుషుని కర్మ స్థానము. సూర్యుడు ఈ రాశి లో ప్రవేశించినప్పుటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ఆరంభమౌతుంది. వెంఖటేస్వరస్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణము ఈ రాశిలోనిదే. ఈ రాశి వారు జీవితములో ఎదురయ్యే
శిచక్రంలో పదో రాశి మకరం.. ఇది సరి రాశి. పృథ్వీతత్వం, వైశ్య జాతి, సౌమ్య రాశి, పింగళ వర్ణం. శరీరంలో ఇది మోకాళ్లను, పిక్కలను సూచిస్తుంది. ఇది చర రాశి, స్త్రీ రాశి, దీని దిశ దక్షిణం. ఇందులో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం పూర్తిగా, ధనిష్ఠ 1, 2 పాదాలు ఉంటాయి. ఈ రాశి అధిపతి శని. ఇనుము, సీసం, తగరం, కంచు, రాగి, బొగ్గు, చెరకు వంటి ద్రవ్యాలను సూచిస్తుంది.

మకరరాశి కాలపురుషుని కర్మ స్థానము. సూర్యుడు ఈ రాశి లో ప్రవేశించినప్పుటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ఆరంభమౌతుంది. వెంఖటేస్వరస్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణము ఈ రాశిలోనిదే. ఈ రాశి వారు జీవితములో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని స్వంతము చేసుకుంటారు. అంతే కాదు మరెన్నీ ఉన్నతమైన విషయాలను తెలుసుకోవాలంటే...

క్రమశిక్షణ
మకర రాశిలో పుట్టినవారు క్రమశిక్షణకు, కఠిన పరిశ్రమకు, విశ్వసనీయతకు మారుపేరుగా ఉంటారు. చాలా నిరాడంబరంగా కనిపిస్తారు. ప్రతి పనిలోనూ ఆచి తూచి వ్యవహరిస్తారు.

పురోగతికి
పురోగతికి కఠిన పరిశ్రమ మాత్రమే ఏకైక మార్గమని నమ్ముతారు. ఎలాంటి వ్యవహారంలోనైనా రాజీ పడటాన్ని ఏమాత్రం ఇష్టపడరు. ఓపిక, సహనం వీరి తిరుగులేని బలాలు.

ఏమాత్రం ఆత్రపడకుండా
ఏమాత్రం ఆత్రపడకుండా నిదానంగా పనిచేస్తున్నట్లే కనిపిస్తారు. ఓర్పు, సహనాలతో ఎంతటి ఉన్నత లక్ష్యాలనైనా సాధిస్తారు. కార్యాచరణలో ప్రాక్టికల్‌గా వ్యవహరించే వీరికి సెంటిమెంట్లు ఉండవని ఇతరులు అపోహ పడతారు.

పే ప్రేమాభిమానాలకు సానుకూలంగా స్పందిస్తారు.
తమ పట్ల ఇతరులు చూపే ప్రేమాభిమానాలకు సానుకూలంగా స్పందిస్తారు.

. ఎక్కువగా పనిలో నిమగ్నమై ఉండేందుకే ఇష్టపడతారు.
ఎంతటి బాధ్యతనైనా అంకితభావంతో నెరవేరుస్తారు. ఎక్కువగా పనిలో నిమగ్నమై ఉండేందుకే ఇష్టపడతారు.

అలసత్వం చూపేవారి పట్ల కఠినంగా
బద్ధకం, క్రమశిక్షణరాహిత్యం వీరికి అసలు గిట్టదు. తమ పద్ధతులకు భిన్నంగా అలసత్వం చూపేవారి పట్ల కఠినంగాఉంటారు.

సంపదను, పేరు ప్రఖ్యాతులను
సంపదను, పేరు ప్రఖ్యాతులను కష్టపడి సాధిస్తారు. ఎక్కువగా ఏకాంతాన్ని ఇష్టపడతారు. తమను నమ్ముకున్న వారికి నమ్మకమైన ఆసరాగా ఉంటారు. పోటీల జోలికి వెళ్లేందుకు పెద్దగా ఇష్టపడరు గానీ, లక్ష్యసాధనలో మాత్రం వెనుకంజ వేయరు.

, రాజీపడని మొండివైఖరి
గ్రహగతులు అనుకూలించకుంటే, కఠిన క్రమశిక్షణ, రాజీపడని మొండివైఖరి కారణంగా శత్రువులను కొనితెచ్చుకుంటారు. అలర్జీలు, రక్తపోటు, వెన్నెముకకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు.

వీరు తమకి జరిగే అవమానాలను ,
వీరు తమకి జరిగే అవమానాలను , అపజయాలను ఎంతో సహనంతో భరించ గలిగే శక్తి కలిగి ఉంటారు.

పూర్వపు సాంప్రదాయాలన్న మక్కువ ఎక్కువ .
కోపం తొందరగా వస్తుంది. పూర్వపు సాంప్రదాయాలన్న మక్కువ ఎక్కువ . గత కాలం మంచిదని వీరి అభిప్రాయం .
- గతంలో జరిగిన అపజయాన్ని గుర్తుకు తెచ్చుకుని నిరుత్సాహ పడక ఓర్పు తో విజయం సాధించాలని ముందుకు సాగుతారు.
- ఈ రాశి వారు ఒకర్ని విమర్శించరు , చేడుగా మాట్లాడటం చెయ్యరు.



Click it and Unblock the Notifications