Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
లేటెస్ట్ స్టడీ: ఉసిరి జ్యూస్ ని రెగ్యులర్ గా తాగాలి..! ఎందుకు ?
మీరు ఉసిరికాయలు ఇష్టపడతారా ? ఒకవేళ మీకు ఇష్టమైతే.. ప్రతిరోజూ.. ఒక గ్లాస్ ఆమ్లా జ్యూస్ తాగండి. ఉదయాన్నే ముందుగా ఒక గ్లాస్ ఉసిరికాయ రసం తాగితే.. అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి కొన్ని రోజులపాటు.. ఒక గ్లాస్ ఉసిరి జ్యూస్ తాగి చూడండి.. మీ శరీరంలో జరిగే మార్పులు మీరే గమనించండి.
ఉసిరికాయలు చూస్తేనే నోరూరిపోతుంది. పచ్చగా నిగనిగలాడే ఈ ఉసిరికాయ పుల్లపుల్లగా.. వగరుగా.. ఉంటుంది. ఈ ఉసిరికాయను ఎక్కువ జుట్టుకి ఉపయోగిస్తారు. అలాగే పూజలు చేయడానికి, దీపాలు వెలిగించడానికి వాడతారు. అయితే.. అందరికీ అందుబాటులో ఉండే ఈ ఉసిరికాయ జ్యూస్ చేసే మిరాకిల్స్ చాలామందికి తెలియదు.
ఉసిరి జ్యూస్ డయాబెటిస్ తో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలతో పోరాడుతుంది. ట్రెడిషనల్ ఫ్రూట్ గా భావించే ఉసిరికాయనే కాదు.. దీని రసం రెగ్యులర్ గా తాగడం వల్ల డయాబెటిస్ తో పాటు, సెక్స్ లైఫ్ ఇంప్రూవ్ చేస్తుంది. ప్రతిరోజు రెగ్యులర్ గా ఉసిరి జ్యూస్ తాగి చూడండి.. ఎలాంటి వండర్స్ జరుగుతాయో తెలుసుకుంటే మీరు ఈ నియమాన్ని తప్పకుండా పాటిస్తారు..

డయాబెటిస్
ఉసిరికాయలో గాలిక్ యాసిడ్, గాల్లోటిన్, ఎల్లాజిక్ యాసిడ్, కొరినాజిన్ ఉంటాయి. ఇవన్నీ యాంటీ డయాబెటిక్ గా పనిచేస్తాయి. కాబట్టి ఉసిరికాయ రసం తాగడం వల్ల.. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయని తాజా అధ్యయనాలు వెల్లడించాయి.

కొలెస్ట్రాల్
హై కొలెస్ట్రాల్ తో బాధపడేవాళ్లకు ఒక గ్లాస్ ఉసిరి జ్యూస్ వండర్స్ చేస్తుంది. ఉసిరికాయ కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా తేలికగా తగ్గిస్తుందట.

జలుబు, ఫ్లూ
ఆమ్లాలో అనేక మెడిసినల్, థెరపిటిక్ గుణాలున్నాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల.. జలుబు, ఫ్లూ వంటి లక్షణాలు దరిచేరకుండా కాపాడుతుంది.

క్యాన్సర్
యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉసిరికాయలో ఉండటం వల్ల.. క్యాన్సర్ నివారించడంలో సహాయపడతాయి.

నోటి అల్సర్స్
ఉసిరికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు.. మౌత్ అల్సర్స్ ని వేగంగా తగ్గిస్తాయి.

సెక్స్ లైఫ్
ఉసిరిలో అఫ్రోడిసిక్ నేచర్ ఉంటుంది. అలాగే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల.. మగవాళ్లలో స్పెర్మ్ ఉత్పత్తి పెరగడంతో పాటు, సెక్స్ లైఫ్ ఇంప్రూవ్ చేస్తుంది.

ఒత్తైన జుట్టుకి
విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల.. ఉసిరికాయ రసం.. జుట్టుకి చాలా మంచిది. రెగ్యులర్ గా క్రమం తప్పకుండా ఆమ్లా జ్యూస్ ప్రతిరోజూ తాగుతూ ఉంటే.. ఒత్తైన జుట్టు మీ సొంతమవుతుంది.

చర్మానికి
ఆమ్లాలో యాంటీ ఆక్సిడేటివ్ గుణాలు ఉండటం వల్ల .. చర్మాన్ని యంగ్ అండ్ గార్జియస్ గా మారుస్తాయి. అలాగే ఏజింగ్ లక్షణాలను నివారిస్తాయి.



Click it and Unblock the Notifications